Women After 30: మహిళలకు 30 ఏళ్లు దాటితే కచ్చితంగా చేయించుకోవాల్సిన మెడికల్ టెస్టులు ఇవే-these are the medical tests that must be done for women over 30 years of age ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Women After 30: మహిళలకు 30 ఏళ్లు దాటితే కచ్చితంగా చేయించుకోవాల్సిన మెడికల్ టెస్టులు ఇవే

Women After 30: మహిళలకు 30 ఏళ్లు దాటితే కచ్చితంగా చేయించుకోవాల్సిన మెడికల్ టెస్టులు ఇవే

Haritha Chappa HT Telugu
Dec 12, 2024 07:00 PM IST

Women After 30: ఇంట్లో అందరిని జాగ్రత్తగా చూసుకునే స్త్రీలు తమ ఆరోగ్యాన్ని మాత్రం నిర్లక్ష్యం చేస్తుంటారు. మహిళలు తమ ఆరోగ్యం పట్ల ఎక్కువ శ్రద్ధ వహించాలి. 30 ఏళ్లు దాటిన తర్వాత కొన్ని ఆరోగ్య పరీక్షలు చేయించుకోవాలి. మహిళలు తప్పనిసరిగా చేయాల్సిన వైద్య పరీక్షలు ఇక్కడ ఉన్నాయి.

మహిళలు చేయించుకోవాల్సిన టెస్టులు
మహిళలు చేయించుకోవాల్సిన టెస్టులు (Pixabay)

కొందరు మహిళలు వయసు పెరిగే కొద్దీ ఆరోగ్య సమస్యలను ఎదుర్కొంటారు. ముఖ్యంగా 30 ఏళ్లు దాటగానే వ్యాధుల ముప్పు పెరిగిపోతుంది. అందువల్ల మహిళలు పౌష్టికాహారం తీసుకోవడంతో పాటు క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం చాలా అవసరం. కుటుంబ సభ్యుల ఆరోగ్యంతో పాటూ తమ ఆరోగ్యంపై కూడా శ్రద్ధ వహించడం చాలా అవసరం. మహిళల్లో కొన్ని వ్యాధుల లక్షణాలు ప్రారంభ దశలో బయటపడవు. వైద్య పరీక్షలు నిర్వహించడం ద్వారా ఆ వ్యాధుల గురించి తెలుసుకోవచ్చు. కొన్నిసార్లు అవి ఆలస్యంగా బయటపడితే తీవ్రంగా మారిపోయే అవకాశం ఉంది. ఈ వ్యాధులను ముందుగానే గుర్తించడం కోసం తరచూ వైద్య పరీక్షలు చేయించుకోవాల్సి ఉంటుంది. 30 ఏళ్లు దాటాక ప్రతి మహిళ చేయించుకోవాల్సిన పరీక్షలు తెలుసుకోండి.

మహిళలు చేయించుకోవాల్సిన వైద్య పరీక్షలు

రొమ్ము క్యాన్సర్ : 30 నుంచి 40 ఏళ్లు దాటిన మహిళలకు రొమ్ముక్యాన్సర్ వచ్చే ప్రమాదం ఎక్కువ. ఈ క్యాన్సర్ కేసులు కొన్నేళ్లుగా పెరుగుతున్నాయి. దీన్ని ప్రారంభ దశలో గుర్తించకపోతే సమస్య మరింత తీవ్రమవుతుంది. క్యాన్సర్ ముదిరితే దాన్ని వదిలించుకోవడం చాలా కష్టమవుతుంది. అందువల్ల, 40 నుంచి 50 సంవత్సరాల మధ్య వయస్సు గల మహిళలందరూ రొమ్ము క్యాన్సర్ పరీక్ష చేయించుకోవాలి. ఈ వయసు వారు కనీసం రెండు సంవత్సరాలకు ఒకసారి ఈ పరీక్ష చేయించుకోవాలి. వక్షోజాలలో నొప్పి, కణితి లేదా చర్మం రంగులో మార్పు వంటివి ఉంటే వెంటనే వైద్య పరీక్షలు చేయించుకోవాలి.

రెగ్యులర్ రక్త పరీక్షలు: ఏదైనా ఆరోగ్య సమస్యను ముందుగానే గుర్తించడం చాలా ముఖ్యం. అందుకే మహిళలు క్రమం తప్పకుండా రక్త పరీక్షలు చేయాలి. ఆరోగ్య స్థితిని తెలుసుకోవడం చాలా ముఖ్యం. రక్త పరీక్షలలో పరిశోధన ఆరోగ్య నిర్ణయాలను మార్చగలదు. క్రమం తప్పకుండా రక్త పరీక్షల్లో రక్తహీనత పరీక్ష, రక్తపోటు పరీక్ష, కొలెస్ట్రాల్ చెక్ వంటివి చేయించుకోవాలి. వీటిలో గ్లూకోజ్ పరీక్ష, విటమిన్ డి పరీక్ష కూడా చేయించుకోవాలి. వీటి ఫలితాలను బట్టి కొన్ని మార్పులు చేసుకోవచ్చు. మహిళలు కనీసం రెండు సంవత్సరాలకు ఒకసారి పూర్తి రక్త పరీక్ష చేయించుకోవాలి.

కటి పరీక్ష: కటి (గర్భాశయ ముఖద్వారం) మహిళల్లో ఇన్ఫెక్షన్లు, క్యాన్సర్ ప్రమాదాన్ని పెంచుతుంది. అందుకే కటి వైద్య పరీక్షలు చేయించుకోవాలి. ఈ పరీక్షల్లో గర్భాశయ క్యాన్సర్ ను గుర్తించవచ్చు. ఈ క్యాన్సర్ ను ప్రారంభ దశలోనే గుర్తిస్తే, చికిత్స సులభం. గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ కొనసాగితే చాలా ప్రమాదకరం. మహిళలు 20 ఏళ్ల తర్వాత సంవత్సరానికి ఒకసారి కటి పరీక్షలు చేయించుకోవాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.

ఎముక సాంద్రత పరీక్ష: వయసు పెరిగే కొద్దీ కొంతమంది మహిళల్లో ఎముక సాంద్రత తగ్గుతుంది. అందుకే 35 ఏళ్లు పైబడిన మహిళలు బోన్ డెన్సిటీ టెస్ట్ (బిఎమ్ డి) చేయించుకోవాలి. ఈ పరీక్ష కనీసం రెండు సంవత్సరాలకు ఒకసారి చేయించుకోవాలి. ఈ పరీక్ష ఎముక బలం స్థాయిని తెలియ జేస్తుంది.

హార్మోన్ల పరీక్షలు: శరీరంలో హార్మోన్ల అసమతుల్యత వల్ల మహిళలకు అనేక సమస్యలు వస్తాయి. జీవనశైలి మార్పుల వల్ల హార్మోన్లు నియంత్రణలోకి రావు. ఈ విషయం తెలియాలంటే మహిళలు హార్మోన్ రక్త పరీక్ష చేయించుకోవాలి.

Whats_app_banner