టెస్లా మోడల్ వైకి పోటీగా షియోమీ వైయూ7 ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ.. సింగిల్ ఛార్జ్‌తో 800 కిలోమీటర్లు
Xiaomi YU7 Electric SUV : చైనీస్ టెక్ కంపెనీ షియోమీ ఎలక్ట్రిక్ కారు వైయూ7 ఎస్‌యూవీని ఆవిష్కరించింది. వచ్చే ఏడాది జూన్ లేదా జూలైలో ఈ కారును చైనాలో మార్కెట్‌లోకి వస్తుందని సమాచారం.
టెక్ కంపెనీ షియోమీ నుంచి ఎలక్ట్రిక్ కారు షియోమీ వైయూ7 ఎస్‌యూవీ వస్తోంది. వచ్చే ఏడాది నుంచి మార్కెట్‌లో ఈ కారు సందడి చేయనుంది. చైనాలో మెుదట లాంచ్ అవుతుంది. ఈ ఎలక్ట్రిక్ కారు చైనా మార్కెట్లో విక్రయించే టెస్లా మోడల్ వైతో నేరుగా పోటీ పడనుంది. షియోమీ ఈ ఎలక్ట్రిక్ కారును ఇప్పట్లో భారత మార్కెట్లో లాంచ్ చేసే ఆలోచన లేదు. ఇప్పుడు ఈ కారును ఇక్కడకు తీసుకొచ్చే ఆలోచన లేదని షియోమీ ఇండియా చీఫ్ మార్కెటింగ్ ఆఫీసర్ తెలిపారు. మెుదట చైనా మార్కెట్ పై దృష్టి సారించి ఆ తర్వాత ప్రపంచవ్యాప్తంగా లాంచ్ చేయనుంది.
షియోమీ వైయూ7 ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ డిజైన్ గురించి చూస్తే.. ఇది గొప్ప డిజైన్‌తో వీల్స్ కలిగి ఉంటుంది. ఇది మరింత స్టైలిష్ గా కనిపిస్తుంది. వెనుక భాగంలో వైయూ7తో ఎల్‌ఈడీ టెయిల్ ల్యాంప్స్‌ను అమర్చారు. షియోమీ వైయూ7 సుమారు 5 మీటర్ల పొడవు ఉంటుంది. ఇది ప్రీమియం సెడాన్ కాగా, టాప్ ఎండ్ వేరియంట్ డ్యూయల్ మోటార్ సెటప్ ను కలిగి ఉంది. ఇందులో 101 కిలోవాట్ల పెద్ద క్విలిన్ బ్యాటరీ ప్యాక్ లభిస్తుంది.
చైనాలోని రెగ్యులేటరీ ఫైలింగ్స్ ఇచ్చిన సమాచారం ప్రకారం, వైయూ 7 ఎస్‌యూవీ డ్యూయల్ మోటార్ సెటప్‌తో వస్తుంది. 299 బిహెచ్‌పీ (ముందు), 392 హెచ్‌పీ(వెనుక) ఉండి.. ఇది 691 హెచ్‌పీ కంబైన్డ్ అవుట్‌పుట్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ సెటప్ 2,405 కిలోల (కెర్బ్ వెయిట్) ఎస్‌యూవీని గరిష్టంగా గంటకు 253 కిలోమీటర్ల వేగంతో నడిపించగలదు. గరిష్టంగా గంటకు 265 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుందని చెబుతున్నారు.
ఈ కారు ఒక్కసారి ఫుల్ ఛార్జ్ చేస్తే సుమారు 800 కిలోమీటర్ల రేంజ్ అందిస్తుంది. డ్యూయల్ మోటార్ సెటప్‌తో ఉన్న ఈ కారు గరిష్టంగా 600 బిహెచ్‌పీ శక్తిని ఉత్పత్తి చేస్తుంది. వైయూ7 ఎంట్రీ లెవల్ ఆర్ డబ్ల్యూడీ వేరియంట్ ఎల్‌ఎఫ్‌పీ-కెమిస్ట్రీ బ్యాటరీని ఉపయోగిస్తుంది. టూ వీల్ డ్రైవ్ వెర్షన్ అందుబాటులోకి వస్తే అదే యూనిట్ను షియోమీ యూ7లో వాడుకోవచ్చు. భారత్ విషయానికి వస్తే బీవైడీతో ఇది పోటీ పడగలదు. షియోమీ నుండి వచ్చిన ఈ ఎలక్ట్రిక్ కారు రేంజ్, పవర్‌తో అద్భుతమైన డిజైన్ ను కలిగి ఉంది. భారత మార్కెట్‌లోకి ఎప్పుడు వస్తుందో చూడాలిక.