Shani: మోసం, అబద్ధాలు చెప్పే అలవాటు ఉంటే జాగ్రత్తగా ఉండండి.. ఈ గ్రహం శిక్ష వేస్తుంది-shani dev will give very big punishment if you lie or do harm to anyone or at any situation ,రాశి ఫలాలు న్యూస్
తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  Shani: మోసం, అబద్ధాలు చెప్పే అలవాటు ఉంటే జాగ్రత్తగా ఉండండి.. ఈ గ్రహం శిక్ష వేస్తుంది

Shani: మోసం, అబద్ధాలు చెప్పే అలవాటు ఉంటే జాగ్రత్తగా ఉండండి.. ఈ గ్రహం శిక్ష వేస్తుంది

Peddinti Sravya HT Telugu
Dec 12, 2024 04:15 PM IST

Shani: వ్యక్తులు చేసే కర్మలకు ఆయన ఫలితాలను ఇస్తారు. మంచి చేస్తే మంచి వస్తుంది. అదే చెడు చూస్తే చెడు ఫలితాలు అందుతాయి. శని కనుక అనుకూలంగా ఉంటే ఐశ్వర్యం, ఆనందం కలుగుతాయి, శని భగవానుని అనుగ్రహం లేకపోతే కష్టాలు ఎదుర్కోవలసి ఉంటుంది.

Shani: మోసం, అబద్ధాలు చెప్పే అలవాటు ఉంటే జాగ్రత్తగా ఉండండి
Shani: మోసం, అబద్ధాలు చెప్పే అలవాటు ఉంటే జాగ్రత్తగా ఉండండి

అన్ని గ్రహాలు కంటే శని గ్రహానికి ప్రత్యేక స్థానం ఉంది. శని గ్రహాన్ని పాపాత్మకమైన, క్రూరమైన గ్రహం అని అంటారు. వ్యక్తులు చేసే కర్మలకు ఆయన ఫలితాలను ఇస్తారు. మంచి చేస్తే మంచి వస్తుంది. అదే చెడు చూస్తే చెడు ఫలితాలు అందుతాయి. శని కనుక అనుకూలంగా ఉంటే ఐశ్వర్యం, ఆనందం కలుగుతాయి, శని భగవానుని అనుగ్రహం లేకపోతే కష్టాలు ఎదుర్కోవలసి ఉంటుంది. ప్రతి మనిషిలో కూడా మంచి చెడు లక్షణాలు ఉంటాయి. కొంతమంది అబద్ధాలు చెప్తారు. కొంతమంది మోసాలు చేస్తూ ఉంటారు. అలాంటి వారికి శని దేవుడు కఠినమైన శిక్షలను వేస్తారు.

శని కఠిన శిక్షలు తప్పవు:

వాటిని మనం జీవితంలో చాలా ఏళ్ళు గుర్తు పెట్టుకోవాల్సిన పరిస్థితి కలుగుతుంది. శని దేవుడు శిక్ష వేస్తారు. చెడు చేసే వాళ్ళకి కచ్చితంగా శని దేవుడి శిక్ష పడుతుంది, ఒకవేళ కనుక మీరు మంచి చేస్తే కర్మ ఫలదాత అయినటువంటి శని జీవితాన్ని ఇంప్రూవ్ చేస్తారు. మంచిని అందిస్తారు. అదే ఒకవేళ చెడు చేస్తే అదే మనకి తిరిగి వెనక్కి వస్తుంది. చాలా మంది మంచిగా ఇతరులకి సహాయం చేస్తూ ఉంటారు. కొందరు మాత్రం చెడు లక్షణాలని కలిగి ఉంటారు.

ఎప్పుడు కూడా చెడే చేస్తూ ఉంటారు. అబద్ధాలు చెప్పడం మోసం చేయడం ఇలాంటివి చేస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళు శని దేవుడు పట్ల జాగ్రత్తగా ఉండాలి. లేకపోతే చాలా బాధల్ని ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఎవరైనా అబద్ధాలు చెప్పినా మోసం చేసినా శని దేవుడు వాళ్ళని కఠినంగా శిక్షిస్తారు.

సాడే సతి, ధైయా:

ఒక గ్రహం నుంచి ఇంకొక గ్రహానికి శని దేవుడు కదలడానికి రెండున్నర ఏళ్ళు పడుతుంది. శని వలన 12 రాశులు కూడా ఎఫెక్ట్ అవుతాయి కచ్చితంగా ఎవరు కూడా శని దేవుడు శిక్షల నుంచి తప్పించుకోలేరు. సాడే సతి మొత్తం ఏడున్నర ఏళ్ళు. ధైయా రెండున్నర ఏళ్ళు ఈ సమయంలో శని తప్పు చేసిన వారికి శిక్షలు వేస్తారు. ఏది ఏమైనా ఒకరికి మంచి చేయాలి తప్ప ఒకరిని మోసం చేయాలని అనుకోకూడదు. అందరూ బంగుండాలి అందులో నేను ఉండాలి అనే ధోరణి లో ముందుకు వెళ్ళాలి తప్ప ఎప్పుడూ కూడా ఒకరిని ముంచేయాలని, మోసం చేయాలని అనుకోకూడదు. ఒకవేళ ఏమైనా పొరపాట్లు చేసినా, మోసం చేసినా శని వేసే శిక్ష నుంచి తప్పించుకోలేరు.

Whats_app_banner

సంబంధిత కథనం