ప్రతిరోజూ వేడినీరు తాగుతున్నారా? అయితే ఈ సమస్యలు తప్పవు!-major disadvantages of drinking hot water daily ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  ప్రతిరోజూ వేడినీరు తాగుతున్నారా? అయితే ఈ సమస్యలు తప్పవు!

ప్రతిరోజూ వేడినీరు తాగుతున్నారా? అయితే ఈ సమస్యలు తప్పవు!

HT Telugu Desk HT Telugu
Sep 18, 2022 06:31 PM IST

కరోనా వైరస్‌ను నిరోధించేందుకు చాలా మంది ప్రతి రోజూ వేడినీళ్లు తాగడం అలవాటు చేసుకున్నారు. అయితే వేడినీళ్లు తాగడం వల్ల లాభాలే కాదు కొన్ని నష్టాలు కూడా ఉన్నాయి. అవెంటో ఇప్పుడు తెలుసుకుందాం.

<p>'Hot Water</p>
'Hot Water

చాలా మంది రాత్రి నిద్రపోయే ముందు లేదా ఉదయం లేచిన తర్వాత ఖాళీ కడుపుతో గోరువెచ్చని నీటిని తాగుతుంటారు. తద్వారా ఉదరంలో మలినాలను తొలుగుతాయని భావిస్తుంటారు. అయితే వేడి నీరు తీసుకునే సమయంలో కొన్ని నియామాలు పాటించాలని నిపుణులు సూచిస్తున్నారు. లేకపోతే కొన్ని సమస్యల తప్పవని అంటున్నారు. మరీ ఈ సమస్యలెంటో ఇప్పుడు తెలుసుకుందాం. వేడి నీటిని సరయైన పద్దతిలో సేవించకపోతే ఇది ఆరోగ్యంపై ఎలాంటి హాని కలుగిస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం.

వేడినీరు తాగడం వల్ల కలిగే నష్టాలు

ఎక్కువగా వేడి నీటిని తీసుకుంటే, అది వ్యక్తి నిద్రను ప్రతికూల ప్రభావం చూపుతుంది. అలాగే తరచుగా మూత్రవిసర్జన చేయాల్సి వస్తుంది. నిద్రలేమి సమస్య కూడా ఏర్పడవచ్చు.

వేడి నీటి వినియోగం వల్ల ప్రేగులు మొదలైన అంతర్గత అవయవాలపై ప్రతికూలంగా ప్రభావం పడుతుంది. శరీరంలోని అంతర్గత అవయవాల కణజాలాలు చాలా సున్నితంగా ఉంటాయి.అటువంటి పరిస్థితిలో, మీరు చాలా తరచుగా వేడి నీటిని తాగితే, మీ అంతర్గత అవయవాలలో బొబ్బలు ఏర్పడవచ్చు. పేగు సమస్యలతో బాధపడుతున్న వ్యక్తులు, వేడి నీటిని తీసుకునే ముందు ఒకసారి నిపుణుల సలహా తీసుకోవాలి.

మీరు వేడి నీటిని తీసుకుంటే, అది వ్యక్తికి హీట్‌స్ట్రోక్ సమస్యను కూడా కలిగిస్తుంది. అటువంటి పరిస్థితిలో, ఎండలో బయటకు వెళ్ళేటప్పుడు, సాధారణ నీటిని మాత్రమే త్రాగాలి.

ఎక్కువగా వేడిగా ఉండే నీటిని తాగడం వల్ల రక్త పరిమాణంలో తేడాలు వస్తాయి. అవసరమైన దానికంటే ఎక్కువ వేడి నీటిని తీసుకోవడం వల్ల రక్త పరిమాణం పెరుగుతుంది. రక్త ప్రసరణ అనేది ఒక క్లోజ్డ్ సిస్టమ్ మరియు అది అనవసరమైన ఒత్తిడిని పొందినట్లయితే, అది అధిక రక్తపోటు మరియు అనేక ఇతర కార్డియో సమస్యలకు దారితీస్తుంది.

వేడి నీటిని తీసుకోవడం వల్ల కూడా నాలుక దెబ్బతింటుంది. ఇది కాకుండా, వేడి నీరు గొంతు నొప్పి, పెదవులు మొదలైనవాటిని కూడా ప్రభావితం చేస్తుంది.

క్రమం తప్పకుండా నీరు ఎక్కువగా తీసుకుంటే కిడ్నీ సంబంధిత సమస్యలు కూడా వస్తాయి. మూత్రపిండాలు ప్రత్యేకమైన కేశనాళిక వ్యవస్థను కలిగి ఉంటాయి, ఇది శరీరం నుండి అదనపు నీటిని, విష పదార్థాలను తొలగించడంలో సహాయపడుతుంది. వేడి నీరు తాగడం వల్ల మీ మూత్రపిండాలపై సాధారణం కంటే ఎక్కువ ఒత్తిడిని కలిగిస్తుందని పరిశోధనలు సూచిస్తున్నాయి, దీని కారణంగా సాధారణ మూత్రపిండాల పనితీరులో సమస్య ఏర్పడుతుంది. దీనితో పాటు, వ్యక్తి యొక్క సిరల్లో వాపు సమస్య కూడా ఉండవచ్చు.

Whats_app_banner

సంబంధిత కథనం