Thailand e-visa: బ్యాంకాక్ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా?.. మీకో గుడ్ న్యూస్-thailand announces e visa for indian passport holders from jan 2025 details ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Thailand E-visa: బ్యాంకాక్ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా?.. మీకో గుడ్ న్యూస్

Thailand e-visa: బ్యాంకాక్ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా?.. మీకో గుడ్ న్యూస్

Sudarshan V HT Telugu
Dec 12, 2024 04:02 PM IST

Thailand e-visa: భారతీయులకు థాయిలాండ్ ఒక గుడ్ న్యూస్ చెప్పింది. భారత్ నుంచి థాయిలాండ్ వచ్చే భారతీయ పర్యాటకులకు ఈ - వీసా సదుపాయం కల్పిస్తున్నట్లు థాయిలాండ్ ప్రకటించిందది. ఈ సదుపాయం జనవరి 1, 2025 నుంచి అందుబాటులోకి వస్తుందని తెలిపింది.

థాయ్ లాండ్
థాయ్ లాండ్

Thailand e-visa: కొత్త సంవత్సరంలో థాయిలాండ్ టూర్ ప్లాన్ చేస్తున్నారా? అయితే, ఈ న్యూస్ మీ కోసమే. 2025 జనవరి 1 నుంచి భారతీయ పాస్ పోర్ట్ హోల్డర్లకు ఈ-వీసా సదుపాయాన్ని అమలు చేయనున్నట్లు న్యూఢిల్లీలోని థాయ్ లాండ్ రాయబార కార్యాలయం ప్రకటించింది. ఆఫ్ లైన్ పేమెంట్ విధానంలో ఈ సదుపాయం అందుబాటులో ఉంటుందని తెలిపింది.

పర్యాటకుల కోసం..

పర్యాటకం, స్వల్ప వ్యాపార ప్రయోజనాల కోసం థాయిలాండ్ కు వచ్చే భారతీయులకు 60 రోజుల వీసా మినహాయింపు సదుపాయం ఇప్పటికే ఉంది. ఈ సదుపాయం కూడా తదుపరి ప్రకటన వచ్చే వరకు అమల్లో ఉంటుందని థాయ్ లాండ్ రాయబార కార్యాలయం తెలిపింది. దరఖాస్తుదారులు తప్పనిసరిగా వీసా ఫీజును చెల్లించాలని, దీని కోసం సంబంధిత ఎంబసీ, కాన్సులేట్ జనరల్స్ కార్యాలయాలు ఆఫ్ లైన్ పేమెంట్ ఆప్షన్ లపై వివరాలను అందిస్తాయని తెలిపింది.

వీసా ఫీజు రీఫండ్ ఉండదు

అన్ని రకాల వీసాల కోసం దరఖాస్తులను thaievisa.go.th వెబ్సైట్ ద్వారా పంపాలని ఎంబసీ తన ప్రకటనలో తెలిపింది. వీసా ఫీజు చెల్లించిన తేదీ నుంచి 14 పనిదినాల్లోగా వీసా ప్రాసెసింగ్ పూర్తవుతుందని తెలిపింది. వీసా ఫీజు ఎట్టి పరిస్థితుల్లోనూ తిరిగి రీఫండ్ కాదన్న విషయాన్ని గుర్తుంచుకోవాలని అని రాయబార కార్యాలయం పేర్కొంది. ఈ-వీసా (visa) విధానంపై ఎంబసీ, కాన్సులేట్ జనరల్స్ కు మరిన్ని వివరాలు, సమాచారాన్ని తగిన సమయంలో అందిస్తామని రాయబార కార్యాలయం తెలిపింది. థాయ్ లాండ్ ఇప్పటికే భారతీయులకు వీసా ఆన్ అరైవల్ సదుపాయాన్ని అమలు చేసింది. ఇప్పుడు జనవరి 1వ తేదీ 2025 నుంచి ఈ- వీసా విధానాన్ని అమలు చేస్తోంది.

పర్యాటక కేంద్రం

థాయ్ లాండ్ భారతీయ పర్యాటకులకు అగ్రశ్రేణి విదేశీ గమ్యస్థానాలలో ఒకటి. బ్యాంకాక్, పట్టాయా, ఫుకెట్, చియాంగ్ మాయి, కోహ్ సముయి వంటి ప్రదేశాలను భారతీయ పర్యాటకులు ఎక్కువగా సందర్శిస్తున్నారు. ఇటీవల భారతీయ వెడ్డింగ్ ప్లానర్లు, హనీమూన్ టూరిజం ఆపరేటర్లలో కూడా థాయిలాండ్ ప్రసిద్ధి చెందింది. 2019లో 2 మిలియన్లకు పైగా భారతీయ పర్యాటకులు థాయ్ లాండ్ ను సందర్శించారు. కోవిడ్-19 మహమ్మారి తరువాత, మళ్లీ 2023 నుంచి థాయిలాండ్ కు వెళ్తున్న భారతీయ పర్యాటకుల సంఖ్య పెరిగింది.

గృహ రుణ సంక్షోభం

థాయిలాండ్ లో నెలకొన్న గృహ రుణ సంక్షోభం నుంచి బయటపడడానికి థాయిలాండ్ ప్రభుత్వం ఇటీవల కొన్ని ఉపశమన చర్యలు ప్రకటించింది. గృహ, ఆటోమొబైల్ కొనుగోళ్లు, వాణిజ్య బ్యాంకులు, రాష్ట్ర ఆర్థిక సంస్థల నుంచి చిన్న, మధ్యతరహా వ్యాపార ఫైనాన్సింగ్ కోసం రుణాలు తీసుకున్నవారికి మూడేళ్ల పాటు వడ్డీ నుంచి మినహాయింపును ఇస్తున్నట్లు ప్రకటించింది.

Whats_app_banner