Rashmika Mandanna: సెట్‌లో అస్వస్థతకి గురైన రష్మిక మంధాన.. సపర్యలు చేసిన బాలీవుడ్ కండల వీరుడు
Rashmika Mandanna: బాలీవుడ్‌లో వరుస సినిమాలు చేస్తున్న రష్మిక మంధాన.. ఇటీవల పుష్ప 2తో బ్లాక్ బాస్టర్ హిట్‌ను ఖాతాలో వేసుకుంది. వచ్చే ఏడాది ఈ అమ్మడు నటించిన రెండు సినిమాలు రిలీజ్ కాబోతున్నాయి. ఇందులో ఒకటి..?
పుష్ప 2 సినిమాతో మరో బ్లాస్ బాస్టర్ హిట్‌ను రష్మిక మంధాన తన ఖాతాలో వేసుకుంది. 2021లో పుష్ప 1 తర్వాత నేషనల్ క్రష్‌గా మారిపోయిన రష్మిక.. సౌత్‌లోనే కాదు బాలీవుడ్‌లోనూ వరుస సినిమాలు చేస్తున్న విషయం తెలిసిందే. రణబీర్ కపూర్‌తో ఆమె నటించిన యానిమల్ సినిమా.. ఈ ముద్దుగుమ్మకి అవకాశాల్ని రెట్టింపు చేశాయి. ఇప్పుడు పుష్ప 2తో ఆ క్రేజ్ మరింత పెరిగింది.
సికిందర్ సెట్‌లో అస్వస్థత
రష్మిక మంధాన ప్రస్తుతం సల్మాన్ ఖాన్‌తో కలిసి ‘సికిందర్’ సినిమాలో నటిస్తోంది. ఈ మూవీ షూటింగ్ సమయంలో తాను అస్వస్థతకి గురైనట్లు తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో రష్మిక మంధాన గుర్తు చేసుకుంది. ఆ సమయంలో బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ తనకి సపర్యలు చేస్తూ.. కావాల్సినవి తెప్పించారని రష్మిక చెప్పుకొచ్చింది. సల్మాన్ ఖాన్‌తో రష్మిక మంధాన నటిస్తుండటం ఇదే తొలిసారి.
సల్మాన్ ప్రత్యేకమైన వ్యక్తి
‘‘సికిందర్ సెట్‌లో ఒక కల లాంటి ఘటన చోటు చేసుకుంది. షూటింగ్‌లో ఒకరోజు నేను అనారోగ్యంతో అస్వస్థతకి గురయ్యాను. దాంతో విషయం తెలిసిన మరుక్షణం సల్మాన్ ఖాన్.. గోరు వెచ్చని నీటితో పాటు కావాల్సిన ఆహారాన్ని తన సిబ్బందితో తెప్పించి నాకు కోలుకునేందుకు నాకు సాయం చేశారు. సల్మాన్ చాలా ప్రత్యేకమైన వ్యక్తి’’ అని రష్మిక మంధాన కితాబిచ్చింది.
సికిందర్ రిలీజ్ ఎప్పుడంటే?
సికిందర్ మూవీ 2025లో ఈద్ కానుకగా థియేటర్లలోకి రానుంది. ఈ సినిమా తన కెరీర్‌లోనే స్పెషల్ మూవీ అని చెప్పుకొచ్చిన రష్మిక.. అభిమానులకి కూడా బాగా నచ్చుతుందని ధీమా వ్యక్తం చేసింది. సికిందర్‌లో సల్మాన్ ఖాన్ కొత్త లుక్‌లో కనిపిస్తున్నాడు. మీసం, గడ్డంతో సెట్స్‌లో సల్మాన్ లుక్ బయటికి వచ్చింది. సాజిద్ నడియాడ్ వాలా ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు.
గర్ల్‌ఫ్రెండ్ మూవీ చేస్తున్న రష్మిక
‘పుష్ప 2: ది రూల్’లో శ్రీవల్లి పాత్రలో రష్మిక కనబర్చిన నటనకి ప్రశంసలు దక్కుతున్నాయి. డిసెంబరు 5న.. ఆరు భాషల్లో రిలీజైన ఈ సినిమా వారం రోజుల్లోనే రూ.1000 కోట్లు వసూళ్లు రాబట్టి అందర్నీ ఆశ్చర్యపరిచింది. రష్మిక నటిస్తున్న ‘ది గర్ల్ ఫ్రెండ్’ మూవీ 2025 ఫిబ్రవరి 14న విడుదలకానుంది.