Winter Foods: చలికాలంలో తప్పక తీసుకోవాల్సిన 6 రకాల ఆహారాలు ఏవో చెప్పిన న్యూట్రిషనిస్ట్.. శరీరానికి చురుదనం, ఆరోగ్యం-which foods are must eat in winter for health and activeness ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Winter Foods: చలికాలంలో తప్పక తీసుకోవాల్సిన 6 రకాల ఆహారాలు ఏవో చెప్పిన న్యూట్రిషనిస్ట్.. శరీరానికి చురుదనం, ఆరోగ్యం

Winter Foods: చలికాలంలో తప్పక తీసుకోవాల్సిన 6 రకాల ఆహారాలు ఏవో చెప్పిన న్యూట్రిషనిస్ట్.. శరీరానికి చురుదనం, ఆరోగ్యం

Chatakonda Krishna Prakash HT Telugu
Nov 20, 2024 07:43 AM IST

Winter Foods: చలికాలంలో వాతావరణ ప్రభావంతో శరీరం అంత చురుగ్గా ఉండదు. బద్ధకంగా అనిపిస్తుంది. అయితే, కొన్ని రకాల ఆహారాలు తినడం వల్ల శీతాకాలంలో యాక్టివ్‍నెస్ పెరుగుతుంది. ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది.

Winter Foods: చలికాలంలో తప్పక తీసుకోవాల్సిన 6 రకాల ఆహారాలు ఇవో చెప్పిన న్యూట్రిషనిస్ట్.. శరీరానికి చురుదనం, ఆరోగ్యం
Winter Foods: చలికాలంలో తప్పక తీసుకోవాల్సిన 6 రకాల ఆహారాలు ఇవో చెప్పిన న్యూట్రిషనిస్ట్.. శరీరానికి చురుదనం, ఆరోగ్యం

చలికాలంలో ఉదయం సూర్యుడి రాక కాస్త ఆలస్యమవుతుంది. పగటి కాలం తగ్గుతుంది. వాతావరణం చల్లగా మారిపోతోంది. చలితీవ్రత అధికంగా ఉంటుంది. ఈ కారణాలతో చలికాలంలో శరీరంలో ఎనర్జీ లెవెల్స్ తక్కువగా ఉన్నట్టు అనిపిస్తుంది. యాక్టివ్‍నెస్ బాగా తగ్గుతుంది. ఉదయాన్నే శరీరం బద్దకంగా అనిపిస్తుంది. అయితే, కాలంతో పాటు వచ్చే ఈ సవాళ్లను పోషకాలు ఉండే ఆహారంతో ఎదుర్కోవచ్చు. కొన్ని రకాల ఆహారాలు తప్పక తీసుకోవడం వల్ల శరీరం చురుగ్గా మారుతుంది. రోగ నిరోధక శక్తి మెరుగవుతుంది. అలా చలికాలంలో తప్పక తినాల్సిన ఆహారాలు ఏవో ఇక్కడ తెలుసుకోండి.

చలికాలంలో ఏ ఆహారాలు తినాలో హెచ్‍టీ లైఫ్‍స్టైల్‍కు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు హోలిస్టిక్ వెల్‍నెస్ కోచ్, కలీనరీ న్యూట్రిషనిస్ట్ ఇషాంక వాహి. ఎలాంటి ఫుడ్స్ వల్ల శరీరంలో రోగ నిరోధక శక్తి, చురుకుదనం పెరుగుతుందో వెల్లడించారు.

ఆకుకూరలు

ఫీల్‍గుడ్ న్యూట్రోట్రాన్స్‌మిటర్ 'సెరోటిన్' ఉత్పత్తిని శరీరంలో ఫోలెట్, విటమిన్ బీ పెంచగలవు. పాలకూర, కేల్ లాంటి ఆకుకూరల్లో ఈ పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఈ పోషకాల వల్ల శరీరం బద్ధకం అనిపించడం తగ్గుతుంది. వీటిలో యాంటీఆక్సిడెంట్లు కూడా పుష్కలంగా ఉంటాయి. దీంతో రోగ నిరోధక వ్యవస్థ కూడా మెరుగవుతుంది. ఆక్సిడేటివ్ ఒత్తిడి ప్రభావాన్ని ఇవి తగ్గించగలవు.

