తెలుగు న్యూస్ / ఫోటో /
Bigg Boss Celebrities Death: బిగ్ బాస్‌లో పాల్గొన్న తర్వాత మరణించిన ఏడుగురు సెలబ్రిటీలు! ఎవరెలా చనిపోయారంటే?
- Bigg Boss Contestants Who Passed Away: బిగ్ బాస్ షోలోకి ఎంతోమంది సెలబ్రిటీలు కంటెస్టెంట్స్‌గా పాల్గొని అలరిస్తే.. అంతకుమించి బిగ్ బాస్ ద్వారా సెలబ్రిటీలు అయ్యారు. అయితే, బిగ్ బాస్ షోలో పాల్గొని మరణించిన వాళ్లు ఏడుగురు వరకు ఉన్నారు. వారెవరు, ఎలా చనిపోయారనే వివరాలను ఇక్కడ తెలుసుకుందాం.
- Bigg Boss Contestants Who Passed Away: బిగ్ బాస్ షోలోకి ఎంతోమంది సెలబ్రిటీలు కంటెస్టెంట్స్‌గా పాల్గొని అలరిస్తే.. అంతకుమించి బిగ్ బాస్ ద్వారా సెలబ్రిటీలు అయ్యారు. అయితే, బిగ్ బాస్ షోలో పాల్గొని మరణించిన వాళ్లు ఏడుగురు వరకు ఉన్నారు. వారెవరు, ఎలా చనిపోయారనే వివరాలను ఇక్కడ తెలుసుకుందాం.
(1 / 8)
బిగ్ బాస్ 18 ప్రస్తుతం జోరుగా సాగుతోంది. సల్మాన్ ఖాన్ హోస్ట్‌గా వ్యవహరిస్తున్న ఈ సీజన్‌కు మంచి ఆదరణ లభిస్తోంది. ఇది వివాదాస్పద రియాలిటీ షో అయినప్పటికీ కంటెస్టెంట్స్ కూడా వార్తల్లో నిలుస్తున్నారు. అయితే ఈ షోలో పాల్గొని ఇప్పుడు ఈ లోకంలో లేని కంటెస్టెంట్స్ చాలా మంది ఉన్నారు. వారిలో ఏడుగురు కంటెస్టెంట్స్ గురించి ఇక్కడ తెలుసుకుందాం.
(2 / 8)
టీవీ నుంచి బాలీవుడ్ వరకు తనదైన ముద్ర వేసిన నటుడు సిద్ధార్థ్ శుక్లా. బిగ్ బాస్ సీజన్ 13 విజేతగా నిలిచిన సిద్ధార్థ్ శుక్లా ఎంతో మంచి పేరు సంపాదించుకున్నాడు. 'బిగ్ బాస్' సీజన్ లో ఇప్పటి వరకు ఎక్కువగా చర్చనీయాంశమైన పాత్రగా సిద్ధార్థ్ క్రేజ్ తెచ్చుకున్నాడు. అయితే, ఎంతో గొప్ప పేరు సంపాదించిన సిద్ధార్థ్ శుక్లా ప్రస్తుతం ఈ లోకంలో లేడు. 40 ఏళ్ల వయసులో ఓషివారాలోని తన ఫ్లాట్‌లో గుండెపోటుతో తుది శ్వాస విడిచాడు.
(3 / 8)
'బాలికా వధు' (తెలుగులో చిన్నారి పెళ్లికూతురు) సీరియల్ ఫేమ్ ప్రత్యూష బెనర్జీ కూడా బిగ్ బాస్‌లో పాల్గొంది. 2016లో ప్రత్యూష ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ప్రత్యూష మరణం అందరినీ దిగ్భ్రాంతికి గురి చేసింది. చిన్నారి పెళ్లి కూతురు సీరియల్‌లో పెద్ద ఆనంది పాత్రలో ప్రత్యూష నటించింది. ఇదే సీరియల్‌తో సిద్దార్థ్ శుక్లా కూడా మంచి పేరు తెచ్చుకున్నాడు. ఒకే సీరియల్‌తో మంచి గుర్తింపు తెచ్చుకుని, బిగ్ బాస్‌లో పాల్గొన్న సిద్ధార్థ్ శుక్లా, ప్రత్యూష బెనర్జీ ఇద్దరు చనిపోవడం విషాదకరం.
(4 / 8)
సల్మాన్ ఖాన్ హోస్ట్‌గా చేసిన బిగ్ బాస్ షోలో అత్యంత వివాదాస్పద కంటెస్టెంట్లలో ఒకరిగా స్వామి ఓం గుర్తింపు తెచ్చుకున్నారు. స్వామి ఓం అనారోగ్య కారణాలతో మరణించారు.
(5 / 8)
హాలీవుడ్ రియాలిటీ షో బిగ్ బ్రదర్‌లో పాల్గొన్న జేడ్ గూడీ ఇండియన్ రియాలిటీ షో బిగ్ బాస్ రెండో సీజన్‌లో కూడా పాల్గొంది. అనతరం 2009లో జేడ్ గూడీ క్యాన్సర్‌తో మరణించింది.
(6 / 8)
బిగ్ బాస్ సీజన్ 14 కంటెస్టెంట్‌గా పాల్గొన్న సోనాలి ఫోగట్ ప్రస్తుతం ఈ లోకంలో లేరు. రాజకీయాల్లో భారతీయ జనతా పార్టీకి పనిచేసిన సోనాలి ఫోగట్ 42 ఏళ్ల వయసులో హార్ట్ ఎటాక్‌తో మరణించారు.
(7 / 8)
కన్నడ బిగ్ బాస్‌లో పాల్గొన్న నటి జయశ్రీ రామయ్య కూడా బిగ్ బాస్ తర్వాత మరణించిన వారి జాబితాలో చేరారు. ప్రస్తుతం జయశ్రీ రామయ్య ఈ లోకంలో లేరు. జయశ్రీ రామయ్య సూసైడ్ చేసుకుని మరణించారు.
ఇతర గ్యాలరీలు