AP TG Weather Report : బలహీనపడనున్న అల్పపీడనం - ఏపీకి వర్ష సూచన..! తెలంగాణలో చలి తీవ్రత, ఈ జిల్లాలకు ఎల్లో అలర్ట్
- AP Telangana Weather Updates : బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం మరో 12 గంటల్లో క్రమంగా బలహీనపడే అవకాశం ఉంది. ఈ మేరకు IMD బులెటిన్ విడుదల చేసింది. ఈ ప్రభావంతో ఏపీలో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉంది. తెలంగాణలో చలి తీవ్రత ఎక్కువగా ఉండనుంది. పలు జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు జారీ అయ్యాయియ
మీ నగరంలో వాతావరణం తెలుసుకునేందుకు ఇక్కడ క్లిక్ చేయండి
- AP Telangana Weather Updates : బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం మరో 12 గంటల్లో క్రమంగా బలహీనపడే అవకాశం ఉంది. ఈ మేరకు IMD బులెటిన్ విడుదల చేసింది. ఈ ప్రభావంతో ఏపీలో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉంది. తెలంగాణలో చలి తీవ్రత ఎక్కువగా ఉండనుంది. పలు జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు జారీ అయ్యాయియ
(1 / 7)
గల్ఫ్ ఆఫ్ మన్నార్ తో పాటు పరిసర ప్రాంతాలపై కేంద్రీకృతమైన అల్పపీడనం కొనసాగుతోందని ఐఎండీ తెలిపింది. దీనికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం కూడా ఉందని పేర్కొంది.
(2 / 7)
ఈ అల్పపీడనం పశ్చిమ- వాయువ్య దిశగా దక్షిణ తమిళనాడ వైపు కదులుతూ వచ్చి 12 గంటల్లో క్రమంగా బలహీనపడే అవకాశం ఉందని వాతావరణశాఖ అంచనా వేసింది.
(3 / 7)
ఈ ప్రభావంతో ఏపీలో ఇవాళ(డిసెంబర్ 12, 2024) ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల అనంతపురం, శ్రీ సత్య సాయి, వైఎస్ఆర్, అన్నమయ్య, చిత్తూరు మరియు తిరుపతి జిల్లాల్లో కొన్నిచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉంది.
(4 / 7)
అల్పపీడన ప్రభావంతో ప్రభావంతో డిసెంబర్ 15 వ తేది వరకు కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, ఎన్టీఆర్, కృష్ణా,గుంటూరు, పల్నాడు, బాపట్ల, ప్రకాశం మరియు రాయలసీమ జిల్లాల్లో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది.
(5 / 7)
తిరుపతి, తిరుమలలో గురువారం ఉదయం భారీ వర్షం కురిసింది. భారీ వర్షంతో భక్తులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. మరోవైపు అల్పపీడన ప్రభావంతో తిరుమలలో చలి తీవ్రత కూడా పెరిగింది.
(6 / 7)
ఇక తెలంగాణలో చూస్తే చలి తీవ్రత పెరిగింది. రేపు (డిసెంబర్ 13, 2024) ఆదిలాబాద్,కొమరంభీమ్ ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్ జిల్లాల్లో శీతల గాలులు వీచే అవకాశం ఉంది. ఈ జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు జారీ అయ్యాయి.
ఇతర గ్యాలరీలు