Bigg Boss: బిగ్‌బాస్ నుంచి కార్తీక దీపం విలన్ సెల్ఫ్ ఎలిమినేట్ - క్షమాపణలు చెబుతూ పోస్ట్
Bigg Boss: కార్తీక దీపం ఫేమ్ శోభాశెట్టి అలియాస్ మోనిత కన్నడ బిగ్‌బాస్ నుంచి సెల్ఫ్ ఎలిమినేట్ అయ్యింది. తన ఆరోగ్యం సహకరించకపోవడంతో ఆటపై ఫోకస్ పెట్టలేకపోతున్నానని, అందుకే బిగ్‌బాస్ ప్రయాణానికి ముగింపు పలికానంటూ శోభాశెట్టి ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ పెట్టింది.
Bigg Boss: కార్తీక దీపం సీరియల్ ఫేమ్ శోభాశెట్టి ఇటీవలే కన్నడ బిగ్‌బాస్‌లోకి వైల్డ్ కార్డ్ ద్వారా ఎంట్రీ ఇచ్చింది. ఆమె బిగ్‌బాస్ జర్నీకి అనుకోకుండా రెండు వారాల్లోనే పుల్‌స్టాప్ పడింది. కన్నడ బిగ్‌బాస్ నుంచి శోభాశెట్టి సెల్ఫ్ ఎలిమినేట్ అయ్యింది. అనారోగ్య కారణాల వల్లే బిగ్‌బాస్ నుంచి సెల్ఫ్ ఎలిమినేట్ అవుతోన్నట్లు శోభాశెట్టి పోస్ట్ పెట్టింది.
ఆరోగ్యం సహకరించడం లేదు...
బిగ్‌బాస్‌షోలో ముందుగు సాగాలనే ఉన్నా ఆటపై ఫోకస్ పెట్టేందుకు తన ఆరోగ్యం సహకరించడం లేదని అందుకు సెల్ఫ్ ఎలిమినేట్ అవ్వాల్సివచ్చిందని ఇన్‌స్టాగ్రామ్‌లో శోభాశెట్టి ఓ పోస్ట్ పెట్టింది.
అందుకే ముగింపు పలికా...
“నా బిగ్‌బాస్ జర్నీ ఊహించని విధంగా ముగిసింది. ఈ మలుపు వెనుక ఓ బలమైన కారణం ఉంది. బాగా ఆడాలని, చివరి వరకు పోరాడాలనే బిగ్‌బాస్‌లో అడుగుపెట్టాను. ఆటపై దృష్టిపెడుతూ ముందుకు సాగేందుకు నా ఆరోగ్యం సహకరించడం లేదు. దేనిని తేలిగ్గా తీసుకోవడం నాకు ఇష్టం ఉండదు. నా ఆరోగ్యాన్ని కాపాడుకోవడమే ముఖ్యమనే ఆలోచనతో బిగ్‌బాస్ ప్రయాణానికి ముగింపు పలికాను” అని శోభాశెట్టి ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్‌లో తెలిపింది.
తెలిసో...తెలియకో...
బిగ్‌బాస్ హౌజ్‌లో ఉన్న తక్కువ టైమ్‌లోనే ఎంతో మంది ప్రేమను, అభిమానాన్ని పొందండం ఆనందంగా ఉందని శోభాశెట్టి అన్నది. తెలిసో, తెలియకో ఎవరిమనసునైనా నొప్పించి ఉంటే క్షమించాలని తెలిపింది. తనకు బిగ్‌బాస్‌లో పాల్గొనే అవకాశం ఇచ్చిన కలర్స్ కన్నడ ఛానెల్ టీమ్‌తో పాటు హోస్ట్ కిచ్చా సుదీప్‌కు కృతజ్ఞతలు చెప్పింది శోభాశెట్టి. నూతనోత్సాహంతో అందరిని ఎంటర్‌టైన్ త్వరలోనే మీ ముందుకు వస్తానని ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్‌లో శోభాశెట్టి పేర్కొన్నది.
రెండు వారాలే...
నవంబర్17న వైల్డ్ కార్డ్ ద్వారా కన్నడ బిగ్‌బాస్‌లోకి శోభాశెట్టి అడుగుపెట్టింది. కేవలం రెండు వారాల్లోనే తన అగ్రెసివ్ ఆటతీరుతో అదరగొట్టింది. పలుమార్లు హోస్ట్ కిచ్చా సుదీప్ నుంచి వార్నింగ్‌లను అందుకుంది. మరో నాలుగైదు వారాలు ఖచ్చితంగా బిగ్‌బాస్‌లో శోభాశెట్టి కొనసాగడం ఖాయమని అభిమానులు అనుకున్నారు. కానీ సెల్ఫ్ ఎలిమినేట్ అయ్యి వారికి షాకిచ్చింది.
కార్తీక దీపంలో విలన్‌గా...
కార్తీక దీపం సీరియల్‌లో మోనిత పాత్రతో తెలుగు ప్రేక్షకులకు చేరువైంది శోభా శెట్టి. ఈ సీరియల్‌లో వంటలక్క, డాక్టర్ బాబులతో పాటు మోనిత పాత్ర కూడా పాపులర్ అయ్యింది. డాక్టర్ బాబుపై పిచ్చి ప్రేమతో వంటలక్కను కష్టాలు, కన్నీళ్లు పెట్టించే పాత్రలో తన విలనిజంతో బుల్లితెర అభిమానులను ఆకట్టుకుంది శోభా శెట్టి.
బిగ్‌బాస్ తెలుగు సీజన్ 7లో...
కన్నడ బిగ్‌బాస్ కంటే ముందు తెలుగు బిగ్‌బాస్ సీజన్ 7లోకి కంటెస్టెంట్‌గా ఎంట్రీ ఇచ్చిన శోభాశెట్టి ఫైనల్ చేరుకున్నది. 98వ రోజు ఎలిమినేట్ అయ్యింది.బిగ్‌బాస్ సీజన్ 7లోనే తన ప్రియుడిని అభిమానులకు పరిచయం చేసింది శోభాశెట్టి. కార్తీక దీపం సీరియల్‌లో డాక్టర్ బాబు తమ్ముడిగా నటించిన ఆదిత్య అలియాస్ యశ్వంత్ రెడ్డిని తాను ప్రేమిస్తోన్నట్లు చెప్పింది శోభా శెట్టి. ప్రియుడు ఆదిత్యతో కలిసి శోభాశెట్టి కలిసి బుజ్జి బంగారం అనే సినిమా కూడా చేశారు.
పది సీరియల్స్...
తెలుగులో కార్తీక దీపంతో పాటు అష్టాచమ్మా సీరియల్స్ చేసింది శోభాశెట్టి. కన్నడంలో రుక్కు, కావేరితో పాలు పదికిపైగా సీరియల్స్‌లో లీడ్ రోల్స్‌చేసింది. అంజని పుత్ర, హరీషా వయసు 36తో పాటు మరికొన్ని కన్నడ సినిమాల్లో డిఫరెంట్ క్యారెక్టర్స్ చేసింది.