Keerthy Suresh Wedding: పెళ్లి చేసుకున్న కీర్తి సురేష్.. గోవాలో హిందూ సాంప్రదాయంలో.. ఇన్‌స్టాగ్రామ్‌లో ఫొటోలు వైరల్-keerthy suresh wedding tollywood actress married to antony thattil photos gone viral ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Keerthy Suresh Wedding: పెళ్లి చేసుకున్న కీర్తి సురేష్.. గోవాలో హిందూ సాంప్రదాయంలో.. ఇన్‌స్టాగ్రామ్‌లో ఫొటోలు వైరల్

Keerthy Suresh Wedding: పెళ్లి చేసుకున్న కీర్తి సురేష్.. గోవాలో హిందూ సాంప్రదాయంలో.. ఇన్‌స్టాగ్రామ్‌లో ఫొటోలు వైరల్

Hari Prasad S HT Telugu
Dec 12, 2024 03:04 PM IST

Keerthy Suresh Wedding: కీర్తి సురేష్ పెళ్లి చేసుకుంది. ముందుగా చెప్పినట్లే గురువారం (డిసెంబర్ 12) గోవాలో వీళ్ల పెళ్లి హిందూ సాంప్రదాయంలో జరగగా.. ఆ ఫొటోలను ఆమె ఇన్‌స్టాగ్రామ్ లో షేర్ చేసింది. అవి ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.

పెళ్లి చేసుకున్న కీర్తి సురేష్.. గోవాలో హిందూ సాంప్రదాయంలో.. ఇన్‌స్టాగ్రామ్‌లో ఫొటోలు వైరల్
పెళ్లి చేసుకున్న కీర్తి సురేష్.. గోవాలో హిందూ సాంప్రదాయంలో.. ఇన్‌స్టాగ్రామ్‌లో ఫొటోలు వైరల్

Keerthy Suresh Wedding: టాలీవుడ్‌తోపాటు సౌత్ ఇండియాలో పాపులర్ నటి అయిన కీర్తి సురేష్ ఏడడుగులు వేసింది. 15 ఏళ్లుగా తన బాయ్‌ఫ్రెండ్ గా ఉన్న ఆంటోనీ తట్టిల్ ను గోవాలో పెళ్లాడింది. గురువారం (డిసెంబర్ 13) వీళ్ల పెళ్లి కుటుంబ సభ్యులు, సన్నిహితుల మధ్య ఘనంగా జరిగింది. దీనికి సంబంధించిన ఫొటోలు ఇప్పుడు వైరల్ గా మారాయి.

కీర్తి సురేష్ పెళ్లి

తన బాయ్‌ఫ్రెండ్ ఆంటోనీని కీర్తి సురేష్ పెళ్లి చేసుకోనున్నట్లు గత నెలలోనే వార్తలు వచ్చాయి. ఆ తర్వాత తన రిలేషన్షిప్ కు 15 ఏళ్లంటూ ఈ విషయాన్ని కన్ఫమ్ చేసిన ఆమె.. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న తర్వాత మీడియాతో మాట్లాడుతూ.. గోవాలో పెళ్లి చేసుకోనున్నట్లు కూడా చెప్పింది. చెప్పినట్లే గురువారం (డిసెంబర్ 13) వీళ్లు ఒక్కటయ్యారు.

ForTheLoveOfNyke ❤️ అనే హ్యాష్‌ట్యాగ్ తో ఆమె తన పెళ్లి ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్ లో షేర్ చేసుకుంది. ఇందులో కీర్తి, ఆంటోనీ పెళ్లి హిందూ సాంప్రదాయంలో జరిగినట్లు స్పష్టమవుతోంది. కీర్తి మెడలో ఆంటోనీ మూడు ముళ్లు వేసిన ఫొటోతోపాటు ఇద్దరూ ఆప్యాయంగా కౌగిలించుకున్న ఫొటో, పెళ్లికి ముందు ప్రీవెడ్డింగ్ ఫొటోషూట్ కూడా ఈ పోస్టులో చూడొచ్చు.

కీర్తి సురేష్ చేసిన ఈ పోస్ట్ వెంటనే వైరల్ అయింది. ఈ జంటకు సెలబ్రిటీలతోపాటు అభిమానులు కూడా శుభాకాంక్షలు చెప్పారు. హీరోయిన్లు సంయుక్త, రాశీ ఖన్నా, డింపుల్ హయాతీలాంటి వాళ్లు కీర్తికి కంగ్రాట్స్ చెబుతూ కామెంట్స్ చేశారు. పెళ్లి చీరలో కీర్తి చాలా అందంగా కనిపించింది. తమ 15 ఏళ్ల బంధాన్ని పెళ్లిగా మలచుకున్న ఆనందం ఆ ఇద్దరిలోనూ కనిపించింది.

కీర్తి సురేష్ లవ్ స్టోరీ

కీర్తి సురేష్, ఆంటోనీ తట్టిల్ లవ్ స్టోరీ ఇప్పటిది కాదు. ఈ ఇద్దరూ హైస్కూల్లో ఉన్నప్పటి నుంచే ప్రేమలో ఉన్నారు. ఈ విషయాన్ని ఈ మధ్యే ఆమె కూడా కన్ఫమ్ చేసింది. తమ రిలేషన్షిప్‌కు 15 ఏళ్ల పూర్తయ్యాయంటూ ఇన్‌స్టా పోస్టు చేసింది. ఆంటోనీ కేరళలోని ప్రముఖ రిసార్ట్ చెయిన్ కు ఓనర్ కావడం విశేషం. కీర్తి ఈ మధ్యే రఘు తాతా మూవీలో కనిపించిన విషయం తెలిసిందే. 

కల్కి 2898 ఏడీ మూవీలో ప్రభాస్ వాడిన బుజ్జి అనే కారుకు వాయిస్ ఇచ్చింది. ఇక ఇప్పుడు హిందీలో తొలిసారి వరుణ్ ధావన్ తో కలిసి బేబీ జాన్ మూవీ చేసింది. ఈ మూవీ ట్రైలర్ రిలీజ్ కాగా.. సినిమా డిసెంబర్ 25న ప్రేక్షకుల ముందుకు రానుంది. తెలుగులో మహానటి మూవీతో నేషనల్ అవార్డు అందుకున్న కీర్తి సురేష్.. రివాల్వర్ రీటా అనే మరో సినిమాలోనూ నటిస్తోంది.

Whats_app_banner