Hot Water: చలికాలంలో ఖాళీ పొట్టతో వేడి నీరు ప్రతిరోజూ తాగండి చాలు, ఈ సమస్యలేవీ మీకు రావు
Hot Water: చలికాలంలోవేడినీరు తాగడం వల్ల ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి. ఖాళీ పొట్టతో వేడినీరు తాగడం వల్ల ఆ రోజంతా ఆరోగ్యంగా ఉంటారు. శీతాకాలంలో ఖాళీ పొట్టతో వేడినీరు తాగడం వల్ల కలిగే ప్రయోజనాలు ఎన్నో ఉన్నాయి.
చల్లటి శీతాకాల వాతావరణం కొందరికి ఆనందాన్ని కలిగిస్తుంది. మరికొందరికి అనేక ఆరోగ్య సమస్యలను తెచ్చిపెడుతుంది. శీతాకాలంలో ఎముకల నొప్పులు పెరుగుతాయి. ఉదయం లేవగానే ఒళ్లు నొప్పులు మొదలవుతాయి. చల్లటి గాలి చర్మంతో పాటు జీర్ణవ్యవస్థపై కూడా ప్రభావం చూపుతుంది. శరీరంలోని అవయవాలకు ఇది రక్త ప్రసరణను తగ్గిస్తుంది. అప్పుడు శరీరం చేయాల్సిన ఎన్నో విధులన్నీ దెబ్బతింటాయి. శీతాకాలంలో ఈ సమస్యలను నివారించడానికి ప్రతిరోజూ ఉదయం ఖాళీ కడుపుతో గోరువెచ్చని నీరు తాగడం వల్ల ఈ ఐదు ప్రయోజనాలు ఉన్నాయి. రోజు గ్లాసుడు నీళ్లు తాగండి చాలు, ఎన్నో రకాల సమస్యలు రాకుండా ఉంటాయి.
పరగడుపున వేడినీళ్లు తాగడం వల్ల ఉపయోగాలు
రక్తప్రసరణ మెరుగుపడుతుంది: చలికాలంలో వేడినీళ్లు తాగడం వల్ల రక్తప్రసరణ మెరుగుపడుతుంది. దీని వల్ల కలిగే మొదటి ప్రయోజనం రక్త ప్రసరణను వేగవంతం చేస్తుంది. చలికాలంలో చలి కారణంగా రక్తప్రసరణ వేగం మందగిస్తుంది. ఇలాంటి పరిస్థితుల్లో ఉదయం నిద్రలేచి వేడినీరు తాగితే రక్తప్రసరణ పెరిగి శరీరం వెచ్చగా మారుతుంది.
శరీరాన్ని నిర్విషీకరణ
శీతాకాలంలో ఉదయం లేవగానే వేడినీరు తాగడం వల్ల శరీరాన్ని నిర్విషీకరణ చేయడంలో సహాయపడుతుంది. దీన్నే డిటాక్సిఫికేషన్ అని అంటారు. ఈ సమయంలో గోరువెచ్చని నీరు తాగడం వల్ల శరీరంలో పేరుకుపోయిన మురికి కడిగిపోతుంది. ఇది శరీరాన్ని నిర్విషీకరణ చేయడానికి సహాయపడుతుంది. ఇది పొట్ట, రక్తాన్ని శుద్ధి చేస్తుంది. దీని ప్రభావం మొత్తం శరీరంలో కనిపిస్తుంది.
బద్ధకం: చలికాలంలో ఉదయం లేవగానే శరీరంలో బద్ధకం ఏర్పడుతుంది. రక్తప్రసరణ మందగిస్తుంది. అందువల్ల వేడినీళ్లు తాగితే బద్ధకం, బిగుతు తగ్గుతాయి.తద్వారా ఉదయం లేవగానే మనిషి ఫ్రెష్ గా ఉంటాడు. పనులు చకచకా చేసుకుంటారు.
మెరిసే చర్మం కోసం
శీతాకాలంలో ఉదయాన్నే వేడినీటిని తాగడం వల్ల చర్మ సమస్యలను నివారిస్తుంది. వేడి నీరు తాగిన వెంటనే రక్త ప్రసరణ పెరుగుతుంది. ఆ తర్వాత శరీరం నిర్విషీకరణ చెందుతుంది. ఇది మెరిసే చర్మాన్ని పొందడంలో సహాయపడుతుంది. ఈ విధంగా చలికాలంలో వేడి నీరు త్రాగడం ప్రయోజనకరంగా ఉంటుంది. కాబట్టి ఉదయం లేవగానే మీరు చేయాల్సిన మొదటి పని ఇదే.
సైనసైటిస్ నుండి ఉపశమనం:
సైనసైటిస్ ఉన్నవారు చలికాలంలో ఎన్నో ఇబ్బందులు పడతారు. శీతాకాలంలో చాలా రోజులు ముక్కు దిబ్బడతో, తలనొప్పితో బాధపడతారు. ఉదయాన్నే ఒక గ్లాసు గోరువెచ్చని నీరు తాగడం వల్ల సైనసైటిస్ లక్షణాలు ఎఫెక్టివ్ గా తగ్గి త్వరగా ఉపశమనం లభిస్తుంది.
(గమనిక: అధ్యయనాలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ కోసం ఇక్కడ అందిస్తున్నాం. ఇది కేవలం సమాచారం మాత్రమే. ఇది వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి సందేహాలుంటే వెంటనే వైద్యులను సంప్రదించండి.)