Trump hails PM Modi: అమెరికా మాజీ అధ్యక్షుడు, రిపబ్లికన్ అధ్యక్ష అభ్యర్థి డోనాల్డ్ ట్రంప్ భారత ప్రధాని నరేంద్ర మోదీని ప్రశంసల్లో ముంచెత్తారు. మోదీ తనకు మంచి స్నేహితుడని, మంచి మనిషి అని ప్రశంసించారు. ప్రధాని మోదీని ‘టోటల్ కిల్లర్’ గా అభివర్ణించిన ట్రంప్.. మోదీ ప్రధానిగా బాధ్యతలు చేపట్టడానికిి ముందు భారత్ చాలా అస్థిరంగా ఉందని వ్యాఖ్యానించారు.
ఆండ్రూ షుల్జ్, ఆకాష్ సింగ్ హోస్ట్ చేసిన పాడ్ కాస్ట్ లో ట్రంప్ ప్రసంగించారు. ఈ సందర్భంగా ట్రంప్ ప్రపంచ నాయకులపై తన అభిప్రాయాలను వెల్లడించారు. ‘‘మోదీ నాకు మంచి స్నేహితుడు, చాలా మంచి మనిషి కూడా. ఆయన ప్రధానిగా నియమితులు కాకముందు భారతదేశం చాలా అస్థిరంగా ఉండేది. బయట నుంచి చూస్తే ఆయన మీ తండ్రిలా కనిపిస్తున్నారు. అతను చాలా మంచివాడు, టోటల్ కిల్లర్' అని డొనాల్ట్ ట్రంప్ వ్యాఖ్యానించారు.
2019లో టెక్సాస్ లోని హ్యూస్టన్ లో జరిగిన చారిత్రాత్మక 'హౌడీ మోదీ' కార్యక్రమాన్ని డొనాల్డ్ ట్రంప్ గుర్తు చేశారు. ఆ కార్యక్రమంలో పాల్గొనేందుకు ప్రధాని మోదీ (Narendra Modi) అమెరికా వెళ్లి, అక్కడ ఎన్ఆర్జీ స్టేడియంలో భారతీయ అమెరికన్లనుద్దేశించి ప్రసంగించారు. ఆ కార్యక్రమంలో నాటి అధ్యక్షుడైన ట్రంప్ కూడా పాల్గొన్నారు. ‘‘టెక్సాస్ లోని హ్యూస్టన్ లో హౌడీ మోదీ ప్రొగ్రామ్ అద్భుతంగా జరిగింది. దాదాపు 80 వేల మంది హాజరయ్యారు. ఆ సభ క్రేజీగా అనిపించింది. మేము నడుస్తున్నాము. బహుశా ఈ రోజు కూడా నేను అలాంటిది చేయలేకపోవచ్చు’’ అని ఆయన అన్నారు.
భారత్ ను ఎవరైనా, ఏ దేశమైన బెదిరిస్తున్నపరిస్థితుల్లో ప్రధాని మోదీ పూర్తిగా మారిపోతారని ట్రంప్ (trump) వ్యాఖ్యానించారు. మోదీది చాలా దృఢమైన వైఖరి అని ట్రంప్ గుర్తు చేశారు. ఈ సందర్భంగా ట్రంప్ భారత ప్రధాని మోదీ మాటతీరును సరదాగా అనుకరించారు.
టాపిక్