AP Doctors Recruitment: ఏపీలో డాక్టర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్లు, 280 సివిల్ అసిస్టెంట్ సర్జన్లు,97 డాక్టర్ పోస్టులు-massive recruitment drive for civil assistant surgeons in government hospitals ,career న్యూస్
తెలుగు న్యూస్  /  career  /  Ap Doctors Recruitment: ఏపీలో డాక్టర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్లు, 280 సివిల్ అసిస్టెంట్ సర్జన్లు,97 డాక్టర్ పోస్టులు

AP Doctors Recruitment: ఏపీలో డాక్టర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్లు, 280 సివిల్ అసిస్టెంట్ సర్జన్లు,97 డాక్టర్ పోస్టులు

AP Doctors Recruitment: ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ ఆసుపత్రుల్లో భారీగా డాక్టర్ల పోస్టుల భర్తీకి నోటిఫికేషన్లు విడుదలవుతున్నారు. 280 సివిల్ అసిస్టెంట్ సర్జన్లతో పాటు సెకండరీ హెల్త్‌లో మరో 97 మంది డాక్టర్ల భర్తీకి డిసెంబర్ 4 నుంచి 13 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తుకుచేసుకోవచ్చు.

ఆంధ్రప్రదేశ్‌ వైద్య శాఖలో భారీగా వైద్యుల నియాకం

AP Doctors Recruitment: ఆంధ్రప్రదేశ్‌లో భారీగా వైద్యుల నియామకాలకు ప్రభుత్వం అమోదం తెలిపింది. తాజా నియామకాల్లో రెగ్యులర్‌ పోస్టులతో పాటు బ్యాక్‌లాగ్ పోస్టులను కూడా భర్తీ చేయనున్నారు. అభ్యర్థుల అర్హతలు, మార్గదర్శకాలు నోటిఫికేషన్‌లో వెల్లడిస్తారు.

ప్రభుత్వ ఆసుత్రుల్లో డాక్టర్ల పోస్టుల భర్తీకి విడివిడిగా రెండు నోటిఫికేషన్లను ఏపీ ప్రభుత్వం జారీ చేసింది. ప్రజారోగ్య కుటుంబ సంక్షేమ శాఖ డైరెక్టర్ పరిధిలో, ఏపీ మెడికల్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డు 280 సివిల్ అసిస్టెంట్ సర్జన్ల ఖాళీల భర్తీ కోసం ఒక నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఈ ఖాళీల్లో రెగ్యులర్‌ ప్రాతిపదికన జరిగే నియామకాలతో పాటు బ్యాక్‌లాగ్ పోస్టులు కూడా కలిసి ఉన్నాయి.

నోటిఫికేషన్‌ ప్రకారం, ఎంపికైన వారిని పీహెచ్‌సీలు/ఇతర వైద్య సంస్థల్లో నియమిస్తారు. అర్హత గల అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. https://apmsrb.ap.gov.in/msrb/ వెబ్‌సైట్‌లో దరఖాస్తు ఫారం ఉంటుంది, డిసెంబర్ 4 నుంచి 13 వరకు దరఖాస్తు చేసుకోడానికి అవకాశం ఉంది.

సెకండరీ ఆసుపత్రుల్లో మరో 97 డాక్టర్ పోస్టుల భర్తీ

డైరెక్టర్ ఆఫ్ సెకండరీ హెల్త్ - ఏపీ వైద్య విధాన పరిషత్‌ పరిధిలో 97 సివిల్ అసిస్టెంట్ సర్జన్ స్పెషలిస్ట్/సివిల్ అసిస్టెంట్ సర్జన్ జనరల్ ఖాళీల కోసం మరో నోటిఫికేషన్‌ జారీ అయింది. వీటిలోనూ రెగ్యులర్‌, బ్యాక్‌లాగ్ పోస్టులు కలిసి ఉన్నాయి.

సివిల్ అసిస్టెంట్ సర్జన్, సర్జన్‌ జనరల్ పోస్టుల అర్హతలు, మార్గదర్శకాలు https://apmsrb.ap.gov.in/msrb/ , https://hmfw.ap.gov.in/ , https://cfw.ap.nic.in/ వెబ్‌సైట్‌లలో అందుబాటులో ఉన్నాయి. అర్హతలు, వివరణాత్మక మార్గదర్శకాలు సంబంధిత వెబ్‌సైట్‌‌లలో అందుబాటులో ఉన్నాయి. దరఖాస్తు ఫారం కూడా ఆన్‌లైన్‌లో ఉంటుంది. అర్హులైన వైద్య అభ్యర్థులు డిసెంబర్ 4 నుంచి 13 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.

టాపిక్