Scanda Puranam: పరమేశ్వరునిచే కుమారస్వామికి అందిన స్కంద పురాణ వివరాలు : బ్రహ్మ శ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ-skanda purana details received by kumara swami from parameshwara brahma sri chilakamarthi prabhakara chakravarti sharma ,రాశి ఫలాలు న్యూస్
తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  Scanda Puranam: పరమేశ్వరునిచే కుమారస్వామికి అందిన స్కంద పురాణ వివరాలు : బ్రహ్మ శ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ

Scanda Puranam: పరమేశ్వరునిచే కుమారస్వామికి అందిన స్కంద పురాణ వివరాలు : బ్రహ్మ శ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ

HT Telugu Desk HT Telugu
Dec 01, 2024 10:01 AM IST

వేదవ్యాసుడు రచించిన అష్టాదశ పురాణాలలో 13వ పురాణం ‘స్కాంద (స్కంద) పురాణం’ అని ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తిశర్మ తెలిపారు. 81వేల శ్లోకాలు గల స్కాందపురాణం ద్వారా మనకు అందిన సమాచారం గురించి గుర్తు చేశారు.

స్కంద పురాణం
స్కంద పురాణం (Unsplash)

వేదవ్యాసుడు రచించిన అష్టాదశ పురాణాలలో 13వ పురాణం ‘స్కాంద (స్కంద) పురాణం’ అని ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తిశర్మ తెలిపారు. 81వేల శ్లోకాలు గల స్కాందపురాణం ద్వారా మనకు శివుని జీవిత విశేషాలు, దక్షిణాసియాకు సంబంధించిన భౌగోళిక వివరాలు, తీర్థాలు, క్షేత్రాలు, విశ్వరూపం, వేదాంతం, రత్నశాస్త్రం, వంశావళి వివరాలు ఉన్నాయన్నారు. పరమేశ్వరుడు తన కుమారుడు అయిన స్కందునకు (కుమారస్వామికి) చెప్పినట్లుగా, తండ్రి చెప్పిన అంశాలను స్కందుడు మహర్షులకు చెప్పినట్లుగా ఈ పురాణం మనకు దర్శనమిస్తుందన్నారు.

గుప్తుల కాలం నుంచి అంటే క్రీ.శ. 3వ శతాబ్దం నుంచి వ్యాప్తిలో ఉందని ప్రభాకర చక్రవర్తిశర్మ తెలిపారు. ఇందులో అనేక ప్రక్షిప్తాలు (తర్వాత చేర్చినవి) ఉన్నాయని, క్రీ.శ. 15వ శతాబ్దం వరకూ ఇది మార్పులు, చేర్పులకు లోనైందని ఆయన అన్నారు. ఈ స్కంద పురాణ వ్రాత ప్రతులు నేపాల్‌, భారతదేశ తూర్పు ప్రాంతం, దక్షిణ ప్రాంతం, చైనా దేశాల్లో లభ్యమయ్యాయన్నారు. తొలి ప్రతి భాషాశైలి మహాభారత శైలిని పోలి ఉందని బ్రహ్మశ్రీ ప్రభాకర చక్రవర్తిశర్మ వివరించారు. స్కాందపురాణం రెండు రకాలుగా లభ్యమవుతోందన్నారు. ఒకటి ఖండాల రూపంలో, మరొకటి సంహితల రూపంలో అని ఆయన అన్నారు. ఖండాల ప్రకారం చూసినప్పుడు ఏడు ప్రధాన ఖండాలు ఇందులో ఉన్నాయన్నారు అవి.. 1. మహేశ్వరఖండము 2. వైష్ణవఖండము 3. బ్రహ్మఖండము 4. కాశీఖండము 5. అవన్త్య ఖండము 6. నాగర ఖండము 7. ప్రభాసఖండము అని తెలిపారు. ఈ ప్రధాన ఖండాలను మళ్ళీ ఖండాలుగా ఉపఖండాలుగాను, ఉపఖండాలను అధ్యాయాలుగా విభజించారని బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు.

1. మహేశ్వర ఖండములో నాలుగు భాగాలు (ఉపఖండాలు) ఉన్నాయన్నారు. అవి.. ఎ)కేదారి ఖండము బి)కౌమారి ఖండము సి) అరుణాచల మహాత్మ్యము పూర్వార్థం. డి) అరుణాచల మహాత్మ్యము ఉత్తరార్థం అని ఆయన వివరించారు.

2. వైష్ణవఖండములో ఏడు భాగాలు (ఉపఖండాలు) ఉన్నాయని ప్రభాకర చక్రవర్తిశర్మ తెలిపారు. అవి.. ఎ) వేంకటాచల మహత్మ్యము బి) పురుషోత్తమ (జగన్నాథ) మహత్మ్యము సి) బదరికాశ్రమ మహత్మ్యము డి) కార్తీక మాస మహత్మ్యము ఇ) మార్గశిర మాస మహత్మ్యము ఎఫ్‌) భాగవత మహత్మ్యము జి) వైశాఖమాస మహత్మ్యము హెచ్‌) అయోధ్యా మహత్మ్యము.

3. బ్రహ్మఖండములో మూడు భాగాలు (ఉపఖండాలు) ఉన్నాయని బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ వెల్లడిరచారు. అవి ఎ) సేతుమహత్మ్యము బి) ధర్మారణ్యఖండము సి) బ్రహ్మణోత్తరఖండము అని ఆయన తెలిపారు.

4. కాశీఖండము ఎ) కాశీఖండము పూర్వార్థము బి) కాశీఖండము ఉత్తరార్థము అని రెండు భాగాలని పంచాంగకర్త చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు.

5. అవన్త్య ఖండము ఎ) అవన్త్య మహత్మ్యము బి) అవన్త్య మహత్మ్యము (84 భాగాలు), సి) రేవాఖండము అని మూడు భాగాలుగా ఉన్నట్లు ప్రభాకర చక్రవర్తి శర్మ వివరించారు.

6. స్కందపురాణంలో ఆరవ ఖండము నాగర ఖండమని బ్రహ్మశ్రీ ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు.

7. ప్రభాస ఖండములో నాలుగు భాగాలున్నట్లు ప్రభాకర చక్రవర్తి శర్మ వెల్లడిరచారు. అవి.. ఎ) ప్రభాస మహత్మ్యము బి) వస్త్రాపథ మహత్మ్యము సి) అర్బుద ఖండము డి) ద్వారక మహత్మ్యము అని వివరించారు.

స్కందపురాణము ‘సంహిత’ రూప విభజన విషయానికి వస్తే ఆరు సంహితలుగా ఉన్నట్లు ఆధ్యాత్మిక వేత్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు.

అవి

1. సనత్కుమార సంహిత 2. సూత సంహిత 3. శంకరి సంహిత 4. వైష్ణవి సంహిత 5. బ్రహ్మీ సంహిత 6. సౌరసంహిత అని ఆయన వివరించారు.

పంచాంగకర్త చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ
పంచాంగకర్త చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ
Whats_app_banner