Joe Biden sex secret : ‘అధ్యక్షుడి పదవి కన్నా రూమ్​లో భార్యతో శృంగారం చేయడమే ఇష్టం!’-good sex is secret to joe bidens long marriage new book on first lady says ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Joe Biden Sex Secret : ‘అధ్యక్షుడి పదవి కన్నా రూమ్​లో భార్యతో శృంగారం చేయడమే ఇష్టం!’

Joe Biden sex secret : ‘అధ్యక్షుడి పదవి కన్నా రూమ్​లో భార్యతో శృంగారం చేయడమే ఇష్టం!’

Sharath Chitturi HT Telugu
Oct 01, 2024 12:00 PM IST

Joe Biden wife : వైవాహిక జీవితం దీర్ఘకాలం పాటు కొనసాగాలంటే.. గుడ్​ శృంగారం​ చాలా అవసరం అని ఓ సందర్భంలో అన్నారు అమెరికా జో బైడెన్​. అధ్యక్ష పదవి కన్నా.. భార్యతో ఇంట్లో శృంగారం​ చేయడం ఇష్టమని అన్నారట!

‘అధ్యక్షుడి పదవి కన్నా రూమ్​లో భార్యతో సెక్స్​ చేయడమే ఇష్టం!’
‘అధ్యక్షుడి పదవి కన్నా రూమ్​లో భార్యతో సెక్స్​ చేయడమే ఇష్టం!’ (REUTERS)

Joe Biden's secret for long lasting marriage : 47ఏళ్ల వైవాహిక బంధంతో.. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్​- ఫస్ట్​ లేడీ జిల్​ బైడెన్​లు అనేక మందికి ఆదర్శంగా నిలుస్తున్నారు. ఈ బంధం.. ఇన్నేళ్ల పాటు ఇంత ఆరోగ్యంగా ఎలా ఉంది? అన్న ప్రశ్నకు.. 'గుడ్​ శృంగారం​' కారణం అని ఓ సందర్భంలో జో బైడెన్​ జోక్​ చేశారట!

'అమెరికన్​ ఉమెన్​- ది ట్రాన్స్​ఫార్మేషన్​ ఆఫ్​ ది మోడర్న్​ ఫస్ట్​ లేడీ, హిల్లరీ క్లింటన్​ టు జిల్​ బైడెన్​' అనే పుస్తకాన్ని.. న్యూయార్క్​ టైమ్స్​కి చెందిన వైట్​ హైజ్​ కరస్పాండెంట్​ కాటీ రోజర్స్​ రాశారు. ఈ పుస్తకం.. ఈ వారంలో విడుదలవుతోంది. 276 పేజీలు ఉన్న పుస్తకంలో 'శృంగారం​' గురించి కొన్ని పేరాలు మాత్రమే ఉన్నాయి. కానీ అవి ఇప్పటికే.. ప్రపంచవ్యాప్తంగా హెడ్​లైన్స్​లో నిలిచాయి.

2004లో జో బైడెన్​.. అధ్యక్ష పదవికి పోటీ చేస్తారని అందరు అనుకున్నారు. కానీ ఆయన అప్పుడు పోటీ చేయలేదు. ఇదే విషయంపై ఆయన కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారని పుస్తకంలో ఉంది.

Jill Biden latest news : "అధ్యక్ష పదవి కన్నా.. పిల్లలు పడుకున్నప్పుడు, నా భార్యతో ఇంట్లో శృంగారం​ చేయడాన్ని ప్రిఫర్​ చేస్తాను," అని జో బైడెన్​ అన్నారట! ఆ మాటలు విన్న అక్కడి వారు.. 'జో బైడెన్​.. జిల్​ బైడెన్​ ప్రేమలో మునిగి తేలుతున్నారు,' అని అనుకున్నారట.

"అధ్యక్ష పదవిని గెలవాలని చెప్పి.. జో బైడెన్​ తన బెడ్​రూమ్​ రహస్యాలను బయటకు చెప్పడం తగ్గించేశారు. కానీ.. 'వైవాహిక జీవితం దీర్ఘకాలం పాటు ఆరోగ్యంగా, సంతోషంగా ఉండాలంటే.. గుడ్​ శృంగారం​ చాలా అవసరం' అని ఓసారి జోక్​ చేశారు," అని పుస్తక రచయిత రోజర్స్​ చెప్పారు.

Joe Biden latest news : వాస్తవానికి.. 81ఏళ్ల జో బైడెన్​ మొదటి భార్య జిల్​ కాదు! ఆయన మొదటి భార్య పేరు నైలియా. 1972లో జరిగిన ఓ రోడ్డు ప్రమాదం.. భార్య నైలియాతో పాటు కూతురు నయోమీని కోల్పోయారు జో బైడెన్​. ఆ తర్వాత 1977లో జిల్​ని పెళ్లి చేసుకున్నారు. అప్పటికి జిల్​ని.. ఆయన 5సార్లు ప్రపోజ్​ చేయాల్సి వచ్చిందట! ఇవన్నీ.. తాజాగా బయటకి వస్తున్న పుస్తకంలో ఉన్నాయి.

Secret for successful marriage : "నేను చాలా సహనంతో ఉండటానికి ప్రయత్నిస్తున్నాను. ఇప్పటివరకు అలాగే ఉన్నాను. కానీ ఇక నా వల్ల కావడం లేదు. నన్ను పెళ్లి చేసుకుంటావా? లేదా? అన్న విషయాన్ని త్వరగా నిర్ణయం తీసుకో," అని.. ఐదో ప్రయత్నంలో జో బైడెన్​.. జిల్​కి చెప్పారట. ఆ తర్వాత, జిల్​ ఒప్పుకున్నారట!

Whats_app_banner

సంబంధిత కథనం