Australia student Visa : రెండింతలు పెరిగిన ఆస్ట్రేలియా స్టూడెంట్ వీసా ఫీజు.. భారతీయులపై భారీ ప్రభావం!
Australia student Visa fees hike : ఆస్ట్రేలియా స్టూడెంట్ వీసా ఫీజు రెండింతల కన్నా ఎక్కువ పెరిగింది. ఇది అందరిని షాక్కు గురిచేస్తోంది.
ఆస్ట్రేలియాలో చదువుకోవాలని ప్లాన్ చేసే విదేశీ విద్యార్థులకు భారీ షాక్ ఇచ్చింది అక్కడి ప్రభుత్వం! స్టూడెంట్ వీసా ఫీజును ఒకేసారి రెండింతల కన్నా ఎక్కువగా పంచేసింది. ఇది లక్షలాది మంది భారతీయులపై ప్రభావం చూపించనుంది.
ఆస్ట్రేలియా స్టూడెంట్ వీసా ఫీజు పెంపు..
710 డాలర్లుగా ఉన్న ఆస్ట్రేలియా స్టూడెంట్ వీసా ఫీజు ఇప్పుడు ఏకంగా 1600 డాలర్లు అయ్యింది. పెంచిన ధరలు జులై 1 నుంచే అమల్లోకి వచ్చాయి.
కాగా ఈ స్థాయిలో స్టూడెంట్ విసాల ఫీజు పెంపుపై విద్యార్థుల ప్రతినిథులు మండిపడుతున్నారు. ఇలా అయితే దేశంలో చదువుకునేందుకు ఒకటికి రెండుసార్లు ఆలోచిస్తారని, ఫలితంగా పోటీదారులు లబ్ధిపొందుతారని అంటున్నారు.
అయితే ఇలా స్టూడెంట్ వీసా ఫీజు పెంపుతో వచ్చే డబ్బులతో విద్యావ్యవస్థను మెరుగుపరుస్తామని, గ్రాడ్జ్యుయేట్ రుణాలు కట్ చేస్తామని, అప్రెంటీస్లకు ఆర్థిక సాయం చేస్తామని, వలసదార వ్యూహాలను అమలు చేస్తామని ప్రభుత్వం చెబుతోంది.
"విదేశీ విద్య మన దేశ జాతీయ సంపద. అది మంచి నైణ్యతతో ఉంచడం మన బాధ్యత," అని విద్యాశాఖ మంత్రి జేసెన్ క్లార్ తెలిపారు.
కాన్బేరాలోని ఇండియన్ హై కమిషన్ ప్రకారం 2023 ఆగస్ట్ నాటికి ఆస్ట్రేలియాలో చదువు కోసం ఎన్రోల్ చేసుకున్న భారతీయ విద్యార్థుల సంఖ్య సుమరు 1,20,277గా ఉంటుంది. ఆస్ట్రేలియాలో చదువుకుంటున్న విదేశీ విద్యార్థుల సంఖ్యలో భారత్ రెండో స్థానంలో ఉంది.
కానీ ఇలా ఆస్ట్రేలియా స్టూడెంట్ వీసా ఫీజు పెంపుపై సర్వత్రా విమర్శలు ఎదురవుతున్నాయి. ఫీజ పెంపు, అధిక డిపాజిట్ ఖర్చులు అనేవి విదేశీ విద్యార్థులపై పెను భారం చూపిస్తుందని కౌన్సిల్ ఆఫ్ ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ ఆస్ట్రేలియా జాతీయ అధ్యక్షుడు యేగనెహ్ సోల్తనపోర్ తెలిపారు.
"అంత ఖర్చు చేసి రిజెక్ట్ అయ్యామని తెలిస్తే చాలా బాధ కలుగుతుంది. ఇది మన పోటీదారులకు మంచి చేస్తుంది," అని యేగనెహ్ అభిప్రాయపడ్డారు.
ఇంతకన్న జరగాల్సిన నష్టం మరొకటి లేదని ఇంటర్నేషనల్ ఎడ్జ్యుకేషన్ అసోసియేషన్ ఆఫ్ ఆస్ట్రేలియా సీఈఓ ఫిల్ హనీవుడ్ తెలిపారు.
"ఏడాదికి 48 బిలియన్ డాలర్లను మనం పోగొట్టుకునే ప్రమాదంలో పడ్డాము. ఆస్ట్రేలియా స్టూడెంట్ వీసా ఫీజు పెంపు అనేది ఇండో-పెసిఫిక్ ప్రాంతాలతో మన సంబంధాలపై భారీ ప్రభావాన్ని చూపిస్తుంది. ఇలా చేస్తే చాలా మంది యూకేకి వెళ్లిపోతారు. అక్కడ స్టూడెంట్ వీసా ఖర్చు 900 డాలర్లు మాత్రమే!" అని హనీవుడ్ అన్నారు.
సంబంధిత కథనం