Manchu Family Issue : మోహన్‌బాబుకు రాజాసింగ్ సలహా.. ఇకనైనా ఆ పని చేయాలని సూచన!
Manchu Family Issue : మంచు ఫ్యామిలీ వివాదంలోకి పొలిటికల్ లీడర్లు ఎంట్రీ ఇచ్చారు. తాజాగా రాజాసింగ్ కీలక వ్యాఖ్యలు చేశారు. మోహన్ బాబుకు సలహాలు ఇచ్చారు. జర్నలిస్టుపై దాడి తప్పన్న రాజాసింగ్.. క్షమాపణలు చెప్పాలని సూచించారు. అటు మోహన్ బాబు ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు.
మంచు ఫ్యామిలీ వివాదం గంటకో మలుపు తిరుగుతోంది. తాజాగా ఈ వివాదంలోకి రాజకీయ నాయకులు ఎంట్రీ ఇచ్చారు. బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ మంచు ప్యామిలీ ఇష్యూ గురించి కీలక వ్యాఖ్యాలు. మోహన్ బాబు క్షమాపణలు చెప్పాలని సూచించారు. రాజాసింగ్ చేసిన కామెంట్స్ ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి.
'మోహన్ బాబు మీడియాకి క్షమాపణలు చెప్పాలి. మోహన్ బాబు కొడుకు మీడియాను పిలిచాడు. అందుకే మీడియా ఇంటి లోపలికి వెళ్లింది. మీ ఇంటి ఇష్యూ మీ ఇంట్లో పెట్టుకుంటే బాగుంటది.. కానీ పబ్లిక్‌లో పెట్టేశారు. మోహన్ బాబుకి నా సజెషన్.. ఈ ఇష్యూని ఇలానే వదిలేస్తే చాలా పెద్దది అవుతుంది. మీరు మీడియాకి క్షమాపణలు చెప్పాలి.. గాయాలైన రిపోర్టర్‌ను వెళ్లి కలవండి' అని బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ సూచించారు.
మోహన్ బాబు దాడిలో గాయపడ్డ జర్నలిస్ట్ రంజిత్‌కు యశోద ఆస్పత్రిలో సర్జరీ జరిగింది. జైగోమాటిక్ బోన్‌ను వైద్యుల బృందం సరిచేసింది. కంటికి, చెవికి మధ్య మూడు లెవెల్స్‌లో ఫ్రాక్చర్లు అయ్యాయి. జైగోమాటిక్ ఎముక మూడు చోట్ల విరిగింది. ఫ్రాక్చర్లు అయిన చోట సర్జరీ చేసి.. స్టీల్ ప్లేట్ అమర్చారు యశోద ఆస్పత్రి వైద్యులు. రంజిత్‌ను అబ్జర్వేషన్‌లో ఉంచాలని వైద్యులు చెబుతున్నారు.
అటు హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందిన మోహన్ బాబు.. డిశ్చార్జ్ అయ్యారు. రెండు రోజుల పాటు ఆస్పత్రిలో ఉన్న మోహన్‌బాబుకు.. వైద్యులు చికిత్స అందించారు. అటు మోహన్ బాబుపై పహాడీ షరీఫ్ పోలీసులు అటెంప్ట్ కేసు నమోదు చేశారు. ఓ టీవీ ఛానెల్ ప్రతినిధిపై దాడి ఘటనలో మోహన్ బాబుపై మొదట బీఎన్‌ఎస్ 118(1) సెక్షన్ కింద కేసు పోలీసులు నమోదు చేశారు. ఈ కేసుపై లీగల్ ఒపీనియన్ తీసుకున్న తెలంగాణ పోలీసులు.. 109 సెక్షన్ కింద హత్యాయత్నం కేసు నమోదు చేశారు.
మోహన్ బాబుకు తెలంగాణ హైకోర్టులో కాస్త ఊరట లభించింది. పోలీసుల ఎదుట విచారణ నుంచి మినహాయింపు ఇస్తూ.. హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. మంచు కుటుంబ వ్యవహారం, మీడియాపై మోహన్ బాబు దాడి ఘటనపై విచారణకు హాజరుకావాలని రాచకొండ సీపీ నోటీసులు జారీ చేశారు. మీడియాపై దాడికి సంబంధించి మోహన్ బాబుపై కేసు కూడా నమోదైంది. అయితే.. పోలీసుల నోటీసులపై మోహన్ బాబు హైకోర్టును ఆశ్రయించారు.
మంచు ఫ్యామిలీ వివాదం నడుస్తున్న నేపథ్యంలో.. సోషల్ మీడియాలో మంచు లక్ష్మి మరో పోస్ట్ చేశారు. ప్రపంచంలో ఏదీ మీది కానప్పుడు.. ఏం కోల్పోతారని భయపడుతున్నారంటూ ట్వీట్ చేశారు. మోహన్ బాబుపై కేసు నేపథ్యంలో మంచు లక్ష్మి పోస్టు చర్చనీయాంశంగా మారింది. ఆమె ఎవరిని ఉద్దేశించి ఈ పోస్టు చేశారనే చర్చ జరుగుతోంది.