Zee Telugu Awards: నాగబాబు చీఫ్ గెస్ట్‌గా జీ తెలుగు కుటుంబం అవార్డ్స్.. చిరంజీవికి ట్రిబ్యూట్.. ఏ ఓటీటీలో చూడొచ్చంటే?-zee telugu kutumbam awards 2024 premiere on zee5 ott and tribute to chiranjeevi chief guest is naga babu zee telugu show ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Zee Telugu Awards: నాగబాబు చీఫ్ గెస్ట్‌గా జీ తెలుగు కుటుంబం అవార్డ్స్.. చిరంజీవికి ట్రిబ్యూట్.. ఏ ఓటీటీలో చూడొచ్చంటే?

Zee Telugu Awards: నాగబాబు చీఫ్ గెస్ట్‌గా జీ తెలుగు కుటుంబం అవార్డ్స్.. చిరంజీవికి ట్రిబ్యూట్.. ఏ ఓటీటీలో చూడొచ్చంటే?

Sanjiv Kumar HT Telugu

Zee Telugu Kutumbam Awards 2024 On OTT: జీ తెలుగు కుటుంబం అవార్డ్స్ 2024 పార్ట్ 1కు ముఖ్య అతిథిగా మెగా బ్రదర్ నాగబాబు హాజరు కానున్నారు. ఈ ఈవెంట్‌లో మెగాస్టార్ చిరంజీవికి ట్రిబ్యూట్‌గా పిల్లలతో స్పెషల్ పోగ్రామ్ నిర్వహించనున్నారు. ఈ అవార్డ్స్ పూర్తి వివరాల్లోకి వెళితే..

నాగబాబు చీఫ్ గెస్ట్‌గా జీ తెలుగు కుటుంబం అవార్డ్స్.. చిరంజీవికి ట్రిబ్యూట్.. ఏ ఓటీటీలో చూడొచ్చంటే?

Zee Telugu Kutumbam Awards 2024: నిరంతరం ప్రేక్షకులకు వినోదం అందిస్తూ విజయవంతంగా కొనసాగుతున్న ఛానల్​ జీ తెలుగు. ఎదురులేని ప్రయాణంలో ఛానల్​ ఉన్నతికి తమవంతు కృషి చేస్తున్న ప్రతిభావంతులైన నటీనటులు, కళాకారులు, దర్శకులు, రచయితలు, నిర్మాతలు.. అందరినీ గౌరవిస్తూ అందించే సత్కారమే జీ తెలుగు కుటుంబం అవార్డ్స్​.

అవార్డుల ప్రదానోత్సవం

ప్రతిష్ఠాత్మక జీ తెలుగు కుటుంబ అవార్డులను అందుకుని మరింత ఉత్సాహంతో ముందుకు సాగాలని నటీనటులను ప్రోత్సహిస్తుంది. ప్రతి ఏటా ఘనంగా జరిగే జీ తెలుగు కుటుంబం అవార్డ్స్ వేడుక ఈ సంవత్సరం మరింత వైభవంగా జరిగింది. జీ తెలుగు తారలు, టాలీవుడ్​ ప్రముఖులతో సందడిగా సాగిన జీ తెలుగు కుటుంబం అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమ మొదటి భాగం అక్టోబర్ 12 సాయంత్రం 6 గంటలకు ప్రసారం చేయనున్నారు.

యాంకర్స్‌గా రవి-లాస్య

టాలీవుడ్​ ప్రముఖులు, బుల్లితెర నటీనటులతో సందడిగా సాగిన జీ తెలుగు కుటుంబం అవార్డ్స్​ 2024 పార్ట్​ 1 కార్యక్రమానికి ఎనర్జిటిక్​ జోడీ రవి‌‌- లాస్య వ్యాఖ్యాతలుగా వ్యవహరించారు. జీ తెలుగు సీరియల్స్​ కుటుంబాలన్నీ కలగలసి ఊరేగింపుతో ఘనంగా మొదలైన కార్యక్రమం అద్భుత ప్రదర్శనలు, అనుభవాలు, భావోద్వేగాల సమాహారంగా సాగుతుంది.

