తెలుగు న్యూస్ / ఫోటో /
Sobhita Dhulipala haldi ceremony: శోభిత ధూళిపాళ్ల ఇంట మంగళస్నానాలు.. నాగచైతన్యతో వివాహం ముంగిట ఫొటోలు షేర్ చేసిన నవవధువు
Naga Chaitanya Sobhita Dhulipala Wedding: శోభిత ధూళిపాళ్ల ఇంట పెళ్లి సందడి మొదలైంది. నాగచైతన్య, శోభిత ధూళిపాళ్ల డిసెంబరు 4న వివాహం చేసుకోనుండగా.. సంప్రదాయబద్ధంగా మంగళస్నానాల్ని చేయిస్తున్న ఫొటోల్ని నవవధువు షేర్ చేశారు.
(1 / 6)
అక్కినేని నాగచైతన్య, శోభితా ధూళిపాళ్ల పెళ్లి తేదీ దగ్గరపడుతుండటంతో ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి. హల్దీ వేడుక ఫొటోల్ని శోభితా ధూళిపాళ్ల సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. (sobhitad/instagram)
(2 / 6)
నాగచైతన్య, శోభితా ధూళిపాళ్ల వివాహం డిసెంబర్ 4న హైదరాబాద్‌లోని అన్నపూర్ణ స్టూడియోస్‌లో జరగనుంది. కుటుంబ సభ్యులతో పాటు పరిమిత సంఖ్యలో మాత్రమే అతిథుల్ని ఆహ్వానించారు. (sobhitad/instagram)
(3 / 6)
పసుపు రంగు చీర కట్టుకుని సంప్రదాయ బంగారు ఆభరణాలతో కూర్చుని ఉన్న శోభిత ధూళిపాళ్లకి కుటుంబ సభ్యులు, బంధువులు మంగళస్నానాలు చేయిస్తూ కనిపించారు. (sobhitad/instagram)
(4 / 6)
నాగచైతన్య 2017లో సమంతని వివాహం చేసుకోగా.. మనస్పర్థల కారణంగా ఇద్దరూ 2021లో విడిపోయారు. ప్రస్తుతం సమంత ఒంటరిగానే ఉంటోంది. (sobhitad/instagram)
(5 / 6)
శోభితతో రెండేళ్ల పాటు డేటింగ్ చేసిన నాగచైతన్య ఈ ఏడాది ఆగస్టులో ఆమెతో నిశ్చితార్థం చేసుకున్నారు. అయితే.. ఈ నిశ్చితార్థానికి ముందే జంటగా విదేశాల్లో తిరుగుతూ కెమెరాలకి ఈ జంట చిక్కింది. (sobhitad/instagram)
ఇతర గ్యాలరీలు