తెలంగాణ వైద్యారోగ్యశాఖలో ఫార్మాసిస్ట్ గ్రేడ్ – 2 పోస్టులను భర్తీ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవలనే రాత పరీక్షలు పూర్తి అయ్యాయి. అయితే ఇందుకు సంబంధించిన ప్రాథమిక కీలను వైద్య, ఆరోగ్య సేవల రిక్రూట్‌మెంట్ బోర్డు విడుదల చేసింది. అంతేకాకుండా అభ్యర్థుల రెస్పాన్స్ షీట్లను కూడా వెబ్ సైట్ లో ఉంచింది.
ప్రాథమిక కీపై అభ్యంతరాలు ఉంటే డిసెంబర్ 5వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు పంపాలని అధికారులు తెలిపారు. అభ్యంతరాలకు సంబంధించిన డాక్యుమెంట్లను కూడా అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది. ఆన్ లైన్ లోనే చేయాలని అధికారులు స్పష్టం చేశారు.
ఫార్మాసిస్ట్ గ్రేడ్-2 పోస్టుల భర్తీకి నవంబర్ 30వ తేదీన పరీక్ష నిర్వహించారు. 732 పోస్టులకు 27,101 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. 24,578 మంది(90.69 శాతం) హాజరయ్యారు.
వైద్యారోగ్య మొదట ఇచ్చిన నోటిఫికేషన్ ప్రకారం… 633 ఫార్మాసిస్ట్ ఉద్యోగాలను భర్తీ చేస్తామని పేర్కొంది. ఆ తర్వాత మరో 99 ఫార్మాసిస్ట్ పోస్టులను కూడా భర్తీ చేయాలని నిర్ణయించింది. దీంతో మొదట ఇచ్చిన నోటిఫికేషన్ లోనే వీటిని చేరుస్తూ… మరో ప్రకటన విడుదల చేసింది. ఫలితంగా ఫార్మాసిస్ట్ గ్రేడ్ 2 ఉద్యోగాల సంఖ్య 732కి చేరింది.
సంబంధిత కథనం