తెలుగు న్యూస్ / ఫోటో /
President Ram Nath Kovind | రామ్‌నాథ్ కోవింద్ కు ఘన వీడ్కోలు
- రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ వీడ్కోలు సమావేశం పార్లమెంట్ సెంట్రల్ హాళ్లో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ఉపరాష్ట్రపతి, రాజ్యసభ చైర్మన్ వెంకయ్యనాయుడు, ప్రధాని మోదీ, లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా, వివిధ పార్టీల ఎంపీలు తదితరులు హాజరయ్యారు. ఈ సందర్బంగా రాష్ట్రపతి కోవింద్ మాట్లాడుతూ.. విభజన రాజకీయాల నుంచి ఎదగాలని పార్టీలకు సూచించారు. ప్రజా సంక్షేమం కోసం కృషి చేయాలని కోరారు. ఇండియన్ పార్లమెంటరీ సిస్టమ్ ఒక పెద్ద కుటుంబమన్నారు. కుటుంబంలోని విబేధాలను సామరస్యంగా పరిష్కరించుకోవాలన్నారు. నిరసనను, వ్యతిరేకతను వ్యక్తం చేయడానికి గాంధీ చూపిన మార్గం అవలంబించాలని తన వీడ్కోలు ప్రసంగంలో రాష్ట్రపతి కోవింద్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. బిహార్‌లోని ఒక కుగ్రామం నుంచి రాష్ట్రపతి భవన్‌కు రామ్‌నాథ్ కోవింద్ చేసిన ప్రస్థానం స్ఫూర్తిదాయకమని స్పీకర్ ఓం బిర్లా కొనియాడారు. రామ్‌నాథ్ కోవింద్ స్థానంలో భారత నూతన రాష్ట్రపతిగా ద్రౌపది ముర్ము సోమవారం ప్రమాణం చేయనున్నారు. ఆమెతో సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ ప్రమాణం చేయిస్తారు. పార్లమెంటు సెంట్రల్ హాళ్లో జరిగిన రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ వీడ్కోలు సభ వివరాలు ఈ చిత్రాల్లో..!

(1 / 11)
పార్లమెంట్ సెంట్రల్ హాళ్లో రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ వీడ్కోలు కార్యక్రమంలో పాల్గొన్న ప్రధాని మోదీ, ఇతర ఎంపీలు(Om Birla Twitter)
(2 / 11)
రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ కు జ్ఙాపిక బహూకరిస్తున్నఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, ప్రధాని మోదీ, లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా(President of India Twitter)
(3 / 11)
రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ వీడ్కోలు సమావేశానికి వస్తున్న ప్రధాని మోదీ, రాష్ట్రపతి కోవింద్(Hindustan Times)
(5 / 11)
రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు కుటుంబ సభ్యులు(Vice President of India Twitter)
ఇతర గ్యాలరీలు