సిట్రస్ పండ్లు

నారింజ, చీనీ, నిమ్మ లాంటి సిట్రస్ పండ్లలో విటమిన్ సీ ఎక్కువగా ఉంటుంది. రోగ నిరోధక శక్తి వ్యవస్థ మెరుగ్గా పని చేసేందుకు విటమిన్ సీ ఎంతగానో తోడ్పడుతుంది. సిట్రస్ పండ్లలో యాంటీబ్యాక్టీరియల్ గుణాలు కూడా ఎక్కువగా ఉంటాయి. చలికాలంలో సీజనల్ ఇన్ఫెక్షన్ల నుంచి శరీరాన్ని ఇవి రక్షిస్తాయి. జీర్ణాన్ని కూడా మెరుగుపరుస్తాయి.

ఒమేగా-3 యాసిడ్స్ కోసం ఫ్యాటీ చేపలు

సాల్మన్, మాకెరెల్, సార్డినెస్ లాంటి ఫ్యాటీ చేపల్లో ఉండే ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్లు మెదడు పనితీరును చురుగ్గా మారుస్తాయి. మూడ్‍ను చురుగ్గా చేస్తాయి. ఆందోళన, డిప్రెసివ్ డిజార్డర్ లక్షణాలను ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ తగ్గిస్తాయి. ఈ చేపలను వారంలో మూడుసార్లు తీసుకుంటే ఇమ్యూనిట్ పవర్ పెరుగుతుంది.

పులియబెట్టిన ఫుడ్స్

పెరుగు, యగర్ట్, కెఫిర్, కిమ్చి లాంటి పులియబెట్టిన ఆహారాలు.. పేగుల్లో ఆరోగ్యకరమైన మెక్రోబయోమ్‍లను మెరుగుపరుస్తాయి. ఈ ప్రోబయోటిక్ ఫుడ్స్ తినడం వల్ల కడుపు మెరుగ్గా ఉండి శరీరం బరువుగా ఫీల్ అవదు. చురుకైన మూడ్ ఉంటుంది. శారీరక ఆరోగ్యాన్ని ఈ ఫర్మెంటెడ్ ఫుడ్స్ మెరుగుపరుస్తాయి.

నట్స్, సీడ్స్ నుంచి మెగ్నిషియం

వాల్‍నట్స్, బాదం, గుమ్మడి గింజలు లాంటి నట్స్, సీడ్స్‌లో మెగ్నిషియం మెండుగా ఉంటుంది. శరీరంలో ఒత్తిడిని, ఆందోళన తగ్గేందుకు ఇది తోడ్పడుతుంది. శరీరంలో తేలిగ్గా ఉండేలా, రిలాక్స్ అయినట్టుగా ఉండేలా మెగ్నిషియం చేయగలదు. చలికాలంలో బద్ధకం ఫీలింగ్ పోవాలంటే ఇవి చాలా ముఖ్యం. స్నాక్స్‌గా నట్స్, సీడ్స్ తీసుకుంటే మూడ్ చాలా మెరుగవుతుంది.

దుంప కూరగాయలు

బీట్‍రూట్, క్యారెట్లు, బంగాళదుంపలు లాంటి దుంప కూరగాయయల్లో ఫైబర్, కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్లు ఎక్కువగా ఉంటాయి. ఇవి శరీరానికి శక్తిని బాగా అందిస్తాయి. రోజంతా శరీరం నిస్సారం కాకుండా చేయగలవు. ఇవి తీసుకుంటే బ్లడ్ షుగర్ లెవెల్స్ కూడా అదుపులో ఉంటాయి. ఒత్తిడి తగ్గుతుంది. పోషకాలను కూడా శరీరానికి బాగా అందిస్తాయి.

Whats_app_banner