చలికాలంలో శొంఠి తీసుకుంటే ఇంత మంచిదా - వీటిని తెలుసుకోండి

image credit to unsplash

By Maheshwaram Mahendra Chary
Dec 12, 2024

Hindustan Times
Telugu

చలికాలంలో శొంఠితో దగ్గు, జలుబు లాంటివి దూరం అవుతాయి. సీజనల్ ఇన్ఫెక్షన్లు సోకకుండా ఉంటాయి. 

image credit to unsplash

చలికాలంలో చాలా మందికి మలబద్ధకం సమస్య వేధిస్తుంది. అయితే ఒక గ్లాసు నీటిలో కొద్దిగా శొంఠి పొడి వేసుకొని తీసుంటే మంచి ఫలితం ఉంటుంది. 

image credit to unsplash

చలికాలంలో కఫం సమస్యలు ఎక్కువగా ఉంటాయి.  అయితే శొంటి తీసుకుంటే కఫం సమస్య తగ్గుతుంది.  దగ్గు, జలుబు, ఫ్లూ లేదా ఎలాంటి శ్వాస సంబంధమైన ఇబ్బందులు కూడా రావు.

image credit to unsplash

చలికాలంలో  శొంఠి తీసుకోవడం ద్వారా రోగనిరోధక శక్తి పెరుగుతుంది. ఇది మనల్ని వివిధ రకాల ఇన్ఫెక్షన్ల బారి నుంచి కాపాడుతుంది. మంచి ఆరోగ్య ఫలితాలుంటాయి. 

image credit to unsplash

శొంఠి తేలికగా జీర్ణమవుతుంది. అంతేకాకుండా జీర్ణవ్యవస్థ ఆరోగ్యానికి అద్భుతంగా పనిచేస్తుంది. సొంటి పొడిని నీటితో కలిపి తీసుకుంటే మేలైన ప్రయోజనాలు ఉంటాయి.

image credit to unsplash

 శొంఠిని తీసుకుంటే నొప్పుల నుంచి ఉపశమనం లభిస్తుంది. అలాగే డ్రై స్కిన్, చుండ్రు సమస్యను పోగొట్టడానికి కూడా శొంఠి బాగా ఉపయోపడుతుంది.

image credit to unsplash

శొంటి గుండె జబ్బులను తగ్గిస్తుంది. శరీర మంటను కూడా తగ్గించడానికి సహాయపడుతుంది. ఆయాసం, గొంతు నొప్పి, కడుపు నొప్పి, పైత్యం, వాతం రోగాలను  తగ్గిస్తుంది. 

image credit to unsplash

అఖండ హీరోయిన్ ప్రగ్యా జైస్వాల్ లేటెస్ట్ గ్లామర్ ఫోటోలు

Instagram