Ummadi Kutumbam Serial: సరికొత్త సీరియల్ ఉమ్మడి కుటుంబం ప్రారంభం- మిగతా సీరియల్స్ టైమింగ్స్‌లో మార్పులు- ఎక్కడ చూడాలంటే?-ummadi kutumbam serial telecast date and remaining zee telugu serials timings changed suryakantham serial to be end ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Ummadi Kutumbam Serial: సరికొత్త సీరియల్ ఉమ్మడి కుటుంబం ప్రారంభం- మిగతా సీరియల్స్ టైమింగ్స్‌లో మార్పులు- ఎక్కడ చూడాలంటే?

Ummadi Kutumbam Serial: సరికొత్త సీరియల్ ఉమ్మడి కుటుంబం ప్రారంభం- మిగతా సీరియల్స్ టైమింగ్స్‌లో మార్పులు- ఎక్కడ చూడాలంటే?

Sanjiv Kumar HT Telugu
Oct 30, 2024 12:43 PM IST

Zee Telugu Serial Ummadi Kutumbam Telecast Date: తెలుగు ప్రేక్షకులను ఎంటర్‌టైన్ చేసేందుకు సరికొత్త సీరియల్ ఉమ్మడి కుటుంబం త్వరలో రానుంది. ఉమ్మడి కుటుంబం సీరియల్ ప్రసారమయ్యే తేదిని సదరు టీవీ ఛానెల్ తాజాగా ప్రకటించింది. ఆకట్టుకునే కథనంతో సాగే ఉమ్మడి కుటుంబం సీరియల్‌ను ఎక్కడ చూడాలంటే..

సరికొత్త సీరియల్ ఉమ్మడి కుటుంబం ప్రారంభం.. మిగతా సీరియల్స్ టైమింగ్స్‌లో మార్పులు.. ఎక్కడ చూడాలంటే?
సరికొత్త సీరియల్ ఉమ్మడి కుటుంబం ప్రారంభం.. మిగతా సీరియల్స్ టైమింగ్స్‌లో మార్పులు.. ఎక్కడ చూడాలంటే?

Ummadi Kutumbam Serial Telecast Date: ఆసక్తికరమైన మలుపులు, ఆకట్టుకునే కథలతో సాగే సీరియల్స్​ అందిస్తున్న జీ తెలుగు మరో సరికొత్త సీరియల్​ను తన అభిమాన వీక్షకులకు అందించేందుకు సిద్ధమైంది. కుటుంబ సభ్యుల మధ్య అనుబంధం, అనురాగాల నేపథ్యంలో సాగే ఆసక్తికరమైన కథ, కథనంతో రూపొందిన సరికొత్త సీరియల్ ‘ఉమ్మడి కుటుంబం’.

ప్రతిరోజు మధ్యాహ్నాం

ఈ ఉమ్మడి కుటుంబం సీరియల్‌లో ఉమ్మడి కుటుంబం విశిష్టత, ప్రాధాన్యం, కుటుంబ సభ్యుల మధ్యనున్న అనుబంధం, ప్రేమ, బాధ్యతలు, అనురాగాలను కొత్తకోణంలో చూపించనున్నారు. ఆకట్టుకునే కథతో రానున్న ‘ఉమ్మడి కుటుంబం’ నవంబర్​ 4 నుంచి ప్రారంభం ప్రసారం కానుంది. అంటే, నవంబర్ 4 నుంచి సోమవారం నుంచి శనివారం వరకు ప్రతిరోజు మధ్యాహ్నం 12 గంటలకు జీ తెలుగులో టెలీకాస్ట్ చేయనున్నారు.

కుటుంబ నేపథ్యంలో

ఉమ్మడి కుటుంబం అనే విలక్షణమైన కుటుంబ నేపథ్యంలో సాగే సరికొత్త సీరియల్​తో వచ్చేస్తోంది జీ తెలుగు. కుటుంబమే మొదటి ప్రాధాన్యతగా జీవిస్తున్న ఆనంద భైరవి (రూప) తన కొడుకు కోసం తగిన వధువుని వెతుకుతుంది. సౌమ్యత, గౌరవం కలబోసినట్లున్న శరణ్య (సాక్షి)ను తన కొడుక్కి తగిన భాగస్వామిగా నమ్ముతుంది ఆనంద.

లేడి విలన్ ఎవరు

శరణ్య సోదరి అనన్య (సుస్మిత) అందుకు పూర్తి భిన్నంగా ఆలోచిస్తూ స్వేచ్ఛయుత జీవనాన్ని ఇష్టపడుతుంది. ఆనంద కుటుంబంలోకి అనన్య ఎలా ప్రవేశిస్తుంది? శరణ్య జీవితంలో ప్రతినాయకి ఎవరు? అనే విషయాలు తెలుసుకోవాలంటే ఉమ్మడి కుటుంబం సీరియల్​ తప్పకుండా చూడాల్సిందే.

అసూయ, ప్రతీకారం

రూప (ఆనంద), యశ్వంత్ (దర్శన్), సాక్షి (శరణ్య) ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ ఉమ్మడి కుటుంబం సీరియల్‌లో కరమ్ (రోహిత్), సుస్మిత (అనన్య) కీలక పాత్రల్లో కనిపించనున్నారు. అన్నదమ్ములు, తోడికోడళ్ల అనుబంధం, అసూయ, ప్రతీకారం ముఖ్యాంశాలుగా ఆసక్తికరంగా సాగే ఉమ్మడి కుటుంబం సీరియల్​ సోమవారం నుంచి శనివారం వరకు ప్రతిరోజు మధ్యాహ్నం 12 గంటలకు ప్రసారమవుతుంది.

ముగియనున్న సూర్యకాంతం సీరియల్

అయితే, జీ తెలుగు అందిస్తున్న కొత్త సీరియల్​ 'ఉమ్మడి కుటుంబం' ప్రారంభంతో ప్రస్తుతం ఉన్న ఇతర సీరియళ్ల ప్రసార సమయాల్లో స్వల్ప మార్పులు ఉంటాయి. మధ్యాహ్నం 12 గంటలకు ప్రసారమవుతున్న సీతా రామ ఇక నుంచి మధ్యాహ్నం 3.30 గంటలకు ప్రసారమవుతుంది. చాలాకాలంగా జీ తెలుగు ప్రేక్షకులను అలరిస్తున్న సూర్యకాంతం సీరియల్​ ముగియనుంది.

జీ5 ఓటీటీలో కూడా

ప్రేక్షకులు ప్రసార సమయాల్లో మార్పుని గమనించి కొత్త సీరియల్ ఉమ్మడి కుటుంబంతోపాటు మీ అభిమాన సీరియల్స్​ మిస్​కాకుండా చూసేయండి అని జీ తెలుగు తాజాగా ప్రకటించింది. అలాగే, ఉమ్మడి కుటుంబం సీరియల్ ఎపిసోడ్స్‌ను ప్రతిరోజూ టీవీ ఛానెల్‌లోనే కాకుండా జీ5 ఓటీటీలో కూడా ఎంచక్కా చూసి ఆనందించొచ్చు.

Whats_app_banner