Saturn and Venus Conjunction: శుక్రుడు శని గ్రహాల సంయోగం: ఈ ఐదు రాశుల వారికి అదృష్టం, పెళ్లి కూడా ఫిక్స్ అవచ్చు!-saturn and venus conjunction in december give huge luck and money to these five zodiac signs ,రాశి ఫలాలు న్యూస్
తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  Saturn And Venus Conjunction: శుక్రుడు శని గ్రహాల సంయోగం: ఈ ఐదు రాశుల వారికి అదృష్టం, పెళ్లి కూడా ఫిక్స్ అవచ్చు!

Saturn and Venus Conjunction: శుక్రుడు శని గ్రహాల సంయోగం: ఈ ఐదు రాశుల వారికి అదృష్టం, పెళ్లి కూడా ఫిక్స్ అవచ్చు!

Ramya Sri Marka HT Telugu
Dec 12, 2024 04:59 PM IST

Saturn and Venus Conjunction: కర్మఫలితాలనిచ్చే శని గ్రహం, సంపదనిచ్చే శుక్రగ్రహం రెండూ త్వరలో కలవబోతున్నాయి. డిసెంబర్ చివరిలో కుంభరాశిలో శని-శుక్రుడు సంయోగం జరగనుంది. ఇది కొన్ని రాశుల వారికి అదృష్టాన్ని తెచ్చిపెడుతుంది. శని-శుక్రుల కలయిక ఏయే రాశుల వారికి మేలు చేస్తుందో తెలుసుకోండి.

Shukra and shani yuti horoscope
Shukra and shani yuti horoscope

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం శుక్రుడు, శని స్నేహపూర్వకమైన గ్రహాలు. ఈ రెండు గ్రహాలు శుభాన్ని, సానుకూలతనూ సూచిస్తాయి. శని భగవానుడు కర్మఫలితాలను అంటే వ్యక్తి చేసిన పనులను బట్టి వారికి ప్రతిఫలాలను అందించే దేవుడు. అలాగే శుక్రుడు అందం, విలాసం, సంపద, ప్రేమ, అదృష్టాన్నిచ్చే గ్రహం. ఈ రెండు శుభ గ్రహాల కలయిక కొన్ని రాశుల వారికి విపరీతమైన అదృష్టాన్ని తెచ్చిపెడుతుంది.

వైదిక జ్యోతిష లెక్కల ప్రకారం, గ్రహాలకు అధిపతి అయిన శని ప్రస్తుతం తన సొంత రాశి అయిన కుంభంలో సంచరిస్తున్నాడు. శుక్రుడు కూడా డిసెంబర్ చివరిలో కుంభ రాశిలోకి ప్రవేశిస్తాడు. ఈ సమయంలో శుక్రుడు, శని గ్రహాల కలయిక కుంభరాశిలో ఏర్పడుతుంది. కుంభరాశిలో శని, శుక్రుల కలయిక వల్ల అనేక రాశుల వారికి ఆర్థికంగా, వృత్తి, వ్యాపారాల్లో ప్రయోజనం చేకూరుతుంది. శుక్ర, శని అండతో ఈ రాశుల వారికి అదృష్టం కలిసివస్తుంది. 2024 డిసెంబర్ 28 శనివారం రాత్రి 11:48 గంటలకు శుక్రుడు కుంభరాశిలోకి ప్రవేశిస్తాడని జ్యోతిష్కుడు పండిట్ నరేంద్ర ఉపాధ్యాయ్ తెలిపారు.శుక్రుడు-శని గ్రహాల కలయిక వల్ల ఏ రాశివారికి అదృష్టం చేకూరుతుందో తెలుసుకుందాం.

1. వృషభ రాశి : శుక్ర-శని కలయిక కుంభ రాశి వారికి లాభదాయకంగా ఉంటుంది. ప్రభుత్వ వ్యవస్థ లాభపడుతుంది. కార్యాలయంలో పైఅధికారుల నుంచి సహాయ సహకారాలు లభిస్తాయి. జీవిత భాగస్వామి సహకారంతో ఆర్థిక ప్రయోజనాలు పొందవచ్చు. మంచి ఉద్యోగావకాశాలు లభిస్తాయి. ఆర్థిక పరిస్థితి మరింత మెరుగ్గా ఉంటుంది.

2. కర్కాటకం - శుక్రుడు, శని గ్రహాల సంయోగం కర్కాటక రాశి వారికి శుభ ఫలితాలను ఇస్తుంది. ఆర్థిక పరిస్థితి మెరుగుపడే సూచనలు కనిపిస్తున్నాయి. ఉద్యోగస్తులకు పదోన్నతులు లభించే అవకాశం ఉంది. వ్యాపార పరిస్థితి బలంగా ఉంటుంది. వ్యాపార విస్తరణకు కొత్త మార్గాలు ఏర్పడతాయి. అదృష్టవశాత్తూ, ఆకస్మిక ఆర్థిక లాభాలు ఉండవచ్చు.

3. తులారాశి - కుంభ రాశిలో శని, శుక్ర గ్రహాల కలయిక తులా రాశి వారికి శుభఫలితాలను ఇస్తుంది. భూమి, భవనం, వాహనం కొనుగోలుకు సూచనలున్నాయి. కుటుంబాలు పెరుగుతాయి. కార్యాలయంలో ప్రమోషన్ లభిస్తుంది. పాత చింతల నుంచి బయటపడతారు.

4. మకర రాశి - మకర రాశి వారికి శని-శుక్ర సంయోగం ప్రత్యేకం కానుంది. ముఖ్యమైన పనుల్లో విజయం సాధిస్తారు. ఉపాధి కోసం చూస్తున్న వారికి మంచి అవకాశాలు లభిస్తాయి. కొంతమందికి వివాహం కూడా ఫిక్స్ కావచ్చు. వైవాహిక జీవితం ఆనందంగా ఉంటుంది.

5. కుంభ రాశి - శుక్ర-శని కలయిక కుంభ రాశి వారికి మేలు చేస్తుంది. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. ఉద్యోగస్తులకు పదోన్నతి లభించే సూచనలు ఉన్నాయి. వ్యాపార పరిస్థితి బలంగా ఉంటుంది. ఆదాయం పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి.

గమనిక : ఈ కథనంలో మీకు అందించిన సమాచారం, సూచనలు పూర్తిగా నిజమైనది, ఖచ్చితమైనది అని మేము చెప్పలేము. నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.

Whats_app_banner