Bigg Boss Telugu 8: కంటెస్టెంట్‌గా టాలీవుడ్ యంగ్ హీరో.. అతనితోపాటు మరో నలుగురు కన్ఫర్మ్.. ఆరోజే ఐదుగురి ఎంట్రీ!
Bigg Boss Telugu 8 Wild Card Entry Gautham Krishna: బిగ్ బాస్ తెలుగు 8 సీజన్‌లోకి 9 మంది సెలబ్రిటీలు వైల్డ్ కార్డ్ ద్వారా ఎంట్రీ ఇవ్వనున్నారు. వారిలో ఇప్పటికే ఐదుగురు కంటెస్టెంట్స్ కన్ఫర్మ్ అయ్యారు. ఇక ప్రస్తుతం బిగ్ బాస్ 8 తెలుగు హౌజ్‌లో 11 మంది కంటెస్టెంట్స్ ఉన్నారు.
Bigg Boss 8 Telugu Ex Contestants Entry List: ప్రస్తుతం బిగ్ బాస్ తెలుగు 8 సీజన్ బాగానే రసవత్తరంగా సాగుతోంది. సెప్టెంబర్ 2న ప్రారంభమైన బిగ్ బాస్ 8 తెలుగులోకి మొత్తంగా 14 మంది కంటెస్టెంట్స్ అడుగుపెట్టిన విషయం తెలిసిందే. వారిలో ముగ్గురు ఎలిమినేట్ కావడంతో ప్రస్తుతం హౌజ్‌లో 11 మంది కంటెస్టెంట్స్ ఉన్నారు.
ముగ్గురిని ఆపిన హౌజ్‌మేట్స్
అయితే, ఇటీవల వైల్డ్ కార్డ్ ద్వారా 12 మంది రెండు మూడు వారాల్లో రానున్నారని హౌజ్‌మేట్స్‌కు బిగ్ బాస్ చెప్పిన విషయం తెలిసిందే. అయితే, వారిని సర్వైవల్ ఆఫ్ ది ఫిట్టెస్ట్ ఛాలెంజ్‌ల్లో గెలిచి ఆపొచ్చని కూడా బిగ్ బాస్ తెలిపాడు. దాంతో ఐదు ఛాలెంజెస్ ఆడిన శక్తి, కాంతారా రెండు క్లాన్స్ మూడు గెలిచాయి. దాంతో మూడు వైల్డ్ కార్డ్స్ మెంబర్స్ రాకుండా ఆపగలిగారు హౌజ్‌మేట్స్.
టాలీవుడ్ యంగ్ హీరో
ఇక వైల్డ్ కార్డ్ ద్వారా 9 మంది రావొచ్చనే టాక్ నడుస్తోంది. ఈ నేపథ్యంలో వారిలో ఐదుగురు నూటికి నూరు శాతం కన్ఫర్మ్ అయినట్లు బిగ్ బాస్ వర్గాల నుంచి వచ్చిన సమాచారం. ఈ సమచారం మేరకు టాలీవుడ్ యంగ్ హీరో ఒకరు బిగ్ బాస్ తెలుగు 8 సీజన్‌లోకి ఎంట్రీ ఇవ్వనున్నాడని తెలిసింది. అతనే గౌతమ్ కృష్ణ.
రెండు సినిమాలు
బిగ్ బాస్ తెలుగు 7 సీజన్‌లో కంటెస్టెంట్‌గా పాల్గొన్న గౌతమ్ కృష్ణ ఈ సీజన్ 8లో మరోసారి తానేంటో నిరూపించుకోనున్నాడు. సీజన్ 7 ఎంట్రీకి ముందుగానే గౌతమ్ కృష్ణ ఓ సినిమాలో హీరోగా చేశాడు. అలాగే, నిర్మాతగా, దర్శకుడిగా బాధ్యతలు చేపట్టాడు. బిగ్ బాస్ 7 తెలుగు తర్వాత సోలో బాయ్ అనే మరో సినిమాలో హీరోగా చేశాడు గౌతమ్ కృష్ణ. అంతకుముందు 2022లో ఆకాశ వీధులో అనే చిత్రంలో నటించాడు.
సోషల్ మీడియా ఇన్‌ఫ్ల్యూయెన్సర్ ఎంట్రీ
ఇక గౌతమ్‌తోపాటు బిగ్ బాస్ తెలుగు 7 కంటెస్టెంట్, సోషల్ మీడియా ఇన్‌ఫ్ల్యూయెన్సర్ నయని పావని కూడా సీజన్ 8లోకి రానుంది. గత సీజన్‌లో గ్రాండ్ ఫినాలే 2.0 ద్వారా ఎంట్రీ ఇచ్చిన నయని పావని మొదటి వారమే ఎలిమినేట్ అయింది. ఆటతో బాగా మెప్పించినప్పటికీ ఆడియెన్స్ దృష్టికి చేరలేదు. అందుకే ఈ సీజన్ ద్వారా మరోసారి తానేంటో నిరూపించుకోవాలనుకుంటోందని తెలుస్తోంది.
జబర్దస్త్ కమెడియన్స్ ఇద్దరు
ఈ ఇద్దరితోపాటు జబర్దస్త్ అవినాష్, బిగ్ బాస్ మాజీ కంటెస్టెంట్, నటి హరితేజ, జబర్దస్త్ లేడి కమెడియన్ రోహిణి కూడా బిగ్ బాస్ 8 తెలుగులోకి వైల్డ్ కార్డ్ ద్వారా ఎంట్రీ ఇవ్వనున్నారు. ప్రస్తుతానికి ఈ ఐదుగురు కన్ఫర్మ్ అయినట్లు పక్కా సమాచారం అందింది. వీరందరూ అక్టోబర్ 5న జరిగే బిగ్ బాస్ తెలుగు 8 గ్రాండ్ ఫినాలే 2.0తో ఎంట్రీ ఇవ్వనున్నారు.