Snake bite First Aid: పాము కాటుతో మరణాలు మన దేశంలోనే ఎక్కువ, పాము కాటుకు గురైన వెంటనే ఈ పని చేయకండి ప్రమాదం-death due to snakebite is high in our country do not do this immediately after being bitten by snake ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Snake Bite First Aid: పాము కాటుతో మరణాలు మన దేశంలోనే ఎక్కువ, పాము కాటుకు గురైన వెంటనే ఈ పని చేయకండి ప్రమాదం

Snake bite First Aid: పాము కాటుతో మరణాలు మన దేశంలోనే ఎక్కువ, పాము కాటుకు గురైన వెంటనే ఈ పని చేయకండి ప్రమాదం

Haritha Chappa HT Telugu
Dec 12, 2024 12:30 PM IST

ప్రపంచంలో పాము కాటు వల్ల మరణిస్తున్న వారి సంఖ్య మనదేశంలోనే అధికంగా ఉంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ ఈ మేరకు గణాంకాలను బయటపెట్టింది. పాము కాటుకు గురైన వెంటనే కొన్ని పనులు చేయకూడదు.

పాముకాటు ప్రథమ చికిత్స
పాముకాటు ప్రథమ చికిత్స

పాము కావడం వల్ల మరణిస్తున్న వారి సంఖ్య ఎక్కువగానే ఉంది. విషపూరితమైన పాములు కాటు వేస్తే కొన్ని నిమిషాల్లోనే ప్రాణాలు గాల్లో కలిసిపోతాయి. మరికొన్ని పాములు కాటేస్తే కొన్ని గంటల వరకు ప్రాణం నిలిచే అవకాశం ఉంది. ఆ సమయంలో వైద్య చికిత్స అందితే వారి ప్రాణాలను కాపాడుకోవచ్చు. అయితే పాము కాటేసిన వెంటనే కొన్ని పనులను చేయరాదు. అలాంటి పనులు చేస్తే మరణం త్వరగా సంభవిస్తుంది. ఈ విషయం తెలియక పాము కాటేసిన వ్యక్తి చుట్టూ ఉండేవారు ఇలాంటి తప్పులు చేస్తూ ఉంటారు.

ప్రపంచ ఆరోగ్య సంస్థ చెబుతున్న ప్రకారం ఏటా పాము కాటుకు గురవుతున్న వారు 54 లక్షల మంది. వీరిలో 18 లక్షల 27 వేల మంది మరణిస్తున్నారు .ఇందులో 20 లక్షల కేసులు ఆసియాలోనే నమోదవుతున్నాయి. ముఖ్యంగా నేపాల్, పాకిస్తాన్, శ్రీలంక, భారతదేశం, బంగ్లాదేశ్‌లలోనే పాము కాటు వల్ల ఎక్కువమంది మరణిస్తున్నారు. ఇక మన దేశంలో ప్రతి ఏడాది 50వేల మంది కేవలం పాము కాటు వల్లే మరణిస్తున్నారు. ప్రపంచంలో ఇలా పాము కాటు వల్ల మరణిస్తున్న వారి సంఖ్య భారత్ లోనే ఎక్కువగా ఉంది. కాబట్టి పాము కాటు వేయగానే ఏం చేయాలి? ఏం చేయకూడదో ప్రతి ఒక్కరూ తెలుసుకోవలసిన అవసరం ఉంది.

పాముకాటు వేస్తే ఏం చేయాలి?

చాలా పాములు మనుషులకు ప్రమాదకరం కాదు. కొన్ని పాములు మాత్రం ప్రమాదకరమైనవి. వీటిని విషపూరితమైనవిగా చెప్పుకుంటారు. పాము కాటు వేసిన వెంటనే 108కు ఫోన్ చేయాలి. ఈలోపు పాము కరిచిన ప్రాంతంలో రంగు మారడం ఉబ్బినట్టు కనిపించడం వంటివి జరిగితే వెంటనే అతడి చేతికి ఉన్న ఉంగరాలు, బ్రాస్లెట్లు వంటివి తీసేయాలి. సాధారణంగా పాము కరిచిన చోట తీవ్రమైన నొప్పి ఉంటుంది. పాము కరిచిన వ్యక్తిని ప్రశాంతంగా ఒకచోట పడుకోబెట్టాలి. అతడికి సౌకర్యంగా ఎలా ఉంటుందో అలా పడుకోబెట్టడం లేదా కూర్చోబెట్టడం చేస్తే మంచిది. ఆ కాటును నీరు, సబ్బుతో శుభ్రం చేయాలి. పొడిగా ఉన్న వస్త్రంతో బదులుగా కట్టులా కట్టాలి. ఈ లోపు ఆసుపత్రికి వెంటనే తీసుకోవాలి.

పాముకాటు వేస్తే ఏం చేయకూడదు?

కొంతమంది పాము కాటు వేసిన చోట నోటితో విషాన్ని లాగేందుకు ప్రయత్నిస్తారు. అలాంటి పనులు చేయకూడదు. దీనివల్ల ఇన్ఫెక్షన్ పెరిగి త్వరగా మరణం సంభవించవచ్చు. అలాగే ఆ వ్యక్తికి కాఫీలు, ఆల్కహాల్ వంటివి తాగించకూడదు. పెయిన్ కిల్లర్స్‌ను కూడా ఇవ్వకూడదు. పెయిన్ కిల్లర్స్ ఇవ్వడం వల్ల కాటు వేసిన చోట రక్తస్రావం అధికంగా జరిగే అవకాశం ఉంది. ఎలాంటి పాము కాటు వేసిందో గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నించండి. పాము రకాన్ని బట్టి కూడా చికిత్స ఆధారపడి ఉంటుంది. పాము కాటు వేసిన ప్రాంతాల్లో ఐసు ముక్కలు పెట్టడం వంటివి చేయకండి. వీలైనంత త్వరగా వైద్య సహాయానికి తీసుకువెళ్తేనే ఆ వ్యక్తి జీవించే అవకాశం ఉంది.

Whats_app_banner