Zee Telugu: సింగర్స్‌కు సువర్ణావకాశం.. జీ తెలుగు సరిగమప సీజన్​ 16 ఆడిషన్స్​.. హైదరాబాద్​​లో ఎక్కడంటే?-zee telugu saregamapa 16 the next singing youth icon auditions in hyderabad saregamapa 16 audition date at hyderabad ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Zee Telugu: సింగర్స్‌కు సువర్ణావకాశం.. జీ తెలుగు సరిగమప సీజన్​ 16 ఆడిషన్స్​.. హైదరాబాద్​​లో ఎక్కడంటే?

Zee Telugu: సింగర్స్‌కు సువర్ణావకాశం.. జీ తెలుగు సరిగమప సీజన్​ 16 ఆడిషన్స్​.. హైదరాబాద్​​లో ఎక్కడంటే?

Sanjiv Kumar HT Telugu
Aug 20, 2024 11:35 AM IST

Zee Telugu SAREGAMAPA 16 The Next Singing Youth Icon: సీరియల్స్, టీవీ షోలతో ఆద్యంతం ఎంటర్టైన్‌ చేసే జీ తెలుగు అందిస్తోన్న సరిగమప 16 ది నెక్ట్స్ సింగింగ్ యూత్ ఐకాన్ ఆడిషన్స్‌ను హైదరాబాద్‌లో నిర్వహిస్తున్నారు. కాబోయే గాయనీగాయకులకు ఇది సువర్ణావకాశంగా మారనుంది. హైదరాబాద్‌లో ఎక్కడ నిర్వహిస్తున్నారంటే..

సింగర్స్‌కు సువర్ణావకాశం.. జీ తెలుగు సరిగమప సీజన్​ 16 ఆడిషన్స్​.. హైదరాబాద్​​లో ఎక్కడంటే?
సింగర్స్‌కు సువర్ణావకాశం.. జీ తెలుగు సరిగమప సీజన్​ 16 ఆడిషన్స్​.. హైదరాబాద్​​లో ఎక్కడంటే?

Zee Telugu SAREGAMAPA 16 Auditions: తెలుగు ప్రేక్షకులకు ఎనలేని వినోదాన్ని పంచడంలో ముందుండే ఛానల్​ జీ తెలుగు. ఫిక్షన్​, నాన్-ఫిక్షన్​ షోతో పాటు ప్రత్యేక కార్యక్రమాలతో​ వినోదం అందించడంతోపాటు​ ప్రతిభావంతులను వెలికితీయడంలోనూ ప్రముఖ పాత్ర పోషిస్తుంది. సరిగమప నిర్వహించిన 15 సీజన్లలో ఎంతోమంది గాయనీగాయకులను ప్రేక్షకులకు పరిచయం చేసింది.

సువర్ణ అవకాశం

​విజయవంతంగా 15 సీజన్లు పూర్తి చూసుకున్న జీ తెలుగు ‘సరిగమప సీజన్‌ 16‌- ది నెక్ట్స్ సింగింగ్​ యూత్​ ఐకాన్​’​ను ప్రారంభించడానికి సిద్ధమవుతోంది. ఇందులో భాగంగా తెలుగు రాష్ట్రాల్లో విస్తృతంగా ఆడిషన్స్​ నిర్వహిస్తోంది. ప్రతిభావంతులైన గాయనీగాయకులు ఈ సువర్ణావకాశాన్ని వినియోగించుకునే అవకాశం అందిస్తోంది.

ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ పట్టణాల్లో విజయవంతంగా నిర్వహించిన సరిగమప సీజన్ 16 ఆడిషన్స్​కి ఎనలేని స్పందన లభించింది. జీ తెలుగు సరిగమప తదుపరి సీజన్​ కోసం తెలుగు రాష్ట్రాల్లోని పలు పట్టణాల్లో ఆడిషన్స్​ నిర్వహిస్తోంది. ప్రతిభను ప్రోత్సహిస్తూ మట్టిలోని మాణిక్యాలను వెలికితీసేందుకు ఈ ఆదివారం (ఆగస్ట్ 25) హైదరాబాద్​​​లో ఆడిషన్స్​ నిర్వహిస్తోంది.

