తెలుగు న్యూస్ / ఫోటో /
Meenakshi Chaudhary: మీనాక్షి చౌదరిపై కొత్త రూమర్ తెరపైకి.. తిరగబడుతున్న ముద్దుగుమ్మ లక్
Meenakshi Chaudhary: నాగచైతన్యతో ఒక సినిమాలో మీనాక్షి చౌదరి పేరు ఫైనల్ అయినట్లు తొలుత వార్తలు వచ్చాయి. కానీ.. ఆఖరి నిమిషంలో మీనాక్షిని తప్పించి శ్రీలీలను తీసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. దానికి కారణం ఏంటంటే?
(1 / 6)
మీనాక్షి చౌదరి టాలీవుడ్‌లో ఇప్పుడు క్రేజీ హీరోయిన్‌గా మారిపోయింది. సీనియర్ నటులతో పాటు యంగ్ హీరోలు కూడా ఈ ముద్దుగుమ్మతో కలిసి నటించేందుకు ఉత్సాహం చూపుతున్నారు. (meenakshichaudhary006/instagram)
(2 / 6)
మీనాక్షి చౌదరి నటించిన నాలుగు సినిమాలు.. అది కూడా మూడు నెలల వ్యవధిలోనే థియేటర్లలోకి వచ్చాయి. ఇందులో దుల్కర్ సల్మాన్‌తో కలిసి నటించిన లక్కీ భాస్కర్ మూవీ బ్లాక్‌బాస్టర్ హిట్‌గా నిలిచింది. (meenakshichaudhary006/instagram)
(3 / 6)
లక్కీ భాస్కర్ సినిమా హిట్‌ను ఎంజాయ్ చేసేలోపే.. మట్కా మూవీ ఈ అమ్మడి ఆశలపై నీళ్లుచల్లింది. వరుణ్‌తేజ్‌తో జంటగా నటించిన మట్కా.. బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్‌గా మిగిలింది. (meenakshichaudhary006/instagram)
(4 / 6)
తమిళ్ హీరో విజయ్‌తో కలిసి మీనాక్షి చౌదరి నటించిన గోట్ మూవీ.. ఈ ముద్దుగుమ్మకి పెద్దగా కలిసిరాలేదు. అలానే విష్వక్ సేన్‌తో కలిసి నటించిన మెకానిక్ రాకీ మూవీ కూడా బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టింది. (meenakshichaudhary006/instagram)
(5 / 6)
మీనాక్షి చౌదరి ఇప్పుడు ఆశలన్నీ వెంకటేశ్‌తో కలిసి నటిస్తున్న సంక్రాంతికి వస్తున్నాం మూవీపైనే ఉన్నాయి. ఈ సినిమా హిట్ అయితేనే.. మీనాక్షి చౌదరికి అవకాశాలు పెరుగుతాయి. వచ్చే ఏడాది సంక్రాంతికి ఈ సినిమా రిలీజ్ కానుంది. (meenakshichaudhary006/instagram)
ఇతర గ్యాలరీలు