Rashmika Mandanna: శ్రీవల్లి లేడీ ఓరియెంటెడ్ మూవీ అప్‌డేట్ - ది గర్ల్‌ఫ్రెండ్ టీజర్ రిలీజ్ ఎప్పుడంటే?
Rashmika Mandanna: రష్మిక మందన్న లేడీ ఓరియెంటెడ్ మూవీ ది గర్ల్‌ఫ్రెండ్ టీజర్ రిలీజ్ డేట్‌ను మేకర్స్ కన్ఫామ్ చేశారు. డిసెంబర్ 9న ది గర్ల్ ఫ్రెండ్ టీజర్ రిలీజ్ కానుంది. రాహుల్ రవీంద్రన్ దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమాలో దసరా ఫేమ్ దీక్షిత్ శెట్టి హీరోగా కనిపించబోతున్నాడు.
Rashmika Mandanna: ఇటీవలే పుష్ప 2 మూవీతో ప్రేక్షకుల ముందుకొచ్చింది రష్మిక మందన్న. అల్లు అర్జున్ హీరోగా నటించిన ఈ సినిమా తొలిరోజే 294 కోట్ల వసూళ్లను రాబట్టింది. ఇండియన్ సినిమా హిస్టరీలోనే ఫస్ట్ డే హయ్యెస్ట్ కలెక్షన్స్ సాధించిన మూవీగా అరుదైన రికార్డును నెలకొల్పింది.
పుష్పరాజ్, శ్రీవల్లి కెమిస్ట్రీ...
పుష్ప 2 మూవీలో యాక్షన్ అంశాలతో పాటు పుష్పరాజ్, శ్రీవల్లి ఎమోషనల్ బాండింగ్ ఆడియెన్స్‌ను మెప్పిస్తోంది. పీలింగ్స్ అంటూ అల్లు అర్జున్, రష్మిక కెమిస్ట్రీని సుకుమార్ ఆవిష్కరించిన ఆకట్టుకుంటోంది. శ్రీవల్లి పాత్రకు సీక్వెల్‌లా చాలా ఇంపార్టెన్స్ ఇచ్చారు. తన యాక్టింగ్‌తో దర్శకుడు సుకుమార్ తనపై పెట్టుకున్న నమ్మకాన్ని రష్మిక నిలబెట్టింది.
ది గర్ల్ ఫ్రెండ్...
పుష్ప 2 తర్వాత తెలుగులో ది గర్ల్‌ఫ్రెండ్ పేరుతో ఓ లేడీ ఓరియెంటెడ్ మూవీ చేస్తోంది రష్మిక మందన్న. ఈ సినిమాకు నటుడు రాహుల్ రవీంద్రన్ దర్శకత్వం వహిస్తోన్నాడు. దసరా ఫేమ్ దీక్షిత్ శెట్టి హీరోగా నటిస్తోన్నాడు.
టీజర్ ఎప్పుడంటే?
ది గర్ల్‌ఫ్రెండ్ మూవీకి సంబంధించి ఓ ఇంట్రెస్టింగ్ అప్‌డేట్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. డిసెంబర్ 9న టీజర్ రిలీజ్ కానున్నట్లు ప్రకటించారు. ఈ సినిమా షూటింగ్ ఎండింగ్‌కు చేరుకున్నట్లు వెల్లడించారు. ది గర్ల్‌ఫ్రెండ్ మూవీలో రష్మిక మందన్న ఛాలెంజింగ్ క్యారెక్టర్‌లో కనిపించబోతున్నట్లు సమాచారం. ది గర్ల్‌ఫ్రెండ్ సినిమాకు విద్య కొప్పినేని, ధీరజ్ మొగిలినేని నిర్మిస్తున్నారు. అల్లు అరవింద్ ప్రజెంటర్‌గా వ్యవహరిస్తోన్నారు.
మూడో సినిమా...
దర్శకుడిగా రాహుల్ రవీంద్రన్ మూడో సినిమా ఇది. చిలసౌ సినిమాతో దర్శకుడిగా రాహుల్ రవీంద్రన్ పరిచయమయ్యాడు. ఈ సినిమాకు నేషనల్ అవార్డు వచ్చింది. . ఆ తర్వాత నాగార్జునతో మన్మథుడు 2 సినిమాను తెరకెక్కించాడు. భారీ అంచనాల నడుమ రిలీజైన ఈ సీక్వెల్ డిజాస్టర్‌గా మిగిలింది. దాంతో నాలుగేళ్ల పాటు దర్శకత్వ బాధ్యతలకు బ్రేక్ ఇచ్చిన రాహుల్ రవీంద్రన్ ది గర్ల్‌ఫ్రెండ్ మూవీ తిరిగి మెగాఫోన్ పట్టాడు.
బాలీవుడ్‌లో బిజీ...
తెలుగులో పాటు బాలీవుడ్‌లో బిజీ అయ్యింది రష్మిక మందన్న. గత ఏడాది యానిమల్‌తో బిగ్గెస్ట్ బ్లాక్‌బస్టర్ అందుకున్న ఈ బ్యూటీకి బాలీవుడ్ నుంచి ఆఫర్లు క్యూ కడుతోన్నాయి. ప్రస్తుతం హిందీలో సల్మాన్ ఖాన్ సికందర్, చావా, తామ సినిమాల్లో నటిస్తోంది. తెలుగులోనే ది గర్ల్‌ఫ్రెండ్‌తో పాటు ధనుష్ కుబేర మూవీలో రష్మిక హీరోయిన్‌గా కనిపించబోతున్నది. శేఖర్ కమ్ముల దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో నాగార్జున ఓ కీలక పాత్ర పోషిస్తోన్నాడు.