Tovino Thomas: నేను చూసిన మొదటి తెలుగు సినిమా చిరంజీవిదే.. మలయాళ స్టార్ హీరో టొవినో థామస్ కామెంట్స్-tovino thomas comments on chiranjeevi movie jagadeka veerudu athiloka sundari in arm movie promotions ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Tovino Thomas: నేను చూసిన మొదటి తెలుగు సినిమా చిరంజీవిదే.. మలయాళ స్టార్ హీరో టొవినో థామస్ కామెంట్స్

Tovino Thomas: నేను చూసిన మొదటి తెలుగు సినిమా చిరంజీవిదే.. మలయాళ స్టార్ హీరో టొవినో థామస్ కామెంట్స్

Sanjiv Kumar HT Telugu
Sep 09, 2024 08:13 AM IST

Tovino Thomas About Chiranjeevi Movie: తాను చూసిన మొదటి తెలుగు సినిమా మెగాస్టార్ చిరంజీవి గారిదే అని మలయాళ స్టార్ హీరో టొవినో థామస్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. పాన్ ఇండియా మూవీ ఆర్మ్ రిలీజ్ ప్రమోషన్స్‌లో భాగంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సినీ విశేషాలు పంచుకున్నారు టొవినో థామస్.

నేను చూసిన మొదటి తెలుగు సినిమా చిరంజీవిదే.. మలయాళ స్టార్ హీరో టొవినో థామస్ కామెంట్స్
నేను చూసిన మొదటి తెలుగు సినిమా చిరంజీవిదే.. మలయాళ స్టార్ హీరో టొవినో థామస్ కామెంట్స్

Tovino Thomas On Chiranjeevi Movie: మలయాళ స్టార్ హీరో టోవినో థామస్ మోస్ట్ ఎవైటెడ్ పాన్ ఇండియా పాంటసీ ప్రాజెక్ట్ 'ఆర్మ్' (ARM)తో ప్రేక్షకులను ఎంటర్‌టైన్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. టోవినో థామస్ 50వ మైల్ స్టోన్ మూవీగా వస్తున్న ఈ చిత్రంలో కృతి శెట్టి, ఐశ్వర్య రాజేష్, సురభి లక్ష్మి హీరోయిన్స్‌గా నటిస్తున్నారు.

yearly horoscope entry point

ఆర్మ్ సినిమాకు డెబ్యుటెంట్ డైరెక్టర్‌గా జితిన్ లాల్ పరిచయం కానున్నారు. ఈ చిత్రాన్ని డాక్టర్ జకారియా థామస్‌తో కలిసి మ్యాజిక్ ఫ్రేమ్స్, యూజీఎమ్ మోషన్ పిక్చర్స్ బ్యానర్లపై లిస్టిన్ స్టీఫెన్ నిర్మించారు. ఇప్పటికే విడుదలైన ప్రమోషనల్ కంటెంట్‌కి ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. ఈ చిత్రాన్ని తెలుగులో మైత్రీ మూవీ మేకర్స్ డిస్ట్రిబ్యూటర్స్ గ్రాండ్‌గా విడుదల చేస్తున్నారు.

టొవినో థామస్ నటించిన ఆర్మ్ సినిమా సెప్టెంబర్ 12న విడుదల కానుంది. ఈ సందర్భంగా హీరో టోవినో థామస్ విలేకరుల సమావేశంలో సినిమా విశేషాలని పంచుకున్నారు.

ఇది మీ 50 మైల్ స్టోన్ మూవీ. ఈ ప్రాజెక్ట్ ఎలా మొదలైంది?

- స్మాల్ యాక్టర్‌గా కెరీర్ ప్రారంభించాను. సపోర్టింగ్, కామెడీ, విలన్ రోల్స్ చేశాను. 2016 నుంచి లీడ్ రోల్స్ చేస్తున్నాను. యాక్టర్ కావాలనేది నా డ్రీం. ఇప్పుడా డ్రీంలో జీవిస్తున్నాను. ARM మొదలుపెట్టినప్పుడు నటుడిగా ఇది నా 50వ సినిమా అవుతుందని తెలీదు. ARM చాలా ఎగ్జయిటింగ్ స్క్రిప్ట్. మూడు డిఫరెంట్ క్యారెక్టర్స్ చేయడం హ్యుజ్ ఛాలెంజ్. డైరెక్టర్ నాపై నమ్మకం ఉంచారు.

- ఈ సినిమా కోసం వర్క్ షాప్స్ చేశాం. ఈ మూడు పాత్రలు దేనికవే ప్రత్యేకంగా ఉంటాయి. ఇందులో మూడు పాత్రలు ఇష్టమే. అయితే దొంగగా కనిపించే మణి పాత్ర కొంచెం ఎక్కువ ఇష్టం (నవ్వుతూ) చాలా పాషనేటింగ్ క్యారెక్టర్ అది. తను చాలా కాన్ఫిడెన్స్ గల దొంగ. ఆడియన్స్ అ క్యారెక్టర్‌ని చాలా ఎంజాయ్ చేస్తారు.

ఇంత పెద్ద సినిమాకి డెబ్యుటెంట్ డైరెక్టర్‌పై నమ్మకం ఉంచడంపై?

- జితిన్ లాల్‌ నేను ఎనిమిదేళ్లుగా కలిసి ప్రయాణం చేస్తున్నారం. తను చెప్పిన స్క్రిప్ట్ అద్భుతంగా ఉంది. నా కెరీర్ లో 80శాతం సినిమాలు కొత్త దర్శకులతోనే చేశాను. పరస్పర నమ్మకంతోనే ఇది సాధ్యపడుతుంది.

ARMలో ఎదురుకున్న ఛాలెజింగ్ ఏమిటి?

- అది సినిమా చూసినప్పుడు మీకు అర్ధమౌతుంది. ఇందులో చాలా ఫైట్స్ సీక్వెన్స్‌లు ఉన్నాయి. క్యారెక్టర్ స్విచస్ ఉంటాయి. మేకప్‌కే చాలా సమయం పట్టేసేది. చాలా లోకేషన్స్‌లో షూట్ చేశాం. నా క్యారెక్టర్స్ కోసం చాలా ప్రిపేర్ అయ్యాను. నోట్స్ రాసుకున్నాను. అవన్నీ హెల్ప్ అయ్యాయి. ఇందులో నాన్ లీనియర్ స్క్రీన్ ప్లే ఉంటుంది. టైం పీరియడ్స్‌‌ను ఆడియన్స్ సులువుగా అర్ధం చేసుకుంటారు. డైరెక్టర్ ప్రతి డీటేయిల్‌ని చాలా చక్కగా తెరకెక్కించారు.

తెలుగు సినిమాలు చూస్తారా? తెలుగు కథలు వింటున్నారు?

- తెలుగు సినిమాలు చూస్తాను. నేను చూసిన మొదటి తెలుగు సినిమా చిరంజీవి గారి 'జగదేక వీరుడు అతిలోక సుందరి'. తెలుగు స్క్రిప్ట్ డిస్కర్షన్స్ జరుగుతుంటాయి. లెట్స్ సీ (నవ్వుతూ).

Whats_app_banner