Intimate Health: చలికాలంలో శృంగారం బాగా ఎంజాయ్ చేయాలనుకుంటారా? ఈ టిప్స్ పాటించండి
Intimate Health: చలికాలంలో శృంగారం మెరుగ్గా చేసేందుకు కొన్ని సూచనలు పాటించాలి. ఈ కాలంలో లైంగిక జీవితంపై చల్లటి వాతావరణం ప్రభావం చూపిస్తుంది. కొన్ని టిప్స్ ఫాలో అయితే శృంగారాన్ని మరింత ఎంజాయ్ చేయవచ్చు.
శీతాకాలంలో చల్లటి వాతావరణం వల్ల శృంగార కోరికలు కాస్త ఎక్కువగానే ఉంటాయి. శరీర వెచ్చదనం కోరుకుంటుంది కాబట్టి లైంగిక చర్యను కోరుకుంటారు. అయితే, కొందరు అనుకున్నస్థాయిలో చలికాలంలో శృంగారాన్ని ఎంజాయ్ చేయలేకపోతారు. శరీరానికి ఎక్కువగా సూర్యకిరణాలు తగలకపోవడం, శారీరక శ్రమ ఎక్కువగా లేక బద్దకంగా అనిపిస్తుంది. మరిన్ని కూడా దీనికి కారణాలుగా ఉంటాయి. చలికాలంలో శృంగారం మెరుగ్గా ఉండాంటే కొన్ని సూచనలు పాటించాలి.
చలికాలంలో త్వరగా ఆహారం జీర్ణం కాకపోవడం, విటమిన్ డీ తగ్గిపోవడం లాంటి కారణాలతో శృంగార జీవితంపై ఎఫెక్ట్ పడుతుంది. మెలటోనిన్ లెవెల్స్ ఎక్కువవడం కూడా ప్రభావం చూపిస్తుంది. చాలా మందికి చలికాలంలో బద్దకంగా అనిపిస్తుంది. అందుకే శృంగార వాంఛను కూడా మెరుగ్గా తీర్చుకోలేరు. అలాంటి వారి కోసం ముఖ్యమైన టిప్స్ ఇక్కడ చూడండి.
సూర్యరశ్మికి ఉండండి
చలికాలంలో శృంగార జీవితానికి సూర్యరశ్మి కూడా కీలకంగా ఉంటుంది. ఈ కాలంలో శరీరానికి కనీసం 30 నిమిషాలైనా సూర్యుడి కిరణాలు తాకేలా జాగ్రత్త తీసుకోవాలి. దీనివల్ల శరీరం నిత్యం చురుగ్గా ఉంటుంది. అలాగే, విటమిన్ డీ కూడా మెరుగ్గా ఉంటుంది. శృంగారానికి ఇది కీలకంగా ఉంటుంది.
ఎక్సర్‌సైజ్‍లు
చలికాలంలో ఉదయాన్నే నిద్ర లేచేందుకు బద్దకమై చాలా మంది శారీరక వ్యాయమాలు చేయరు. ఇది కూడా లైంగిక జీవితంపై ప్రభావం చూపుతుంది. బద్దకంగా అనిపిస్తుంది. అందుకే చలికాలంలోనూ వ్యాయామం తప్పనిసరిగా చేయాలి. దీంతో చురుగ్గా ఉండి బెడ్‍పై కూడా మంచి పర్ఫార్మెన్స్ చేయగలుగుతారు. శృంగారాన్ని ఎంజాయ్ చేయగలుగుతారు.
ఆరోగ్యకరమైన ఆహారం
చలికాలంలో కూరగాయలు, పండ్లు, నట్స్ లాంటి శరీరానికి పోషకాలు ఇచ్చే ఆహారాలు తీసుకోవాలి. కడుపు భారంగా కాకుండా లైట్‍గా ఉండేలా చూసుకోవాలి. శృంగారానికి ఇది కూడా కీలకంగా ఉంటుంది. హెవీగా ఉండే ఫుడ్ తింటే లైంగిక చర్యలో త్వరగా అలసిపోతారు. చలికాలంలో జీర్ణం అంత త్వరగా కాదు. అందుకే పోషకాలతో కూడిన ఆహారాన్ని కడుపు లైట్‍గా ఉండేలా ఈ కాలంలో తినాలి. యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉండే ఆహారాలు తింటే రక్తప్రసరణ మెరుగ్గా ఉంటుంది. ఇది కూడా శృంగార చర్యకు మేలు చేస్తుంది.
ఫోర్‌ప్లేకు ప్రాధాన్యత
భాగస్వామితో నేరుగా కలయికకు ప్రయత్నించవద్దు. ముందుగా ఒకరినొకరు స్పర్శించుకోవడం, ముద్దులు పెట్టుకోవడం, కౌగిలింతలు ఇలా ఫోర్‌ప్లే చేయాలి. ఇది శృంగార వాంఛను మరింత పెంచుతుంది. శరీరాన్ని ఉత్తేజితం చేస్తుంది. లైంగిక చర్య మెరుగ్గా ఉండేలా ఇది చేస్తుంది. ముఖ్యంగా శరీరం కాస్త బద్ధకంగా అనిపించే చలికాలంలో ఫోర్‌ప్లే చాలా ముఖ్యం. ఇద్దరూ శృంగారంలో రసవత్తరంగా ఉండేందుకు ఇది తోడ్పడుతుంది.