Jupiter Transit: రోహిణి నక్షత్రంలోకి బృహస్పతి (గురు గ్రహం) - ఈ రాశుల వారికి స్థలం, సంపద, సద్గుణాలు-jupiter in rohini nakshatra place wealth virtues for these zodiac signs ,రాశి ఫలాలు న్యూస్
తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  Jupiter Transit: రోహిణి నక్షత్రంలోకి బృహస్పతి (గురు గ్రహం) - ఈ రాశుల వారికి స్థలం, సంపద, సద్గుణాలు

Jupiter Transit: రోహిణి నక్షత్రంలోకి బృహస్పతి (గురు గ్రహం) - ఈ రాశుల వారికి స్థలం, సంపద, సద్గుణాలు

Ramya Sri Marka HT Telugu
Nov 20, 2024 04:14 PM IST

నవంబర్ 28న గురు గ్రహంగా పిలుచుకునే బృహస్పతి కదలిక మారనుంది. రోహిణి నక్షత్రంలోకి ప్రవేశించడం ద్వారా, కొన్ని రాశులు శుభ ఫలితాలను అందుకోనున్నాయి. ఇంకొన్ని రాశులు అశుభ ఫలితాలను ఎదుర్కొంటాయి.

బృహస్పతి సంచారం 2024
బృహస్పతి సంచారం 2024

రాశులన్నింటిపై ప్రభావం చూపించే బృహస్పతి (గురు గ్రహం) నవంబర్ 28న స్థానం మారనుంది. గురు గ్రహం రోహిణి నక్షత్రంలోకి ప్రవేశించనున్నాడు. ఈ మార్పు వల్ల కొన్ని రాశులకు శుభ ఫలితాలను పొందనుండగా మరికొన్ని రాశులు అశుభ ఫలితాలను పొందుతాయి. జ్యోతిషశాస్త్రంలో గురుగ్రహానికి ప్రత్యేక స్థానం ఉంది. ఈ గ్రహం 27 నక్షత్రాలలో పునర్వసు, విశాఖ, పూర్వ భాద్రపద నక్షత్రాలకు అధిపతి. గురువు గ్రహం అనుకూలించడం వల్ల ఒక వ్యక్తి అదృష్టం పెరగడం ఖాయం. జ్ఞానం, గురువు, పిల్లలు, ఆహారం, విద్య, ధార్మిక పనులు, పవిత్ర స్థలం, సంపద, దానం, సద్గుణం, ఎదుగుదల మొదలైన వాటికి గురుగ్రహం కారణమని అంటారు.

బృహస్పతి దిశ మార్పుతో మొత్తం 12 రాశుల పరిస్థితి ఎలా ఉంటుందో తెలుసుకుందాం.

మేష రాశి - మేష రాశి వారికి ఆత్మవిశ్వాసం లోపించి, మనసు కలత చెందుతుంది. తల్లి కోసం ఎక్కువ సమయం కేటాయిస్తారు. జీవిత భాగస్వామి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. అకడమిక్ పనిలో విజయం సాధిస్తారు. మాట ప్రభావం పెరుగుతుంది.

వృషభ రాశి - వృషభ రాశి జాతకుల మాటల్లో మాధుర్యం ఉంటుంది. ఆత్మవిశ్వాసం ఎక్కువగా ఉంటుంది. చదువు పట్ల ఆసక్తి పెరిగి, అకడమిక్ పనిలో విజయం సాధిస్తారు. ఉద్యోగంలో అధికారులతో సఖ్యత పాటించండి.

మిథునం - మిథున రాశి వారి మనస్సు సంతోషంగా ఉంటుంది, కానీ సంభాషణలో సమతుల్యత ఉంటుంది. వృధా తగాదాలకు దూరంగా ఉండండి. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండండి. వ్యాపారంలో లాభం పెరుగుతుంది. మీరు వ్యాపారం కోసం మరొక ప్రదేశానికి కూడా వెళ్ళవచ్చు.

