తెలుగు న్యూస్ / ఫోటో /
AP CRDA Design : సీఆర్డీఏ భవనం డిజైన్లపై ప్రజాభిప్రాయ సేకరణ-వెబ్‌సైట్ ద్వారా పోలింగ్
AP CRDA Design : రాష్ట్ర రాజధాని అమరావతి కీలక అప్‌డేట్ వచ్చింది. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఆంధ్రపద్రేశ్ రాజధాని ప్రాంత అభిప్రాద్ధి ప్రాధికార సంస్థ (ఏపీ సీఆర్డీఏ) ప్రాజెక్టు కార్యాలయ భవనం డిజైన్లపై ప్రజాభిప్రాయ సేకరణకు అవకాశం ఇచ్చింది.
(1 / 6)
రాష్ట్ర రాజధాని అమరావతి కీలక అప్‌డేట్ వచ్చింది. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఆంధ్రపద్రేశ్ రాజధాని ప్రాంత అభిప్రాద్ధి ప్రాధికార సంస్థ (ఏపీ సీఆర్డీఏ) ప్రాజెక్టు కార్యాలయ భవనం డిజైన్లపై ప్రజాభిప్రాయ సేకరణకు అవకాశం ఇచ్చింది.
(2 / 6)
ఏపీ సీఆర్డీఏ ప్రాజెక్టు ఆఫీసు బిల్డింగ్ ఎలా ఉండాలనే దానిపై అధికారులు వెబ్‌సైట్ ద్వారా పోలింగ్ నిర్వహిస్తున్నారు. ఈ మేరకు ఏపీ సీఆర్డీఏ కమిషనర్ భాస్కర్ కాటమనేని ప్రకటన విడుదల చేశారు. రాజధాని నిర్మాణంలో ప్రజలను భాగస్వాములు చేయాలనే మౌలిక అంశాన్ని అమలులో పెడుతున్నట్లు కమిషనర్ తెలిపారు.
(3 / 6)
ఇప్పటికే ప్రతి అంశాన్ని ప్రజలకు నచ్చిన విధంగా వారి ఆమోదంతో చేసుకుంటూ ముందుకు వెళ్తున్నామని సీఆర్డీఏ అధికారులు ప్రాజెక్టు కార్యాలయ నిర్మాణం సైతం ఎలా ఉండాలనే దానిపై ప్రజలను భాగస్వామ్యం చేయాలని నిర్ణయించారని సీఆర్డీఏ కమిషనర్ భాస్కర్ కాటమనేని తెలిపారు.అందుకోసం పది ఆకర్షణీయమైన డిజైన్లను రూపొందించి వెబ్‌సైట్‌లో ఉంచామని పేర్కొన్నారు.
(4 / 6)
ప్రజలు తమకు నచ్చిన డిసైన్ మీద క్లిక్ చేసి ఓటు చేయాలని అధికారులు కోరారు. మెజార్టీ ఓట్లను బట్టీ ముందుకు వెళ్తామని అన్నారు. మెజార్టీ ప్రజాభిప్రాయానికి అనుగుణంగా నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని తెలిపారు.
(5 / 6)
ఈ ఓటింగ్‌ను వారం రోజుల పాటు అంటే డిసెంబర్ 6 తేదీ వరకు నిర్వహిస్తామని చెప్పారు. అప్పటి లోగా వెబ్‌సైట్‌లో ఓటింగ్ చేయొచ్చని అన్నారు. ప్రజలు వెబ్‌సైట్ డైరెక్ట్ లింక్ https://crda.ap.gov.in/APCRDAV2/Views/AdminBuildingPoll.aspx పై క్లిక్ చేసి ఓటింగ్‌లో పాల్గొనవచ్చని తెలిపారు.
ఇతర గ్యాలరీలు