Honeymoon Destinations India: కొత్త జంటలకు భారత్‍లో హనీమూన్‍కు టాప్-5 బెస్ట్ ప్లేస్‍లు ఇవే.. హైదరాబాద్ నుంచి దూరం ఎంత?
Honeymoon Destinations India: హనీమూన్‍కు వెళ్లేందుకు ఇండియయాలో చాలా ప్లేస్‍లు ఉన్నాయి. కొత్త జంటలు ఎంజాయ్ చేసేందుకు పర్‌ఫెక్ట్‌గా ఉంటాయి. వాటిలో టాప్-5 ఏవో.. హైదరాబాద్ నుంచి దూరం ఎంతో ఇక్కడ చూడండి.
ప్రస్తుతం పెళ్లిళ్ల సీజన్ నడుస్తోంది. వివాహాలు భారీ సంఖ్యలో జరుగుతున్నాయి. హనీమూన్‍కు ఎక్కడికి వెళ్లాలా అని చాలా మంది కొత్త దంపతులు ఆలోచిస్తూ ఉంటారు. ఏది బెస్ట్ అని చూస్తుంటారు. ముఖ్యంగా ఇండియాలో ఎక్కడికి వెళితే బాగుంటుందని ప్లాన్ చేస్తుంటారు. భారత్‍లోనూ హనీమూన్‍కు కొన్ని ప్లేస్‍లు అత్యుత్తమంగా ఉంటాయి. అలాంటి 5 హనీమూన్ డెస్టినేషన్లు ఏవో ఇక్కడ చూడండి.
అండమాన్ నికోబార్ దీవులు
కొత్త పెళ్లయిన జంట హనీమూన్ కోసం అండమాన్ నికోబార్ దీపులు అద్భుతంగా ఉంటాయి. ఇదో కొత్త ప్రపంచంలా, స్వర్గంలా అనిపిస్తుంది. విశాలమైన బీచ్‍లు, స్వచ్ఛమైన నీటితో ఆకర్షణీయంగా ఉంటుంది. షిప్‍ల్లో ఉండడం, వాటర్ స్పోర్ట్స్ యాక్టివిటీలు ఇలా కొత్త దంపతులు చాలా ఎంజాయ్ చేయవచ్చు. బీచ్‍ల్లో ఉదయం, సాయంత్రం వాతావరణం ఆకర్షణీయంగా ఉంటుంది. న్యూ కపుల్స్ హనీమూన్ కోసం అండమాన్ నికోబార్ దీవులు చక్కని ఆప్షన్‍గా ఉంది. హైదరాబాద్ నుంచి ఈ ప్రాంతం సుమారు 1,682 కిలోమీటర్లుగా ఉంది. విమానంలో వెళ్లడం బెస్ట్ ఆప్షన్.
సిమ్లా
ఆహ్లాదకమైన శీతల వాతావరణం ఉండే సిమ్లా.. హనీమూన్‍కు మంచి డెస్టినేషన్. హిమాచల్ ప్రదేశ్‍లో ఉన్న ఈ సిటీ కపుల్స్‌కు రొమాంటిక్ ఫీల్ ఇస్తుంది. హిమాచల పర్వతాల అందాలు, పురాతన శిల్పాలను వీక్షించవచ్చు. సిమ్లాలోని పచ్చదనం మనసులను హత్తుకుంటుంది. కొత్త జంటను మైమరిపిస్తుంది. హైదరాబాద్ నుంచి సిమ్లా సుమారు 1,900 కిలోమీటర్ల దూరంలో ఉంది. ప్రస్తుతం శీతాకాలంలో సిమ్లా మరింత బెస్ట్ ఆప్షన్‍గా ఉంటుంది.
శ్రీనగర్
ఎత్తైన హిమాలయ పర్వతాలు, శీతల వాతావణం, అందమైన ప్రకృతితో శ్రీనగర్ మనోహరంగా ఉంటుంది. కొత్త కపుల్స్ హనీమూన్‍కు వెళ్లేందుకు కశ్మీర్‌లోని ఈ ప్రాంతం చాలా సూటవుతుంది. దాల్, శిఖర సరస్సులో విహారం అందమైన అనుభవంగా, రొమాంటిక్‍గా అనిపిస్తుంది. స్వచ్ఛమైన నీటిపై చెక్క బోట్లపై ప్రయాణం మధుర జ్ఞాపకంగా నిలిచిపోతుంది. హైదరాబాద్ నుంచి శ్రీనగర్ దాదాపు 2,350 కిలోమీటర్ల దూరం ఉంటుంది.
గోవా
టూరిజంకు గోవా చాలా పాపులర్ అయింది. ఇక్కడి బీచ్‍లు ఆకట్టుకునేలా ఉంటాయి. ఈ సిటీలో నైట్ లైఫ్ రంగురుంగుల ప్రపంచంలా ఉంటుంది. హనీమూన్ కోసం ఈ సిటీ కూడా అద్భుతంగా ఉంటుంది.పాలోలేమ్, అంజున, బాగా, కలంగూట్ సహా మరిన్ని బీచ్‍లు ప్రత్యేకంగా అనిపిస్తాయి. వాటర్ స్పోర్ట్స్ భారీ ఆడుతూ ఎంజాయ్ చేయవచ్చు. క్రూజ్‍ల్లో విహరించవచ్చు. హైదరాబాద్ నుంచి గోవా సుమారు 670 కిలోమీటర్లు ఉంటుంది.
అలప్పీ
కేరళలోని అలప్పీ (అలపుజ) ప్రకృతి అందాలతో ఆకర్షణీయంగా ఉంటుంది. పచ్చదనం, బ్యాక్‍వాటర్స్‌తో అలప్పీ అదిరిపోతుంది. ప్రకృతిని ప్రేమించి జంటకు అలప్పీ భూతల స్వర్గంలా అనిపిస్తుంది. బీట్లలో విహారాలు, కేరళ రుచులు ప్రత్యేకంగా ఆకట్టుకుంది. వాతావరణం కూడా చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. హైదరాబాద్ నుంచి అలప్పీ సుమారు 1,160 కిలోమీటర్లు ఉంటుంది.
హనీమూన్ వెళ్లేందుకు ఇండియాలో డార్జిలింగ్, జైపూర్, ఊటీ, ముస్సోరీ కూడా మంచి డెస్టినేషన్లుగా ఉన్నాయి.