తెలుగు న్యూస్ / ఫోటో /
India vs Australia Test: బుమ్రా దెబ్బకు ఆస్ట్రేలియా విలవిల.. పెర్త్ టెస్టు తొలి రోజే 17 వికెట్లు.. ఫొటోల్లో..
- India vs Australia Test: బుమ్రా దెబ్బకు ఆస్ట్రేలియా కూడా కుదేలైంది. తొలి టెస్టు తొలి ఇన్నింగ్స్ లోనే టీమిండియా 150 పరుగులకు కుప్పకూలినా.. తర్వాత ఆస్ట్రేలియాను కూడా దారుణంగా దెబ్బతీశాడు కెప్టెన్ బుమ్రా. దీంతో తొలి రోజు పెర్త్‌లో మొత్తంగా 17 వికెట్లు నేలకూలాయి.
- India vs Australia Test: బుమ్రా దెబ్బకు ఆస్ట్రేలియా కూడా కుదేలైంది. తొలి టెస్టు తొలి ఇన్నింగ్స్ లోనే టీమిండియా 150 పరుగులకు కుప్పకూలినా.. తర్వాత ఆస్ట్రేలియాను కూడా దారుణంగా దెబ్బతీశాడు కెప్టెన్ బుమ్రా. దీంతో తొలి రోజు పెర్త్‌లో మొత్తంగా 17 వికెట్లు నేలకూలాయి.
(1 / 8)
India vs Australia Test: ఇండియా, ఆస్ట్రేలియా మధ్య ఐదు టెస్టుల బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ ఆసక్తికరంగా మొదలైంది. పెర్త్ లో ప్రారంభమైన తొలి టెస్టు తొలి రోజే ఏకంగా 17 వికెట్లు పడటం విశేషం.(ICC X)
(2 / 8)
India vs Australia Test: పెర్త్ టెస్టులో స్టాండిన్ కెప్టెన్ గా ఉన్న బుమ్రా టాస్ గెలవగానే మొదట బ్యాటింగ్ ఎంచుకున్నాడు.(AFP)
(3 / 8)
India vs Australia Test: ఆస్ట్రేలియా పేసర్ల ధాటికి టీమిండియా తడబడింది. ఓపెనర్ యశస్వి, మూడో స్థానంలో వచ్చిన పడిక్కల్ డకౌటయ్యారు.(AFP)
(4 / 8)
India vs Australia Test: మన తెలుగు క్రికెటర్ నితీష్ కుమార్ రెడ్డి ఆడుతున్న తొలి టెస్టులోనే వీరోచిత బ్యాటింగ్ తో 41 రన్స్ చేశాడు. అతనికితోడు రిషబ్ పంత్ కూడా 37 రన్స్ చేయడంతో ఇండియా 150 పరుగులకు ఆలౌటైంది.(AFP)
(5 / 8)
India vs Australia Test: ఆస్ట్రేలియా పేస్ బౌలర్ హేజిల్‌వుడ్ 4, స్టార్క్, కమిన్స్, మార్ష్ తలా రెండు వికెట్లు తీసుకున్నారు.(AFP)
(6 / 8)
India vs Australia Test: ఇక తొలి టెస్టు కష్టమే అనుకుంటున్న సమయంలో తొలి ఇన్నింగ్స్ మొదలుపెట్టిన ఆస్ట్రేలియాను కెప్టెన్ బుమ్రా దారుణంగా దెబ్బ తీశాడు. వాళ్ల టాప్, మిడిలార్డర్ ను కుప్పకూల్చాడు. ఉస్మాన్ ఖవాజా (8), మెక్‌స్వీనీ (10), లబుషేన్ (20), స్టీవ్ స్మిత్ (0) విఫలమయ్యారు.(AP)
(7 / 8)
India vs Australia Test: దీంతో ఆస్ట్రేలియా తొలి రోజు ఆట ముగిసే సమయానికి తొలి ఇన్నింగ్స్ లో 7 వికెట్లకు కేవలం 67 రన్స్ మాత్రమే చేసింది. టీమిండియా ఇంకా 83 పరుగుల ఆధిక్యంలో ఉంది.(AFP)
ఇతర గ్యాలరీలు