Donald Trump : ‘దేశం నుంచి తరిమికొడతా’- వలసదారులపై ట్రంప్ సంచలన వ్యాఖ్యలు..
Donald Trump latest news : అమెరికాలోని అరోరాలో జరిగిన ర్యాలీలో డోనాల్డ్ ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అమెరికాను ఆక్రమించుకున్న క్రిమినల్ చరిత్రగల వలసదారులను దేశం నుంచి తరిమికొడతానని ప్రతిజ్ఞ చేశారు.
‘అమెరికా ఫస్ట్’ అంటూ వలసవాదులపై నిత్యం మండిపడే అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, అగ్రరాజ్యంలో అధ్యక్ష ఎన్నికలకు ముందు సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను అధ్యక్షుడిగా ఎన్నికైతే ‘ఆపరేషన్ అరోరా’ పేరుతో చట్టాన్ని ప్రవేశపెట్టి ఇమ్మిగ్రెంట్స్‌ని జైలులో పెడతానని లేదా దేశ నుంచి పంపిచేస్తానని ప్రతిజ్ఞ చేశారు. ఈ మేరకు కొలరాడోలోని అరోరాలో జరిగిన ర్యాలీలో డొనాల్డ్ ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేశారు. అమెరికాను ఆక్రమించుకున్న దుర్మార్గులు, రక్తసిక్త నేరగాళ్లపై ఆరోపణలు చేస్తూ అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రచారాలను ముమ్మరం చేశారు.
"దేశం ఇప్పుడు ఆక్రమిత అమెరికాగా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకుంది. కానీ కొలరాడోతో పాటు మన దేశం అంతటా ఉన్న ప్రతి ఒక్కరికీ ఒక విషయం చెబుతున్నాను. నేను మీకు ఈ ప్రతిజ్ఞ చేస్తున్నాను: నవంబర్ 5, 2024 అమెరికా విమోచన దినోత్సవం. అరోరాను, ఆక్రమణకు గురైన, ఆక్రమించిన ప్రతి పట్టణాన్ని నేను రక్షిస్తాను. మేము ఈ దుర్మార్గమైన, రక్తసిక్తమైన నేరస్థులను జైలులో ఉంచుతాము లేదా వారిని మన దేశం నుంచి తరిమికొడతాము," అని డొనాల్డ్ ట్రంప్ అన్నారు.
శత్రు దేశాలకు చెందిన విదేశీయులను చుట్టుముట్టి బహిష్కరించడానికి ఫెడరల్ ప్రభుత్వానికి వీలు కల్పించే 1798 నాటి ఏలియన్ ఎనిమీస్ యాక్ట్‌ను ఉపయోగించి వలసవాదుల ముఠాలను ఎదుర్కొంటామని డొనాల్డ్ ట్రంప్ ప్రతిజ్ఞ చేశారు.
“అధ్యక్షుడి ఆఫీస్‌ని స్వీకరించిన తర్వాత ఫెడరల్ లెవల్ స్థాయిలో ఆపరేషన్ అరోరాను చెపడతానని ఈ రోజను నేను ప్రకటిస్తున్నాను. ఇలాంటి నేర చరిత్ర గల ముఠాలను తొలగించెందుకు 1789 ఏలియన్ ఎనిమీస్ యాక్ట్‌ని ప్రయోగిస్తాను. అమెరికా గడ్డపై పని చేస్తున్న ప్రతి వలసవాద క్రిమినల్ నెట్వర్క్ని తొలగిస్తాను,” అని డొనాల్డ్ ట్రంప్ తేల్చిచెప్పారు.
“కమలా హారిస్లాగా సమాజంపై హింసకు పాల్పడే వారికి అమెరికా అధ్యక్షుడు అయ్యే అర్హత లేదు,” అని 2024 అధ్యక్ష ఎన్నికల రిపబ్లికెన్ పార్టీ అభ్యర్థి తెలిపారు.
మెక్సికో నుంచి అక్రమ వలసలు దశబ్దకాలంగా అమెరికాను ఇబ్బందిపెడుతున్నాయి. వాటిని నియంత్రించేందుకు అగ్రరాజ్య చాలా కష్టపడుతోంది. ఈ తరుణంలో ట్రంప్ మరో సంచలన వ్యాఖ్యలు చేశారు. వలసదారులు అమెరికన్లను రేప్ చేసి చంపేస్తారని హెచ్చరించారు.
అరోరా ప్రాంతం ఈ ఏడాది ఆగస్ట్ నుంచి వార్తల్లో ఉంది. సాయుధ లాటినోలు ఒక అపార్ట్మెంట్ బ్లాక్ గుండా దాడి చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ పట్టణంలో లాటిన్ అమెరికా వలసదారులు హింసను ప్రేరేపిస్తున్నారన్న వాదనలకు ఇవి మరింత బలం చేకూర్చాయి.
అమెరికా ఎన్నికల్లో 'అక్టోబర్ సర్‌ప్రైజ్' భయం..
డెమొక్రటిక్ పార్టీ నుంచి భారత సంతతికి చెందిన కమలా హారిస్ యూఎస్ అధ్యక్ష ఎన్నికల్లో బరిలో ఉన్న విషయం తెలిసిందే. కమలా హారిస్- ట్రంప్ పోరుపై ప్రపంచం మొత్తం ఆసక్తిగా ఎదురుచూస్తోంది. యూఎస్ అధ్యక్ష ఎన్నికలకు మరో నెల మాత్రమే మిగిలి ఉంది. అయితే ఇటీవల యూఎస్ పోలింగ్ నోస్ట్రాడమ్‌గా పిలిచే లిచ్‌మన్ చేసిన కామెంట్స్ కూడా హాట్ టాపిక్ అయ్యాయి.
యూఎస్ అధ్యక్ష ఎన్నికల్లో తొమ్మిదింటిని కచ్చితంగా అంచనా వేశారు లిచ్‌మన్. అందుకే ఆయన్ని యూఎస్ ప్రెసిడెంట్ పోల్స్ నోస్ట్రాడమ్ అంటుంటారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో లిచ్‌మాన్ మాట్లాడుతూ.. వైస్ ప్రెసిడెంట్ కమలా హారిస్.. రిపబ్లికన్ అధ్యక్ష అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్‌ను ఓడించనున్నట్లు చెప్పారు. దీనితో అమెరికా ఎన్నికలపై మరింత ఆసక్తి పెరిగింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
సంబంధిత కథనం