Pushpa 2 First Review: పుష్ప 2 ఫస్ట్ రివ్యూ.. ఇంటర్వెల్, క్లైమ్యాక్స్ అదుర్స్.. బన్నీకి మరో నేషనల్ అవార్డు ఖాయమట!-pushpa 2 first review allu arjun movie mind blowing fahadh faasil next level says umair sandhu ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Pushpa 2 First Review: పుష్ప 2 ఫస్ట్ రివ్యూ.. ఇంటర్వెల్, క్లైమ్యాక్స్ అదుర్స్.. బన్నీకి మరో నేషనల్ అవార్డు ఖాయమట!

Pushpa 2 First Review: పుష్ప 2 ఫస్ట్ రివ్యూ.. ఇంటర్వెల్, క్లైమ్యాక్స్ అదుర్స్.. బన్నీకి మరో నేషనల్ అవార్డు ఖాయమట!

Hari Prasad S HT Telugu

Pushpa 2 First Review: పుష్ప 2 మూవీ ఫస్ట్ రివ్యూ వచ్చేసింది. ఈ ఏడాది మోస్ట్ అవేటెడ్ మూవీస్ లో ఒకటైన ఈ సీక్వెల్ తో అల్లు అర్జున్ కు మరో నేషనల్ అవార్డు ఖాయమట. ముఖ్యంగా ఇంటర్వెల్, క్లైమ్యాక్స్ మరో లెవల్ అంటున్నారు.

పుష్ప 2 ఫస్ట్ రివ్యూ.. ఇంటర్వెల్, క్లైమ్యాక్స్ అదుర్స్.. బన్నీకి మరో నేషనల్ అవార్డు ఖాయమట!

Pushpa 2 First Review: పుష్ప 2 గురువారం (డిసెంబర్ 5) ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కాబోతోంది. అయితే బుధవారమే (డిసెంబర్ 4) రాత్రి 9.30 గంటల నుంచి తెలుగు రాష్ట్రాల్లో స్పెషల్ షోలు వేస్తున్నారు. మూవీని ఎప్పుడెప్పుడు చూడాలా అని అభిమానులు ఎదురు చూస్తున్న వేళ పుష్ప 2 ఫస్ట్ రివ్యూ వచ్చేసింది. ఫిల్మ్ క్రిటిక్, ఓవర్సీస్ సెన్సార్ బోర్డు సభ్యుడైన ఉమేర్ సంధు ఈ సినిమా రివ్యూ ఇస్తూ చేసిన పోస్ట్ వైరల్ అవుతోంది.

పుష్ప 2 ఫస్ట్ రివ్యూ

పుష్ప 2 ది రూల్ మూవీని ఇప్పటికే చూసిన ఉమేర్ సంధు.. తన రివ్యూను సోషల్ మీడియా ద్వారా ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చాడు. ఈ మూవీ బ్లాక్ బస్టర్ పైసా వసూల్ ఎంటర్టైనర్ అని అతడు అన్నాడు. సినిమాలోని ఇంటర్వెల్, క్లైమ్యాక్స్ హైలైట్ అని.. అల్లు అర్జున్ కు మరో నేషనల్ అవార్డు ఖాయమని కూడా అనడం విశేషం. రష్మిక మందన్నా, ఫహాద్ ఫాజిల్ నటనను కూడా ఉమేర్ ఆకాశానికెత్తాడు.

"క్లాసెస్, మాసెస్ అందరూ మెచ్చే పైసా వసూల్, సీటీ మార్ ఎంటర్టైనర్ ఇది. బాక్సాఫీస్ దగ్గర ఈ మూవీ రికార్డులు బ్రేక్ చేయడం ఖాయం. ఈ ఏడాది బిగ్గెస్ట్ హిట్ మూవీగా నిలవనుంది" అని ఉమేర్ స్పష్టం చేశాడు.

అల్లు అర్జున్‌కు మరో నేషనల్ అవార్డు ఖాయం

పుష్ప 2 మూవీలో నటీనటుల నటన గురించి కూడా ఉమేర్ సంధు ప్రత్యేకంగా ప్రస్తావించాడు. ఈ సందర్భంగా బన్నీకి మరో నేషనల్ అవార్డు ఖాయమని అతడు అనడం విశేషం. "అల్లు అర్జున్ మంచి ఫామ్ లో ఉన్నాడు. తన మాస్ అవతారంతో అందరినీ మెప్పిస్తాడు. అతని నటన అద్భుతం. కామెడీ టైమింగ్ బాగుంది. మరో నేషనల్ అవార్డు" అని ఉమేర్ అన్నాడు. పుష్ప 1 మూవీ కోసం అల్లు అర్జున్ ఉత్తమ నటుడిగా నేషనల్ అవార్డు గెలిచిన విషయం తెలిసిందే. ఈ ఘనత సాధించిన తొలి తెలుగు నటుడిగా బన్నీ నిలిచాడు.

రష్మిక మందన్నా కూడా చాలా బాగా చేసిందని చెప్పాడు. అయితే మూవీలో ఫహాద్ ఫాజిల్ నటన కూడా మరో లెవెల్ అని తెలిపాడు. పుష్ప ఫస్ట్ పార్ట్ చివర్లో వచ్చే ఈ మలయాళ నటుడు.. ఈ సీక్వెల్లో పూర్తి స్థాయిలో కనిపించనున్నాడు. "క్లైమ్యాక్స్ ఈ మూవీలో ప్రత్యేకంగా నిలుస్తుంది. ఇంటర్వెల్ బ్లాక్ మైండ్ బ్లోయింగ్. ఇండియన్ సినిమాలో గతంలో ఎప్పుడూ రాని ఓ భిన్నమైన మసాలా మూవీ ఇది" అని ఉమేర్ అన్నాడు.

పుష్ప 2 మూవీ కోసం మూడేళ్లుగా అభిమానులు ఎదురు చూస్తున్నారు. సినిమాకు విపరీతమైన హైప్ నెలకొంది. ఆ ప్రభావం అడ్వాన్స్ బుకింగ్స్ పై కనిపిస్తోంది. సినిమా తొలి రోజే రూ.100 కోట్లకుపైగా, ఫస్ట్ వీకెండ్ లో రూ.200 కోట్లకుపైగా వసూలు చేయడం ఖాయంగా కనిపిస్తోంది. ఇప్పటికే బుకింగ్స్ లో బాహుబలి 2, కేజీఎఫ్ 2, కల్కి 2898 ఏడీ, ఆర్ఆర్ఆర్ లాంటి సినిమాల రికార్డులను బ్రేక్ చేసింది.