ITBP Recruitment : ఐటీబీపీలో వివిధ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్స్​- పూర్తి వివరాలు..-itbp recruitment 2024 apply online for latest and upcoming vacancies ,career న్యూస్
తెలుగు న్యూస్  /  career  /  Itbp Recruitment : ఐటీబీపీలో వివిధ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్స్​- పూర్తి వివరాలు..

ITBP Recruitment : ఐటీబీపీలో వివిధ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్స్​- పూర్తి వివరాలు..

Sharath Chitturi HT Telugu
Dec 03, 2024 11:24 AM IST

ITBP recruitment online apply : ఐటీబీపీలో వివిధ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్స్​ వచ్చాయి. వీటిల్లో కొన్నింటికి అప్లికేషన్​ ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైంది. పూర్తి వివరాలను ఇక్కడ తెలుసుకోండి..

ఐటీబీపీలో వివిధ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్స్!
ఐటీబీపీలో వివిధ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్స్!

వివిధ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్స్​ని విడుదల చేసింది ఇండో టిబెటిన్​ బార్డర్​ పోలీస్​ ఫోర్స్​ (ఐటీబీపీ). ఇందులో ఐటీబీపీ సబ్​ ఇన్​స్పెక్టర్​, హెడ్​ కానిస్టేబుల్​, కానిస్టేబుల్​ పోస్టులు ఉన్నాయి. ఐటీబీపీ రిక్రూట్​మెంట్​ వివరాలను ఇక్కడ చూసేయండి..

ఐటీబీపీ రిక్రూట్​మెంట్​ వివరాలు..

ఐటీబీపీ హెడ్​ కానిస్టేబుల్​ - కానిస్టేబుల్​ మోటార్​ మెకానిక్​:-

  • మొత్తం పోస్టులు 51,
  • అప్లికేషన్​ ప్రారంభ తేదీ- 24-12-2024
  • అప్లికేషన్​కి చివరి తేదీ- 22-01-2025
  • వయస్సు పరిమితి- 18-25ఏళ్లు

ఐటీబీపీ ఇన్​స్పెక్టర్​ హిందీ ట్రాన్స్​లేటర్​-

  • మొత్తం పోస్టులు 15
  • అప్లికేషన్​ ప్రారంభ తేదీ- 10-12-2024
  • అప్లికేషన్​కి చివరి తేదీ- 08-01-2025
  • వయస్సు పరిమిత- 30ఏళ్లు

ఐటీబీపీ అసిస్టెంట్​ సర్జన్​ వెటర్నరీ-

  • మొత్తం పోస్టులు 27
  • అప్లికేషన్​ ప్రారంభ తేదీ- 25-11-2024
  • అప్లికేషన్​కి చివరి తేదీ- 24-12-2024

ఐటీబీపీ ఎస్​ఐ/ హెచ్​ఐ/ కానిస్టేబుల్​ టెలీకమ్యూనికేషన్​-

  • మొత్తం పోస్టులు 526
  • అప్లికేషన్​ ప్రారంభ తేదీ- 15-11-2024
  • అప్లికేషన్​కి చివరి తేదీ- 14-12-2024

రూల్స్​కి అనుగుణంగా వయస్సు పరిమితిలో సడలింపులు ఉంటాయి.

అప్లికేషన్​ ఫీజు:-

జనరల్​/ ఓబీసీ/ ఈడబ్ల్యూఎస్​- రూ. 100

ఎస్​సీ/ ఎస్​టీ/ పీహెచ్​- 0

అన్ని కేటగిరీల మహిళలు- 0

డెబిట్​ కార్డు, క్రెడిట్​ కార్డు, నెట్​ బ్యాంకింగ్​, ఈ చలాన్​ల ద్వారా ఫీజులు చెల్లించవచ్చు. గడువులోగా అప్లికేషన్​, ఫీజు చెల్లింపు వంటిని పూర్తి చేయాలని గుర్తుపెట్టుకోవాలి.

ఐటీబీపీ రిక్రూట్​మెంట్​లో వివిధ పోస్టుల కోసం ఆన్​లైన్​లో అప్లై చేసుకోవచ్చు.

నోటిఫికేషన్స్​ వివరాలు..

విద్యార్హత, వేతనం, వయస్సు పరిమితితో పాటు ఇతర వివరాల కోసం..

ఐటీబీపీ హెడ్​ కానిస్టేబుల్​ - కానిస్టేబుల్​ మోటార్​ మెకానిక్​ కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

ఐటీబీపీ ఇన్​స్పెక్టర్​ హిందీ ట్రాన్స్​లేటర్ నోటిఫికేషన్​ కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

ఐటీబీపీ అసిస్టెంట్​ సర్జన్​ వెటర్నరీ నోటిఫికేషన్​ కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

ఐటీబీపీ ఎస్​ఐ/ హెచ్​ఐ/ కానిస్టేబుల్​ టెలీకమ్యూనికేషన్​ కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

కర్ణాటక బ్యాంక్​లో రిక్రూట్​మెంట్​..

నిరుద్యోగులకు, బ్యాంకు ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తున్న వారికి అలర్ట్​! కర్ణాటక బ్యాంక్​ లిమిటెడ్​ (కేబీఎల్​) ప్రొబేషనరీ ఆఫీసర్​ స్కేల్​ 1 రిక్రూట్​మెంట్​ 2024 ప్రక్రియ ప్రారంభమైంది. ఆసక్తిగల వారు కేబీఎల్​ అధికారిక వెబ్​సైట్​ (karnatakabank.com) లో అప్లికేషన్​ని దాఖలు చేయవచ్చు. ఈ నేపథ్యంలో ఈ బ్యాంకు ఉద్యోగులకు సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకునేందుకు ఇక్కడ క్లిక్​ చేయండి.

Whats_app_banner

సంబంధిత కథనం