సీనియర్ నటుల కామెడీ

ఇక, జీ తెలుగు పాపులర్​ సీరియల్స్​ పడమటి సంధ్యారాగం, నిండు నూరేళ్ల సావాసం నటీనటులు ఆడే ఫజిల్​ గేమ్​ ఆద్యంతం ఉత్కంఠ రేకెత్తిస్తుంది. టాలీవుడ్​ సీనియర్ నటీనటులు​ భానుచందర్, అర్చన ఈ కార్యక్రమానికి హాజరై తమ అనుభవాలను పంచుకుని నవ్వులు పూయించారు.

ముఖ్య అథితిగా నాగబాబు

జీ తెలుగు సీరియల్ జంటలతో సాగే మ్యూజికల్ డాన్స్ వార్​లో సరిగమప సింగర్స్ పోటా పోటీ ప్రదర్శన ఆకట్టుకుంటుంది. అంతేకాదు, ఈ వేడుకకు మెగా బ్రదర్​ నాగబాబు ముఖ్య అతిథిగా హాజరై జీ తెలుగుతో తన అనుబంధాన్ని పంచుకున్నారు. మెగాస్టార్ చిరంజీవి గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్​లో చోటు దక్కించుకున్న సందర్భంగా డ్రామా జూనియర్స్ చిన్నారుల ప్రత్యేక ప్రదర్శన అందరినీ ఆకట్టుకుంటుంది.

యాక్షన్ ప్రియుల కోసం

యాక్షన్ ప్రియుల కోసం లైవ్​లో గగన్ రౌడీలతో చేసే ఫైట్ సీక్వెన్స్ ఆసక్తికరంగా సాగుతుంది. డాన్స్​ కాంపిటీషన్‌లో భాగంగా జూనియర్స్ రెట్రో ప్రదర్శన ఇవ్వగా, సీనియర్లు ట్రెండింగ్ పాటలకు డాన్స్​​ చేసి అలరిస్తారు. రామలక్ష్మి అండ్ శౌర్య, ఆద్య అండ్ శ్రీను, రూప అండ్ రాజు, శ్రీకర్ అండ్ అవని జంటలు వేదికపై చేసే సందడి సరదాగా సాగుతుంది.

సీరియల్ కోడళ్లతో

ఇక సీనియర్ నటీమణులు అన్నపూర్ణమ్మ, వై. విజయ సీరియల్ కోడళ్లతో చేసే సంభాషణ కడుపుబ్బా నవ్విస్తుంది. అద్భుతమైన ప్రదర్శనలతో వినోదంగా సాగే ఈ కార్యక్రమంలో మీ అభిమాన నటులు ఏ అవార్డు గెలుచుకున్నారో తెలుసుకోవాలంటే జీ తెలుగు కుటుంబం అవార్డ్స్​ 2024 కార్యక్రమాన్ని చూడాల్సిందే.

రెడ్ కార్పెట్‌పై

అలాగే, జీ తెలుగు కుటుంబం అవార్డ్స్ 2024 వేడుకలోని రెడ్​ కార్పెట్​పై వెండితెర ప్రముఖుల సందడి, బుల్లితెర తారల హంగామా ఆకట్టుకునేవిధంగా ఉండనుందని తెలుస్తోంది. ఇదిలా ఉంటే, జీ తెలుగు కుటుంబం అవార్డ్స్​ 2024 పార్ట్​ 1 అక్టోబర్​ 12 శనివారం సాయంత్రం 6 గంటలకు జీ తెలుగు ఛానెల్‌లో ప్రసారం చేయనున్నారు. అలాగే జీ5 ఓటీటీలో అదే సమయంలో డిజిటల్ స్ట్రీమింగ్ చేయనున్నట్లు సమాచారం.