Bigg Boss Ram Charan: బిగ్ బాస్ గ్రాండ్ ఫినాలేకు అతిథిగా రామ్ చరణ్ కన్ఫర్మ్.. వీడియోతో క్లారిటీ ఇచ్చిన స్టార్ మా!-bigg boss telugu 8 grand finale chief guest is ram charan confirmed video released officially by star maa ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Bigg Boss Ram Charan: బిగ్ బాస్ గ్రాండ్ ఫినాలేకు అతిథిగా రామ్ చరణ్ కన్ఫర్మ్.. వీడియోతో క్లారిటీ ఇచ్చిన స్టార్ మా!

Bigg Boss Ram Charan: బిగ్ బాస్ గ్రాండ్ ఫినాలేకు అతిథిగా రామ్ చరణ్ కన్ఫర్మ్.. వీడియోతో క్లారిటీ ఇచ్చిన స్టార్ మా!

Sanjiv Kumar HT Telugu
Dec 15, 2024 06:19 PM IST

Bigg Boss Telugu 8 Grand Finale Chief Guest Ram Charan Confirm: ఇవాళ జరగనున్న బిగ్ బాస్ తెలుగు 8 గ్రాండ్ ఫినాలేకు చీఫ్ గెస్ట్‌గా గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ రానున్నాడని కన్ఫర్మ్ అయింది. దీనికి సంబంధించి క్లారిటీ ఇస్తూ తాజాగా స్టార్ మా ఒక వీడియో రిలీజ్ చేసింది.

బిగ్ బాస్ గ్రాండ్ ఫినాలేకు అతిథిగా రామ్ చరణ్ కన్ఫర్మ్.. వీడియోతో క్లారిటీ ఇచ్చిన స్టార్ మా!
బిగ్ బాస్ గ్రాండ్ ఫినాలేకు అతిథిగా రామ్ చరణ్ కన్ఫర్మ్.. వీడియోతో క్లారిటీ ఇచ్చిన స్టార్ మా! (StarMaa/Youtube)

Bigg Boss Telugu 8 Grand Finale Ram Charan Video: బిగ్ బాస్ తెలుగు 8 గ్రాండ్ ఫినాలేకు ముఖ్య అతిథిగా గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ రానున్నాడనే వార్తలు జోరుగా వచ్చాయి. అయితే, చెర్రీ బిగ్ బాస్ ఫినాలేకు రావడం అంతా వట్టి ప్రచారం అని చాలా మంది కొట్టేశారు. కానీ, తాజాగా ఇవాళ మరికొన్ని గంట్లోల జరగనున్న బిగ్ బాస్ 8 తెలుగు గ్రాండ్ ఫినాలేకు చీఫ్ గెస్ట్‌గా రామ్ చరణ్ వస్తున్నట్లుగా అధికారికంగా కన్ఫర్మ్ అయింది.

వీడియో రిలీజ్ చేసిన స్టార్ మా

బిగ్ బాస్ ఫినాలే స్పెషల్ గెస్ట్ రామ్ చరణ్ అని తెలియజేస్తూ స్టార్ మా తాజాగా ఒక వీడియో రిలీజ్ చేసింది. అందులో ఆర్ఆర్ఆర్ సినిమాలో గుర్రంపై ఉన్న రామ్ చరణ్ ఉన్న విజువల్ చూపిస్తూ "ఎపిక్ గ్రాండ్ ఫినాలేకు సిద్ధంగా ఉండండి. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ విచ్చేస్తున్నారు" అన్నట్లుగా వీడియోలో ఉంది.

వీడియోతో కన్ఫర్మ్

ఈ వీడియోతో బిగ్ బాస్ తెలుగు 8 గ్రాండ్ ఫినాలేకు వచ్చే స్పెషల్ గెస్ట్ రామ్ చరణ్ అని కన్ఫర్మ్ అయింది. ఇదిలా ఉంటే, ప్రస్తుతం హౌజ్‌లో టాప్ 5 కంటెస్టెంట్స్ అవినాష్, నిఖిల్, గౌతమ్, ప్రేరణ, నబీల్ ఉన్నారు. వీరిలో బిగ్ బాస్ తెలుగు 8 విన్నర్ ఎవరో మరికొన్ని గంటల్లో తెలిసిపోనుంది.

Whats_app_banner