Serial Actors: బహుమతులతో సీరియల్ హీరో హీరోయిన్స్‌ సర్‌ప్రైజ్.. పాటలతో అలరించిన ఆర్పీ పట్నాయక్.. ఎక్కడంటే?-zee telugu vari pelli sandadi event premiere on december 15 serial actors surprise to audience by giving gifts selfies ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Serial Actors: బహుమతులతో సీరియల్ హీరో హీరోయిన్స్‌ సర్‌ప్రైజ్.. పాటలతో అలరించిన ఆర్పీ పట్నాయక్.. ఎక్కడంటే?

Serial Actors: బహుమతులతో సీరియల్ హీరో హీరోయిన్స్‌ సర్‌ప్రైజ్.. పాటలతో అలరించిన ఆర్పీ పట్నాయక్.. ఎక్కడంటే?

Sanjiv Kumar HT Telugu
Dec 12, 2024 12:53 PM IST

Zee Telugu Vari Pelli Sandadi Event Telecast Date: జీ తెలుగు వారి పెళ్లి సందడి ఈవెంట్ ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో బుల్లితెర సీరియల్స్ హీరో హీరోయిన్స్ వచ్చి బహుమతులు, సెల్ఫీలతో సర్‌ప్రైజ్ చేశారు. ప్రముఖ సంగీత దర్శకుడు ఆర్పీ పట్నాయక్ తన పాటలతో అలరించారు.

బహుమతులతో సీరియల్ హీరో హీరోయిన్స్‌ సర్‌ప్రైజ్.. పాటలతో అలరించిన ఆర్పీ పట్నాయక్.. ఎక్కడంటే?
బహుమతులతో సీరియల్ హీరో హీరోయిన్స్‌ సర్‌ప్రైజ్.. పాటలతో అలరించిన ఆర్పీ పట్నాయక్.. ఎక్కడంటే?

Zee Telugu Vari Pelli Sandadi Event: అశేష ప్రేక్షకాదరణతో విజయవంతంగా కొనసాగుతున్న సీరియల్స్​, ప్రత్యేక కార్యక్రమాలతో తెలుగు ప్రేక్షకులను అలరిస్తున్న ఛానల్​​ జీ తెలుగు. రెట్టింపు వినోదాన్ని ఎప్పటికప్పుడు ప్రత్యేక కార్యక్రమాలతో ప్రజల్లోకి వెళ్లే జీ తెలుగు తాజాగా జగ్గయ్యపేట వేదికగా అభిమానులకు అద్భుత అవకాశాన్ని అందించింది.

ఆత్మీయ సమ్మేళనం

జీ తెలుగులోని టాప్ సీరియల్స్​ అయిన చిరంజీవి లక్ష్మీ సౌభాగ్యవతి, కలవారి కోడలు కనకమహాలక్ష్మి నటీనటులు తమ అభిమానులను నేరుగా కలిసేందుకు ఆత్మీయ సమ్మేళన కార్యక్రమాన్ని నిర్వహించింది. అభిమాన ప్రేక్షకుల మధ్య ప్రముఖ సంగీత దర్శకుడు ఆర్పీ పట్నాయక్​ ముఖ్య​ అతిథిగా కోలాహలంగా ఈ కార్యక్రమం జరిగింది.

హోస్ట్‌గా రీతూ చౌదరి

‘జీ తెలుగువారి పెళ్లిసందడి’ కార్యక్రమాన్ని ఈ ఆదివారం అంటే డిసెంబర్​ 15న మధ్యాహ్నం 12 గంటలకు జీ తెలుగులో ప్రసారం చేయనున్నారు. జగ్గయ్యపేటలోని శ్రీమతి గంటల శకుంతలమ్మ కళాశాల గ్రౌండ్​ వేదికగా జీ తెలుగు వారి పెళ్లిసందడి కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి యాంకర్​ రవి, రీతూ చౌదరి వ్యాఖ్యాతలుగా వ్యవహరించారు.

అద్భుతమైన ప్రదర్శనలు

భారత సంప్రదాయ ఆచారాలకు, ఆధునిక వినోదాన్ని మేళవించి తెలుగు వివాహాల సారాంశాన్ని అందంగా వివరించిన ఈ కార్యక్రమం ఆద్యంతం అద్భుతమైన ప్రదర్శనలతో నిండిపోయింది. నిఖిత, పూజ తమ ఎనర్జిటిక్ ప్రదర్శనలతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు.

ఆర్పీ పట్నాయక్ పాటలు

జానపద గాయకుడు పల్సర్ బైక్ రమణ తన పాపులర్ పాటలతో పల్లెటూరి అందాన్ని జోడించగా, ఆర్పీ పట్నాయక్ 'చిరుగలి వీచెనే' పాటతో పాటు పలు సాంగ్స్ పాడి ప్రేక్షకులను అలరించారు. సంప్రదాయ వివాహవేడుకలో కీలకమైన జీలకర్ర బెల్లం, తలంబ్రాలు, పూల బంతి వంటి ఉత్సాహభరితమైన ఆచారాల మేళవింపుతో ఈ కార్యక్రమం ఆద్యంతం ఆసక్తికరంగా సాగింది.

సీరియల్ హీరో హీరోయిన్స్

జీ తెలుగు చిరంజీవి లక్ష్మీ సౌభాగ్యవతి సీరియల్​ నుంచి లక్ష్మి (మాహి గౌతమి), మిత్ర (రఘు), కలవారి కోడలు కనకమహాలక్ష్మి సీరియల్​ నుంచి విష్ణు విహారి (జై ధనుష్), కనకమహాలక్ష్మి (యుక్తా మల్నాడ్​)తోపాటు ఇతర నటీనటులు ఈ కార్యక్రమంలో పాల్గొని అభిమానులను పలకరించారు. డ్రామా జూనియర్స్​ పిల్లలు, సరిగమప గాయనీగాయకులు తమ అద్భుత ప్రదర్శనలతో అలరించారు.

సర్‌ప్రైజ్ చేసి

జీ తెలుగు నటీనటులు తమ అభిమానులతో సెల్ఫీలు దిగడం, బహుమతులతో సర్‌ప్రైజ్ చేయడంతోపాటు వారిని పలకరించి ముచ్చటించారు. అభిమానుల కేరితంలు, చప్పట్లతో సందడిగా సాగిన జీ తెలుగువారి పెళ్లిసందడి కార్యక్రమంలో చిరంజీవి లక్ష్మీ సౌభాగ్యవతి, కలవారి కోడలు కనకమహాలక్ష్మి సీరియల్స్​ నటీనటులు చెరగని అనుభూతులు పంచారు.

Whats_app_banner