తెలుగు న్యూస్ / ఫోటో /
IRCTC Shirdi Tour Package : ఇయర్ ఎండ్‌లో 'షిర్డీ సాయి దర్శనం' - హైదరాబాద్ నుంచి టూర్ ప్యాకేజీ వచ్చేసింది..! వివరాలివే
- IRCTC Hyderabad Shirdi Tour : ఈ ఇయర్ ఎండ్ లో షిర్డీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా..? అయితే తక్కువ ధరలోనే IRCTC టూరిజం ప్యాకేజీని తీసుకొచ్చింది. హైదరాబాద్ నుంచి జర్నీ ఉంటుంది. ట్రైన్ జర్నీ ద్వారా ఈ ప్యాకేజీని ఆపరేట్ చేస్తున్నారు. IRCTC టూరిజం వెబ్ సైట్ లోకి వెళ్లి బుకింగ్ చేసుకోవాల్సి ఉంటుంది.
- IRCTC Hyderabad Shirdi Tour : ఈ ఇయర్ ఎండ్ లో షిర్డీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా..? అయితే తక్కువ ధరలోనే IRCTC టూరిజం ప్యాకేజీని తీసుకొచ్చింది. హైదరాబాద్ నుంచి జర్నీ ఉంటుంది. ట్రైన్ జర్నీ ద్వారా ఈ ప్యాకేజీని ఆపరేట్ చేస్తున్నారు. IRCTC టూరిజం వెబ్ సైట్ లోకి వెళ్లి బుకింగ్ చేసుకోవాల్సి ఉంటుంది.
(1 / 7)
మరికొద్దిరోజుల్లో కొత్త సంవత్సరం రాబోతుంది. అయితే ఈ ఇయర్ ఎండ్ వేళ IRCTC టూరిజం పలు ప్యాకేజీలను ఆపరేట్ చేస్తోంది. ఇందులో భాగంగా… మహారాష్ట్రలోని షిర్డీ సాయిబాబా దర్శనం కోసం కొత్త ప్యాకేజీని తీసుకొచ్చింది. ఈనెలలోనే జర్నీ ఉంది. (image source @SSSTShirdi X Account)
(2 / 7)
IRCTC టూరిజం వెబ్ సైట్ లోకి వెళ్తే ‘SAI SANNIDHI EX HYDERABAD’ పేరుతో ప్యాకేజీ డిస్ ప్లే అవుతుంది. ప్రస్తుతం ఈ టూర్ ప్యాకేజీ… డిసెంబర్ 18, 2024వ తేదీన అందుబాటులో ఉంది. (image source @SSSTShirdi X Account)
(3 / 7)
2 రాత్రులు, 3 రోజుల టూర్ ప్యాకేజీ ఇది. ఈ ప్యాకేజీలో షిర్డీ సాయిబాబా దర్శనం ఉంటుంది. ప్రతి బుధవారం ఈ టూర్ ప్యాకేజీ అందుబాటులో ఉండేలా ఐఆర్‌సీటీసీ టూరిజం ప్లాన్ చేసింది. (image source @SSSTShirdi X Account)
(4 / 7)
ఈ టూర్ ప్యాకేజీలో భాగంగా… తొలి రోజు కాచిగూడ రైల్వే స్టేషన్లో ప్రారంభమవుతుంది. సాయంత్రం 06.40 గంటలకు రైలు(ట్రైన్ నెంబర్ - 17064) ఉంటుంది. నైట్ అంతా ప్రయాణం చేయాలి. రెండో రోజు ఉదయం 07.10 గంటలకు నాగర్‌సోల్ వెళ్తుంది. ఆ తర్వాత షిరిడీకి వెళ్లాలి. హోటల్ వెళ్లిన తర్వాత.. షిరిడీ ఆలయ సందర్శనకు వెళ్లాల్సి ఉంటుంది. సాయంత్రం 05 గంటలకు రూమ్ చెకౌట్ చేయాలి. రాత్రి 08. 30 గంటల వరకు నాగర్ సోల్ రైల్వే స్టేషన్ కు చేరుకుంటారు. మూడో రోజు ఉదయం 09:45 గంటలకు కాచిగూడ చేరుకోవడంతో టూర్ ముగుస్తుంది.(image source @SSSTShirdi X Account)
(5 / 7)
హైదరాబాద్ - షిర్టీ టూర్ ప్యాకేజీ ధరలు : సింగిల్ షేరింగ్ కు రూ. 8790గా ఉంది. డబుల్ షేరింగ్ కు రూ. 7110,ట్రిపుల్ షేరింగ్ కు రూ. 6940గా ఉంది. కంఫర్ట్ క్లాస్ లో ఈ ధరలు అందుబాటులో ఉన్నాయి. స్టాండర్డ్ క్లాస్ లో చూస్తే ట్రిపుల్ షేరింగ్ కు రూ. 5,260, డబుల్ షేరింగ్ కు రూ. 5430గా నిర్ణయించారు. (image source @SSSTShirdi X Account)
(6 / 7)
లంచ్, డిన్నర్, ఎంట్రెన్స్ టికెట్స్, టూర్ గైడ్ ఈ ప్యాకేజీలో అందుబాటులో ఉంటాయి. ఏదైనా వ్యక్తిగత ఖర్చులు ఉంటే మీరు పెట్టుకోవాలి. (image source @SSSTShirdi X Account)
ఇతర గ్యాలరీలు