సాయంత్ర 5 వరకు

15 నుంచి 30 సంవత్సరాల వయస్సు గల గాయనీ గాయకులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని తమ ప్రతిభను నిరూపించుకోవచ్చు. సరిగమప సీజన్​ 16 ఆడిషన్స్​ ఉదయం 9:00 నుంచి సాయంత్రం 5 గంటల వరకు జరుగుతాయి. హైదరాబాద్​లోని హిందూ మహిళా జూనియర్ కళాశాల, హిందూ పబ్లిక్​ స్కూల్​ దగ్గర, గోకుల్​ థియేటర్​ ఎదురుగా, సనత్​ నగర్​లో ఆడిషన్స్​ జరగనున్నాయి.

జీ తెలుగు సరిగమప సీజన్ 16 ఆడిషనస్‌కు సంబంధించిన మరిన్ని వివరాల కోసం 9154670067 నెంబర్​కు కాల్ చేసి సంప్రదించవచ్చు. ఆసక్తి గలవారు జీ తెలుగు అందిస్తున్న ఈ గోల్డెన్​ ఛాన్స్​ని మిస్​ కావద్దు అని ఛానెల్ నిర్వాహకులు తాజాగా ప్రకటించారు. అంతేకాదు ఔత్సాహికులు ఆగస్టు 30 వరకు డిజిటల్ ఆడిషన్స్ ద్వారా కూడా ఈ అవకాశాన్ని అందిపుచ్చుకోవచ్చని తెలిపారు.

ఈ మెయిల్ ద్వారా

పాట పాడిన తమ వీడియోలను 9154670067 నెంబర్​కి వాట్సాప్ లేదా ztsaregamapa@zee.com ఈమెయిల్ ద్వారా పంపవచ్చు. ఇంకెందుకు ఆలస్యం జీ తెలుగు ‘సరిగమప సీజన్​ 16– ది నెక్ట్స్​ సింగింగ్​ యూత్​ ఐకాన్’ టైటిల్​ కోసం మీరూ పోటీలో పాల్గొనండి అంటూ జీ తెలుగు అధికారికంగా అనౌన్స్‌మెంట్ చేసింది.

ఇదిలా ఉంటే, జీ తెలుగు ఛానెల్‌లో ఎన్నో వినోదాత్మక షోలు, సీరియల్స్ సందడి చేస్తున్నాయి. కామెడీ షోలతోపాటు ఆద్యంతం ఆకట్టుకునే ధారావాహికలకు మంచి రెస్పాన్స్ వస్తోంది. నిండు నూరేళ్ల సావాసం సీరియల్ ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ తెచ్చుకుంటోంది. అలాగే ఇటీవల సరికొత్తగా కొన్ని సీరియల్స్‌ను స్టార్ట్ చేసింది జీ తెలుగు.

రెండు కొత్త సీరియల్స్

జీ తెలుగులో ఇటీవలే కలవారి కోడలు కనకమహాలక్ష్మి అనే సీరియల్ ప్రారంభమైంది. ఈ సీరియల్ ఆగస్ట్ 5 నుంచి స్టార్ట్ కాగా సోమవారం నుంచి శనివారం వరకు ప్రతిరోజు మధ్యాహ్నం 3 గంటలకు ప్రసారం అవుతోంది. అలాగే దానికంటే ముందుగా మేఘసందేశం అనే మరో ధారావాహిక జీ తెలుగులో టీవీ ప్రీమియర్ అవుతోంది.

మేఘసందేశం సీరియల్ జూన్​ 10 నుంచి ప్రారంభం అయింది. సోమవారం నుంచి శనివారం వరకు ప్రతిరోజు రాత్రి 7:30 గంటలకు మేఘసందేశం సీరియల్ ప్రసారం అవుతోంది. ఇలా సీరియల్స్, టీవీ షోలతో తెలుగు రాష్ట్ర ప్రేక్షకులకు జీ తెలుగు వినోదాన్ని పంచుతోంది.