Money Plant Vastu: డబ్బు, శ్రేయస్సు కావాలా..? మనీ ప్లాంట్‌ను సరైన దిశలో ఉంచండి.. ఇలా పెంచండి!-directions and rituals for money plant according to vastu shastra ,రాశి ఫలాలు న్యూస్
తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  Money Plant Vastu: డబ్బు, శ్రేయస్సు కావాలా..? మనీ ప్లాంట్‌ను సరైన దిశలో ఉంచండి.. ఇలా పెంచండి!

Money Plant Vastu: డబ్బు, శ్రేయస్సు కావాలా..? మనీ ప్లాంట్‌ను సరైన దిశలో ఉంచండి.. ఇలా పెంచండి!

Ramya Sri Marka HT Telugu
Dec 12, 2024 03:53 PM IST

Money Plant Vastu: మనీప్లాంట్ అనేది కేవలం అలంకరణ కోసం మాత్రమే కాదు. అంతకంటే ఎక్కువ. సరైన దిశలో దీన్ని ఉంచడం వల్ల మీ జీవితంలో శ్రేయస్సును, డబ్బును, సామరస్యాన్ని ఆకర్షించడానికి సహాయపడుతుంది.

మనీ ప్లాంట్ ఇలా పెంచితే శుభం
మనీ ప్లాంట్ ఇలా పెంచితే శుభం (pexels)

ఇంట్లో లేదా కార్యాలయాల్లో సానుకూల వాతావరణం కోసం, డబ్బు, శ్రేయస్సు కోసం పురాతన భారతీయ వాస్తు శాస్త్రం కొన్ని మార్గదర్శకాలను సూచించింది. ఇవి శక్తులను సమన్వయం చేసేందుకు జీవితాన్ని సామరస్యం చేసేందుకు ఉపయోగపడతాయి. వాస్తు శాస్త్రం సూచించిన అనేక మార్గాలలో మనీ ప్లాంట్ పెంపకం ఒకటి. మనీ ప్లాంట్ ను సరైన దిశలోఉంచడం అనేది ఐశ్వర్యాన్ని, శ్రేయస్సుకు ఆకర్షించేందుకు సహాయపడుతుంది. అంతేకాదు మనీ ప్లాంట్ మొక్కను పెంచేందుకు, పూజించేందుకు కొన్ని ప్రత్యేక నియమాలు ఉన్నాయి. వాటి ఆధారంగా మనీ ప్లాంట్ ను పెంచితేనే ఇంటికి ఐశ్వర్యం, శ్రేయస్సు కలుగుతాయి.

మనీ ప్లాంట్ ను ఏ దిశలో పెంచాలి?

వాస్తు శాస్త్రం ప్రకారం మనీ ప్లాంట్ ను ఈశాన్య దిశలో పెంచడం వల్ల ఆర్థిక అస్థిరత, సవాళ్లు ఎదురవుతాయి. ఈశాన్య దివ ఆర్థిక వైఫల్యాలకు దారితీస్తుంది కనుక ఈ దిశలో మనీ ప్లాంట్ ను ఎప్పుడూ ఉంచకూడదు.

ఆగ్నేయ మూలలో గణేశుడు ఉండాడు. ఈ మూలను శుక్రుడు పాలిస్తాడని వాస్తు శాస్త్రం చెబుతోంది. కనుక మనీ ప్లాంట్ పెంపకానికి ఆగ్నేయ దిశ చాలా అనువైనది. ఆగ్నేయ దిశలో మనీ ప్లాంట్ ను పెట్టడం వల్ల ఇది ఇంట్లోకి సంపద, శ్రేయస్సు, సానుకూలతను ఆకర్షిస్తుంది.

మనీ ప్లాంట్ సంరక్షణ పద్ధతులు:

  • మనీ ప్లాంట్ మొక్కను ఆగ్నేయ మూలలో పెంచడం వల్ల సానుకూల ప్రభావాలు పెరుగుతాయి.
  • ఇంట్లో పెంచినట్టయితే మొక్క స్తబ్దత నివారించడానికి గాజు సీసాలో పెంచాలి. ఇలా చేసినప్పడు తరచూ నీటిని మారుస్తుండాలి.
  • మొక్క వాడిపోయినా, ఎండిపోయినా ఇంట్లో శ్రేయస్సుకు అంతరాయం కలుగుతుంది.
  • మనీ ప్లాంట్ తీగలు ఎప్పుడూ నేలను తాకకుండా చూసుకోండి. ఇది అశుభానికి కారణం అవుతుంది. తీగలు ఎప్పుడూ పైకి వెళుతుండాలి. ఇది ఇంటి అభివృద్ధికి దోహదపడుతుంది.
  • మనీ ప్లాంట్ మొక్కను ఎప్పుడూ, ఎవరికీ బహుమతిగా ఇవ్వకూడదు.

పాటించాల్సిన ఆచారాలు:

  • మనీ ప్లాంట్ పెంచుకునే వారు ప్రతి శుక్రవారం నాడు తప్పకుండా చెట్టుకు నీరు పోయాలి. నీటిలో పచ్చిపాలను కలిపి చెట్టుకు పోయడం వల్ల ఆర్థిక అడ్డంకులు తొలగిపోతాయని నమ్మిక.
  • మనీ ప్లాంట్ మొక్క వల్ల కలిగే సానుకూల శక్తులను పెంపొందించేందుకు మొక్క మొదల్ల చుట్టూ దారాన్ని కట్టండి.
  • మనీ ప్లాంట్ మొక్క ఎదుగుదల ఇంట్లోని శ్రేయస్సుకు ప్రతీక. కనుక తీగలు పైకి పారేలాగా తీగకు దారం కట్టి పైకి ఎదిగేలా చేయండి. ఇది మీ ఆర్థిక, మానసిక, వ్యాపార ఎదుగుదలను ఆకర్షిస్తుంది.
  • ఎండిపోయిన, వాడిపోయిన ఆకులను ఎప్పటికప్పుడు కత్తిరించి చెట్టు ప్రాణ శక్తిని కాపాడుకోండి. శ్రేయస్సు, శాంతి, శుభాన్ని కలిగిస్తుంది.

గమనిక : ఈ కథనంలో మీకు అందించిన సమాచారం, సూచనలు పూర్తిగా నిజమైనది, ఖచ్చితమైనది అని మేము చెప్పలేము. నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.

Whats_app_banner