S Jaishankar speaks: ‘ఆ విషయంలో రష్యాపై ఒత్తిడి తేవాలన్న రిక్వెస్ట్ వచ్చింది..’-india got a request to press the russians which we did s jaishankar on ukraine war ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  S Jaishankar Speaks: ‘ఆ విషయంలో రష్యాపై ఒత్తిడి తేవాలన్న రిక్వెస్ట్ వచ్చింది..’

S Jaishankar speaks: ‘ఆ విషయంలో రష్యాపై ఒత్తిడి తేవాలన్న రిక్వెస్ట్ వచ్చింది..’

HT Telugu Desk HT Telugu
Oct 06, 2022 08:44 PM IST

S Jaishankar speaks: రష్యా, ఉక్రెయిన్ యుద్ధంలో ఒక విషయంపై రష్యాపై ఒత్తిడి తేవాలన్న అభ్యర్థన వచ్చిందని భారత విదేశాంగ మంత్రి జై శంకర్ వెల్లడించారు.

<p>న్యూజీలాండ్ ప్రధాని జెసిండాతో భారత విదేశాంగ మంత్రి జై శంకర్</p>
న్యూజీలాండ్ ప్రధాని జెసిండాతో భారత విదేశాంగ మంత్రి జై శంకర్ (PTI)

S Jaishankar speaks: రష్యా, ఉక్రెయిన్ ల మధ్య తీవ్ర స్థాయిలో యుద్ధం కొనసాగుతున్న విషయం తెలిసిందే. అలాగే, అణు కేంద్రం ఉన్న జపోరిఝియాలోనూ ఇరు దేశాల సైనికులు హోరాహోరీ పోరాడుతున్నారు.

S Jaishankar speaks: అణు కేంద్రం రక్షణ

ఈ నేపథ్యంలో, ‘‘జపోరిఝియాలో ఉన్న అణు కేంద్రం రక్షణపై ఆందోళన నెలకొన్నది. ఆ అణుకేంద్రానికి అత్యంత సమీపంలో కూడా యుద్ధం కొనసాగుతోంది. ఒకవేళ, అణు కేంద్రం ధ్వంసమైతే, దాని విపరిణామాలు అత్యంత దారుణంగా ఉంటాయి. దాంతో, ఆ అణు కేంద్రం రక్షణ విషయంలో రష్యాపై ఒత్తిడి తీసుకురావాలని భారత్ పై పలు దేశాల నుంచి తమకు రిక్వెస్ట్ లు వచ్చాయి. వెంటనే స్పందించిన భారత్.. తదనుగుణంగా చర్యలు తీసుకుంది’‘ అని జైశంకర్ వివరించారు.

S Jaishankar speaks: న్యూజీలాండ్ లో..

విదేశాంగ మంత్రి జై శంకర్ ప్రస్తుతం న్యూజీలాండ్ పర్యటనలో ఉన్నారు. న్యూజీలాండ్ లో విదేశాంగ మంత్రి హోదాలో ఆయన పర్యటించడం ఇదే తొలిసారి. ఈ సందర్బంగా ఆ దేశంతో పలు అంతర్జాతీయ, ద్వైపాక్షిక అంశాలపై ఆయన చర్చించారు. రష్యా, ఉక్రెయిన్ యుద్ధ సంక్షోభాన్ని నిలువరించడానికి ఏ రకమైన సాయమైనా చేసేందుకు భారత్ సిద్ధంగా ఉందని ఆయన పునరుద్ఘాటించారు.

Whats_app_banner