Nagababu: కొత్త మొహాలు అయితే బాగుంటుంది- వాళ్లకు చిరంజీవికి ఉన్న ఏజ్ ఉంటుంది- నాగబాబు కామెంట్స్
Nagababu About Committee Kurrollu Movie Actors: మెగా బ్రదర్ నాగబాబు కుమార్తే నిహారిక కొణిదెల సమర్పించిన కమిటీ కుర్రోళ్లు సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ గ్రాండ్‌గా జరిగింది. ఈ కార్యక్రమానికి అతిథిగా హాజరైన నిహారిక తండ్రి నాగబాబు తన సోదరుడు చిరంజీవి వయసుపై కామెంట్స్ చేశారు.
Nagababu About Chiranjeevi Age: మెగా డాటర్ నిహారిక కొణిదెల సమర్పణలో పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ ఎల్ఎల్‌పీ, శ్రీరాధా దామోదర్ స్టూడియోస్ బ్యానర్స్‌పై రూపొందిన సినిమా కమిటీ కుర్రోళ్లు. యదు వంశీ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో అంతా కొత్త నటీనటులతో చిత్రీకరించారు. దీంతో ఈ చిత్రం ఇప్పటికీ అందరిలోనూ అంచనాలు పెంచేసింది.
జోరుగా ప్రమోషన్స్
ఇది వరకు రిలీజ్ చేసిన కమిటీ కుర్రోళ్లు ట్రైలర్, టీజర్, సాంగ్స్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇలా జోరుగా ప్రమోషన్స్ నిర్వహిస్తున్నారు. ఇక ఆగస్ట్ 9న కమిటీ కుర్రోళ్లు సినిమాను తెలుగు రాష్ట్రాల్లో గ్రాండ్‌గా రిలీజ్ చేయనున్నారు. ఏపీ తెలంగాణలో ఈ చిత్రాన్ని వంశీ నందిపాటి విడుదల చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇటీవల సోమవారం (ఆగస్ట్ 5) కమిటీ కుర్రోళ్లు మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను నిర్వహించారు.
హీరోలతోపాటు నాగబాబు
కమిటీ కుర్రోళ్లు ప్రీ రిలీజ్ ఈవెంట్‌తు మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, సుప్రీమ్ హీరో సాయి దుర్గ తేజ్, అడివి శేష్, వెంకీ అట్లూరి వంటి వారితోపాటు నిర్మాత, నటుడు, నిహారిక తండ్రి నాగబాబు సైతం గెస్ట్‌గా విచ్చేశారు. అనంతరం ఈ కార్యక్రమంలో ఒక్కకొక్కరుగా తమ అభిప్రాయాలను పంచుకున్నారు.
డ్యాన్స్ ఫైట్స్ లేకుండా
నాగబాబు మాట్లాడుతూ.. "ఫణి గారు ఓ కథను వినమని చెప్పారు. కానీ, నేను వినలేదు. నిహారిక ఆల్రెడీ కథ వినేసింది. కథ నాకు చాలా నచ్చింది.. ఓ సారి వినండి నాన్నా అని నిహారిక చెప్పింది. వంశీ నాకు డ్యాన్స్, ఫైట్స్ లేకుండా సినిమా అంతా చూపించాడు. వంశీ కరెక్ట్‌గా తీస్తే సినిమా బాగుంటుందని అర్థమైంది" అని చెప్పారు.
పునాది రాళ్లు టైమ్
"నిహారికకు మంచి జడ్జ్‌మెంట్ ఉంటుంది. తెలిసిన మొహాలతో సినిమా చేయాలని అనుకుంది. కానీ, కొత్త మొహాలు అయితే బాగుంటుందని నేను అనుకున్నాను. దర్శకుడు మాత్రం నాలానే అనుకున్నాడు. అన్నయ్య చిరంజీవి గారు మొదటి చిత్రంగా పునాది రాళ్లు చేశారు. ఇందులో నటించిన వారికి కూడా దాదాపు పునాది రాళ్లు టైమ్ చిరంజీవి గారికి ఉన్న ఏజ్ ఉంటుంది" అని నాగబాబు ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు.
యంగ్‌స్టర్స్ ఉన్నచోట
"మనవూరి పాండవులు చిత్రంలో చాలా మంది కొత్త వాళ్లున్నారు. యంగ్‌స్టర్స్ ఉంటే అక్కడ ఎనర్జీ ఉంటుంది. అనుదీప్ గారు మంచి పాటలిచ్చారు. నా స్నేహితుడు ఫణికి సినిమాలు అంటే ప్యాషన్. నిహారికతో కలిసి సినిమాలు చేస్తాను అని అన్నాడు" అని నాగబాబు అన్నారు.
"ఈ కమిటీ కుర్రోళ్లు సినిమ కథ మా అందరికీ చాలా నచ్చింది. ఇందులో ఎన్నో ఎమోషన్స్ ఉంటాయి. ఎండింగ్ మాత్రం ప్రముఖ నాయకుడిని చూసిన ఫీలింగ్ కలుగుతుంది. ఆగస్ట్ 9న రాబోతోన్న ఈ చిత్రాన్ని అందరూ చూసి ఆదరించండి" అని నాగబాబు తెలిపారు.