AP Govt Recruitment 2024 : ఏపీ వైద్యారోగ్యశాఖలో 280 ఉద్యోగాలు - ఆన్ లైన్ దరఖాస్తులకు మరికొన్ని గంటలే గడువు-apmsrb recruiting for 280 posts of civil assistant surgeon applications ends on 13 december 2024 ,career న్యూస్
తెలుగు న్యూస్  /  career  /  Ap Govt Recruitment 2024 : ఏపీ వైద్యారోగ్యశాఖలో 280 ఉద్యోగాలు - ఆన్ లైన్ దరఖాస్తులకు మరికొన్ని గంటలే గడువు

AP Govt Recruitment 2024 : ఏపీ వైద్యారోగ్యశాఖలో 280 ఉద్యోగాలు - ఆన్ లైన్ దరఖాస్తులకు మరికొన్ని గంటలే గడువు

Maheshwaram Mahendra Chary HT Telugu
Dec 12, 2024 02:12 PM IST

APMSRB Civil Assistant Surgeon Recruitment 2024 : ఏపీలో సివిల్ అసిస్టెంట్ సర్జన్ల ఖాళీల భర్తీకి దరఖాస్తులను స్వీకరిస్తున్నారు. అన్ని విభాగాల్లో కలిపి 280 ఖాళీలు ఉన్నాయి. దరఖాస్తుల స్వీకరణకు రేపటి(డిసెంబర్ 13)తో గడువు పూర్తి కానుంది. అర్హులైన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని అధికారులు సూచించారు.

సివిల్ అసిస్టెంట్ సర్జన్ పోస్టులు - దరఖాస్తులకు డిసెంబర్ 13 చివరి తేదీ
సివిల్ అసిస్టెంట్ సర్జన్ పోస్టులు - దరఖాస్తులకు డిసెంబర్ 13 చివరి తేదీ

సివిల్ అసిస్టెంట్ సర్జన్ ఉద్యోగాల భర్తీకి ఏపీ మెడికల్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డు నోటిఫికేషన్ జారీ చేసిన సంగతి తెలిసిందే. ఇందుకు సంబంధించి ఆన్ లైన్ దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ కొనసాగుతోంది. అయితే ఈ గడువు రేపటితో(డిసెంబర్ 13, 2024)తో పూర్తి కానుంది. అర్హులైన అభ్యర్థులు వెంటనే అప్లికేషన్ చేసుకోవాలని అధికారులు సూచించారు.

మొత్తం 280 ఖాళీలు - అర్హతలు

ఈ రిక్రూట్ మెంట్ లో భాగంగా మొత్తం 280 ఖాళీలను భర్తీ చేస్తారు. బ్యాక్‌లాగ్, రెగ్యూలర్ పోస్టులు, పీహెచ్‌సీలు, ఇతర వైద్య ఆరోగ్య సంస్థల్లో రెగ్యులర్ ప్రాతిపదికన నియామకాలు చేపట్టనున్నారు.

ఎంబీబీఎస్ లో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. ఓసీ అభ్యర్థులు 42 ఏళ్లలోపు ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులు 47లోపు ఉన్న వాళ్లు దరఖాస్తు చేసుకోవచ్చు. ఓసీ అభ్యర్థులు రూ. 1000 చెల్లించాలి. బీసీ, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ అభ్యర్థులు రూ. 500 చెల్లించాలని నోటిఫికేషన్ లో పేర్కొన్నారు. 

జోన్ల వారీగా ఖాళీలను నిర్ణయించారు. రాష్ట్రంలో మొత్తం 4 జోన్లు ఉన్నాయి. స్థానిక అభ్యర్థులకు రిజర్వేషన్లు వర్తిస్తాయి. వంద మార్కులను ప్రమాణికంగా తీసుకొని నియామాకాలు చేపడుతారు. కాంట్రాక్ట్ సర్వీస్ చేసిన వారికి వెయిటేజీ మార్కులు ఇస్తారు. కేవలం ఆన్ లైన్ లో మాత్రం అప్లికేషన్లు స్వీకరిస్తారని అధికారులు స్పష్టం చేశారు.

Whats_app_banner