Today OTT Movies: ఓటీటీలో ఇవాళ ఒక్కరోజే 17 సినిమాలు.. 11 చాలా స్పెషల్, తెలుగులో 5.. హారర్ టు క్రైమ్.. ఇక్కడ చూసేయండి!-today ott movies release telugu on netflix amazon prime horror film stree 2 temurun ott streaming gorre puranam tatva ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Today Ott Movies: ఓటీటీలో ఇవాళ ఒక్కరోజే 17 సినిమాలు.. 11 చాలా స్పెషల్, తెలుగులో 5.. హారర్ టు క్రైమ్.. ఇక్కడ చూసేయండి!

Today OTT Movies: ఓటీటీలో ఇవాళ ఒక్కరోజే 17 సినిమాలు.. 11 చాలా స్పెషల్, తెలుగులో 5.. హారర్ టు క్రైమ్.. ఇక్కడ చూసేయండి!

Sanjiv Kumar HT Telugu
Oct 10, 2024 10:55 AM IST

Today OTT Release Movies: ఓటీటీలోకి ఇవాళ ఒక్కరోజే (అక్టోబర్ 10) సినిమాలు, వెబ్ సిరీసులు కలిపి మొత్తం 17 వరకు డిజిటల్ స్ట్రీమింగ్‌కు వచ్చాయి. ఇందులో ఏకంగా 11 వరకు చాలా స్పెషల్‌గా ఉన్నాయి. వాటిలో 3 తెలుగు స్ట్రైట్ మూవీస్ ఉంటే హారర్, క్రైమ్ థ్రిల్లర్స్ స్పెషల్‌గా ఉన్నాయి.

ఓటీటీలో ఇవాళ ఒక్కరోజే 17 సినిమాలు.. 11 చాలా స్పెషల్, తెలుగులో 5.. హారర్ టు క్రైమ్.. ఇక్కడ చూసేయండి!
ఓటీటీలో ఇవాళ ఒక్కరోజే 17 సినిమాలు.. 11 చాలా స్పెషల్, తెలుగులో 5.. హారర్ టు క్రైమ్.. ఇక్కడ చూసేయండి!

Today OTT Releases: ఈ వారం ఓటీటీలో సినిమాలు, వెబ్ సిరీసులు కలిపి 24కిపైగా డిజిటల్ స్ట్రీమింగ్‌కు రాగా.. ఇవాళ (అక్టోబర్ 10) ఒక్కరోజే వాటిలో ఏకంగా 17 వరకు డిజిటల్ ప్రీమియర్‌ అవుతున్నాయి. వాటిలో హారర్ కామెడీ, హారర్ సినిమాలు, క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీసులు ఉన్నాయి. అంతేకాకుండా స్పెషల్‌గా తెలుగు స్ట్రైట్ సినిమాలు కూడా ఓటీటీ రిలీజ్ అయ్యాయి. మరి అవేంటీ, వాటి ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ ఏంటో లుక్కేద్దాం.

నెట్‌ఫ్లిక్స్ ఓటీటీ

స్టార్టింగ్ 5 (వెబ్ సిరీస్)- అక్టోబర్ 9

ఖేల్ ఖేల్ మే (హిందీ చిత్రం)- అక్టోబర్ 9

మాన్‌స్టర్ హై 2 (ఇంగ్లీష్ మూవీ)- అక్టోబర్ 10

గర్ల్ హాంట్స్ బాయ్ (ఇంగ్లీష్ చిత్రం)- అక్టోబర్ 10

ఔటర్ బ్యాంక్స్ సీజన్ 4 పార్ట్ 1 (ఇంగ్లీష్ వెబ్ సిరీస్)- అక్టోబర్ 10

టాంబ్ రైడర్: ది లెజెండ్ ఆఫ్ లారా క్రాఫ్ట్ (యానిమేటెడ్ వెబ్ సిరీస్)- అక్టోబర్ 10

దట్ కైండ్ ఆఫ్ లవ్ (ఫిలిపినో ఫిల్మ్)- అక్టోబర్ 10

టెమురున్ (Temurun) (హారర్ మూవీ)- అక్టోబర్ 10

అమెజాన్ ప్రైమ్ ఓటీటీ

సిటాడెల్: డయానా (ఇంగ్లీష్ వెబ్ సిరీస్)- అక్టోబర్ 10

స్త్రీ 2 (హిందీ చిత్రం)- అక్టోబర్ 10

వాకింగ్ డెడ్: డెడ్ సిటీ సీజన్ 1 (ఇంగ్లీష్ వెబ్ సిరీస్)- అక్టోబర్ 10

జోసన్ అటార్నీ ఏ మొరాలిటీ (తెలుగు డబ్బింగ్ కొరియన్ వెబ్ సిరీస్)- అక్టోబర్ 10

అఫ్రైడ్ (ఇంగ్లీష్ చిత్రం)- అక్టోబర్ 10

అక్యూస్‌డ్ (క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్)- అక్టోబర్ 10

ఈటీవీ విన్ ఓటీటీ

తత్వ (తెలుగు మూవీ)- అక్టోబర్ 10

పైలం పిలగా (తెలుగు చిత్రం)- అక్టోబర్ 10

గొర్రె పురాణం (తెలుగు మూవీ)- ఆహా ఓటీటీ- అక్టోబర్ 10

ది ఇర్రేషనల్ (ఇంగ్లీష్ వెబ్ సిరీస్)- జియో సినిమా- అక్టోబర్ 10

వేదా (తెలుగు డబ్బింగ్ హిందీ చిత్రం)- జీ5 ఓటీటీ- అక్టోబర్ 10

హారర్ కామెడీ, క్రైమ్ థ్రిల్లర్స్

ఇలా ఇవాళ ఒక్కరోజే 17 వరకు సినిమాలు, వెబ్ సిరీసులు ఓటీటీ స్ట్రీమింగ్ అవుతున్నాయి. వీటిలో హిందీ బ్లాక్ బస్టర్ హారర్ కామెడీ చిత్రం స్త్రీ 2, యాక్షన్ థ్రిల్లర్ వేదా, తాప్సీ నటించిన ఖేల్ ఖేల్ మేతోపాటు తెలుగు సినిమాలు తత్వ, పైలం పిలగా, గొర్రె పురాణం చాలా స్పెషల్‌గా ఉన్నాయి. అలాగే, హారర్ మూవీ టెమురున్, క్రైమ్ థ్రిల్లర్ సిరీస్ అక్యూస్‌డ్ సైతం ఇంట్రెస్టింగ్ సినిమాలు అని చెప్పుకోవచ్చు.

తెలుగులో మొత్తం 5

అంతేకాకుండా ప్రియాంక చోప్రా సిటాడెల్‌కు సీక్వెల్‌గా వచ్చిన సిటాడెల్ డయానా, జాంబీ సర్వైవల్ థ్రిల్లర్ అయిన వాకింగ్ డెడ్: డెడ్ సిటీ సీజన్ 1, తెలుగు డబ్బింగ్ కొరియన్ సిరీస్ జోసన్ అటార్నీ ఏ మొరాలిటీ కూడా చూడాల్సినవే. అయితే, 17లో 7 సినిమాలు, 4 వెబ్ సిరీసులతో మొత్తం 11 స్పెషల్‌గా ఉన్నాయి. వీటిలో మూడు స్ట్రైట్ తెలుగు సినిమాలు ఉంటే రెండు తెలుగు సిరీసులు తెలుగు డబ్బింగ్‌లో ఉన్నాయి.

Whats_app_banner