Pushpa 2 3D Version: పుష్ప 2 నుంచి అల్లు అర్జున్ ఫ్యాన్స్‌కి మరో గుడ్‌న్యూస్.. హైదరాబాద్‌లోని ఫ్యాన్స్‌కి ఫస్ట్ ఛాన్స్-allu arjun rashmika mandanna starrer pushpa 2 the rule 3d version special treat for hyderabad movie lovers ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Pushpa 2 3d Version: పుష్ప 2 నుంచి అల్లు అర్జున్ ఫ్యాన్స్‌కి మరో గుడ్‌న్యూస్.. హైదరాబాద్‌లోని ఫ్యాన్స్‌కి ఫస్ట్ ఛాన్స్

Pushpa 2 3D Version: పుష్ప 2 నుంచి అల్లు అర్జున్ ఫ్యాన్స్‌కి మరో గుడ్‌న్యూస్.. హైదరాబాద్‌లోని ఫ్యాన్స్‌కి ఫస్ట్ ఛాన్స్

Galeti Rajendra HT Telugu
Dec 15, 2024 06:00 PM IST

Pushpa 2 The Rule 3D Version: పుష్ప 2 రిలీజ్ ముంగిట అనూహ్యరీతిలో త్రీడీ వెర్షన్ వాయిదాపడింది. దాంతో అప్పట్లో అభిమానులు నిరాశ వ్యక్తం చేయగా.. సినిమా రిలీజై రూ.1,100 కోట్లు కలెక్ట్ చేసిన తర్వాత..?

రష్మిక మంధాన, అల్లు అర్జున్
రష్మిక మంధాన, అల్లు అర్జున్

పుష్ప 2 నుంచి మరో ఇంట్రస్టింగ్ అప్‌డేట్‌ బయటికి వచ్చింది. డిసెంబరు 5న వరల్డ్‌‌వైడ్‌గా రిలీజైన పుష్ప 2 మూవీ ఇప్పటికే రూ.1,100 కోట్లు వసూళ్లు రాబట్టి.. రూ.1,200 కోట్ల దిశగా దూసుకెళ్తోంది. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కెరీర్‌లోనే బెస్ట్ మూవీగా నిలిచిన పుష్ప 2.. త్రీడీ వెర్షన్ అందుబాటులోకి రానుంది. హైదరాబాద్‌లోని కొన్ని థియేటర్లలో ఆదివారం నుంచే త్రీడీ వెర్షన్‌ అందుబాటులోకి వచ్చింది.

సడన్‌గా వాయిదా వేసి.. ఇప్పుడు సర్‌ప్రై

డిసెంబరు 5న ప్రపంచవ్యాప్తంగా 12,500 స్క్రీన్లలో పుష్ప 2 రిలీజ్ అవగా.. ఇందులో త్రీడీ వెర్షన్ కోసం కొన్ని థియేటర్లలను కేటాయించారు. కానీ.. ప్రీమియర్స్ ముంగిట త్రీడీ వెర్షన్‌లో రిలీజ్ నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నారు. అప్పటికి త్రీడీ వర్క్ పూర్తవకపోవడంతో వాయిదా వేసుకున్నారు. దాంతో అప్పట్లో చాలా మంది అల్లు అర్జున్ అభిమానులు సోషల్ మీడియాలో నిరుత్సాహం వ్యక్తం చేశారు.

10 రోజుల తర్వాత 3D

పుష్ప 2 రిలీజైన 10 రోజుల తర్వాత త్రీడీ వెర్షన్‌ని అందుబాటులోకి తెచ్చారు. తొలుత ప్రయోగాత్మకంగా హైదరాబాద్‌లోని కొన్ని థియేటర్లలో ప్రదర్శించనున్నారు. ఆ తర్వాత నెమ్మదిగా దేశంలోని అన్ని సిటీల్లో త్రీడీ వెర్షన్‌ను అందుబాటులోకి తేనున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది. తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం, హిందీతో పాటు బెంగాలీలోనూ పుష్ప 2 రిలీజైన విషయం తెలిసిందే. తెలుగులో కంటే హిందీలోనే కలెక్షన్లు ఎక్కువగా వస్తున్నాయి.

పుష్ప 3పై సుకుమార్ హింట్

సుకుమార్ దర్శకత్వం వహించిన పుష్ప 2 సినిమాలో అల్లు అర్జున్ సరసన రష్మిక మంధాన నటించగా.. కిస్సిక్ అంటూ శ్రీలీల ఐటెం సాంగ్ చేసింది. ఫహాద్ ఫాజిల్, రావు రమేశ్, జగపతి బాబు, అనసూయ, సునీల్ తదితరులు ఇందులో కీలక పాత్రలు పోషించారు. 2021లో వచ్చిన ‘పుష్ప : ది రైజ్’ మూవీకి ఇది సీక్వెల్‌కాగా.. పుష్ప 3 కూడా వస్తుందని దర్శకుడు సుకుమార్ హింట్ ఇచ్చారు.

Whats_app_banner