కర్కాటక రాశి - కర్కాటక రాశి వారి మనస్సు చంచలంగా ఉంటుంది. స్వీయ నియంత్రణతో ఉండండి. ఓపికగా ఉండటానికి ప్రయత్నించండి. వ్యాపారంలో మార్పు వచ్చే అవకాశం ఉంది. మీకు తండ్రి మద్దతు లభిస్తుంది. ఉద్యోగంలో అధికారుల సహకారం లభిస్తుంది.

సింహ రాశి - సింహ రాశి వారి మనస్సులో ఒడిదుడుకులు ఉంటాయి. జీవిత భాగస్వామి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. కుటుంబ సభ్యుల మద్దతు లభిస్తుంది. వ్యాపారంలో లాభం పెరిగి, లాభసాటి అవకాశాలు అందుతాయి.

కన్య - కన్య రాశి వారి మనస్సు సంతోషంగా ఉంటుంది. ఆత్మవిశ్వాసం కూడా ఎక్కువగా ఉంటుంది. ఆనందాన్ని పెంపొందించుకుంటారు. స్నేహితుడి నుంచి ఆర్థిక సహాయం అందుతుంది. ఇంట్లో ధార్మిక కార్యక్రమాలు చేసుకోవచ్చు. లాభసాటి అవకాశాలు అందుతాయి.

తుల రాశి - తులా రాశి వారి మనస్సు కలత చెందుతుంది. స్వీయ నియంత్రణతో ఉండండి. మితిమీరిన కోపాన్ని నివారించండి. కుటుంబంతో కలిసి పుణ్యక్షేత్రానికి వెళ్లే అవకాశాలు ఉన్నాయి. జీవిత భాగస్వామి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి.

వృశ్చిక రాశి - వృశ్చిక రాశి వారి మనస్సు కలత చెందుతుంది. ఆత్మవిశ్వాసం తగ్గుతుంది. ఓపికగా ఉండటానికి ప్రయత్నించండి. మతం పట్ల గౌరవం ఉంటుంది. మీ తండ్రి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. లాభసాటి అవకాశాలు లభిస్తాయి.

ధనుస్సు రాశి : ధనుస్సు రాశి వారి మనస్సు కలత చెందుతుంది. సంయమనం పాటించండి. ఓపికగా ఉండటానికి ప్రయత్నించండి. తల్లి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. స్నేహితుడి సహాయంతో వ్యాపారం వృద్ధి చెందుతుంది.

మకర రాశి : మకర రాశి వారి మనస్సు సంతోషంగా ఉంటుంది. కానీ, ఆత్మవిశ్వాసం లోపిస్తుంది. సంభాషణలో సమతుల్యత పాటించండి. వ్యాపారాలు మెరుగుపడతాయి. కొత్త వ్యాపారం ప్రారంభిస్తారు.

కుంభం - కుంభ రాశిలో ఆత్మవిశ్వాసం లోపిస్తుంది. మనస్సు సంతోషంగా ఉంటుంది, అయినప్పటికీ సహనం పాటించడానికి ప్రయత్నించండి. వ్యాపారంలో లాభం పెరుగుతుంది. కఠిన శ్రమతో పాటు లాభం కూడా ఎక్కువగా ఉంటుంది.

మీనం - మీన రాశి వారు ప్రశాంతంగా ఉండాలి. అనవసర కోపానికి, వాదోపవాదాలకు దూరంగా ఉండండి. మీరు బిజినెస్ పార్టనర్ ను కలవవచ్చు. మీకు స్నేహితుడి నుండి మద్దతు లభిస్తుంది. ప్రయాణాలు లాభసాటి అవకాశాలను అందిస్తాయి. వ్యాపారాలు మెరుగుపడతాయి.

గమనిక : ఈ కథనంలో మీకు అందించిన సమాచారం, సూచనలు పూర్తిగా నిజమైనది, ఖచ్చితమైనది అని మేము చెప్పలేము. నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.

Whats_app_banner