One Nation, One Election: 'ఒకే దేశం, ఒకే ఎన్నికలు' బిల్లుకు కేంద్ర కేబినెట్ ఆమోదం
One Nation.. One Election: లోక్ సభ ఎన్నికలతో పాటు దేశవ్యాప్తంగా ఒకేసారి అన్ని రాష్ట్రాలకు అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించాలన్న ప్రతిపాదనకు సంబంధించిన 'వన్ నేషన్, వన్ ఎలక్షన్' బిల్లుకు కేంద్ర కేబినెట్ గురువారం ఆమోదం తెలిపింది.
One Nation, One Election: 'ఒకే దేశం, ఒకే ఎన్నికలు' బిల్లుకు కేబినెట్ ఆమోదం (HT_PRINT)
One Nation, One Election: 'వన్ నేషన్, వన్ ఎలక్షన్' బిల్లుకు కేంద్ర కేబినెట్ గురువారం ఆమోదం తెలిపింది. దేశవ్యాప్తంగా జమిలి ఎన్నికలకు సంబంధించిన ప్రత్యేక బిల్లు ఇది. ఈ బిల్లు పార్లమెంటు ఆమోదం పొంది చట్ట రూపం దాలిస్తే, దేశవ్యాప్తంగా, ఒకేసారి లోక్ సభ ఎన్నికలు, అన్ని రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరుగుతాయి. ఈ బిల్లును ఈ శీతాకాల పార్లమెంటు సమావేశాల్లోనే పార్లమెంటులో ప్రవేశపెట్టనున్నారు.
ఒకే సారి అన్ని ఎన్నికలు
ఈ బిల్లును రూపొందించడానికి ముందు జమిలి ఎన్నికల సాధ్యాసాధ్యాలపై కేంద్ర ప్రభుత్వం మాజీ రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ నేతృత్వంలో ఒక కమిటీని ఏర్పాటు చేసింది. ఆ కమిటీ ఇటీవల తన నివేదికను కేంద్రానికి సమర్పించింది. ప్రధాని మోదీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం గత కొన్నాళ్లుగా ‘ఒకే దేశం.. ఒకే ఎన్నిక’ అనే ప్రతిపాదనను ముందుకు తెస్తోంది.