NNS December 4th Episode: ​​​​​​​మనోహరి ప్లాన్ సక్సెస్.. ఎక్స్‌కర్షన్‌కు పిల్లలు.. ఆందోళనలో మిస్సమ్మ..-zee telugu serial nindu noorella saavasam today december 4th episode nns serial today episode ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Nns December 4th Episode: ​​​​​​​మనోహరి ప్లాన్ సక్సెస్.. ఎక్స్‌కర్షన్‌కు పిల్లలు.. ఆందోళనలో మిస్సమ్మ..

NNS December 4th Episode: ​​​​​​​మనోహరి ప్లాన్ సక్సెస్.. ఎక్స్‌కర్షన్‌కు పిల్లలు.. ఆందోళనలో మిస్సమ్మ..

Hari Prasad S HT Telugu
Dec 04, 2024 06:48 AM IST

NNS December 4th Episode: నిండు నూరేళ్ల సావాసం బుధవారం (డిసెంబర్ 4) ఎపిసోడ్లో మనోహరి, అంజు ప్లాన్ సక్సెస్ అవుతుంది. పిల్లలు ఎక్స్‌కర్షన్ కు వెళ్లేందుకు అమర్ అంగీకరిస్తాడు. దీంతో మిస్సమ్మలో ఆందోళన మొదలవుతుంది.

మనోహరి ప్లాన్ సక్సెస్.. ఎక్స్‌కర్షన్‌కు పిల్లలు.. ఆందోళనలో మిస్సమ్మ..
మనోహరి ప్లాన్ సక్సెస్.. ఎక్స్‌కర్షన్‌కు పిల్లలు.. ఆందోళనలో మిస్సమ్మ..

NNS December 4th Episode: ​​​​​​​జీ తెలుగు సీరియల్ నిండు నూరేళ్ల సావాసం ఈరోజు (డిసెంబర్ 4) ఎపిసోడ్లో ఏం జరిగిందో ఒకసారి చూద్దాం. స్కూల్లో ఎక్స్​కర్షన్​కి వెళ్తామని పిల్లలు మిస్సమ్మతో వాదిస్తూ ఉంటారు. మనోహరి కావాలని పిల్లలకు సపోర్ట్​ చేస్తూ వాళ్లని తనవైపు తిప్పుకోవాలనుకుంటుంది. డాడీ ఓకే అంటే ఇంకెవరితో మనకు అవసరం లేదు అని అంజు అంటుంది.

అవును అంజు.. నేను అమర్ తో మాట్లాడి ఒప్పిస్తాను అంటుంది మనోహరి. పిల్లలు అందరూ వెళ్లిపోతారు. తర్వాత నిర్మల కోపంగా ఈ మనోహరి కావాలనే పిల్లలను మిస్సమ్మ మీదకు రెచ్చగొడుతుంది అంటుంది. అవునని, ఈ అమ్మాయిని చూసి పాపం అనుకునే లోపే ఇలా చేస్తుందంటాడు శివరాం.

తీవ్రవాదులు దొరికినా మిస్సమ్మలో ఆందోళన

తీవ్రవాదులను పట్టకున్న ఆర్మీ వాళ్లు అమర్ కు ఇన్ఫర్మేషన్‌ ఇవ్వగానే వెళ్తాడు. ఎక్కడ పట్టుకున్నారని అమర్‌ అడుగుతాడు. అరవింద్‌ ఎక్కడ అంటే.. అన్న దేశం దాటి ఎప్పుడో వెళ్లిపోయాడని తీవ్రవాది చెప్తాడు. నువ్వు వాడే టెక్నాలజీనే మేము వాడి నీ ఇంటి మీద దాడి చేశాం అంటాడు. ఎందుకు చేశారు ఇదంతా..? అని అమర్‌ అడిగితే మా అన్న పగ మేము తీర్చుకోవాలనుకున్నాం. అందుకే ఇలా చేశాం అంటాడు. ఇంతలో అమర్‌.. మిస్సమ్మకు వీడియో కాల్ చేసి తీవ్రవాదులను చూపించి.. రాత్రి అటాక్‌ చేసింది వీళ్లేనా అని అడిగితే వాళ్లేనని మిస్సమ్మ చెప్తుంది.

తర్వాత మిస్సమ్మ ఆలోచిస్తుంది. ఆరు వస్తుంది. దేని గురించి అంతలా ఆలోచిస్తున్నావు అని అడుగుతుంది. నిన్న అటాక్‌ చేసిన వాళ్ల గురించి అక్కా.. రాత్రి అటాక్‌ చేశారు. పొద్దునే దొరికిపోయారు అని చెప్తుంది. దీంతో ఇంకెందుకు ఆలోచన వాళ్లు దొరికేశారు అంటే ప్రమాదం లేనట్టే కదా..? అంటుంది ఆరు. లేదక్క ఇందాక వాళ్లను చూసినప్పుడు వాళ్ల కళ్లల్లో దొరికిపోయామనే భయం కానీ శిక్ష పడుతుందన్న భయం కానీ లేదక్కా.. చాలా కాన్ఫిడెంట్‌ గా ఉన్నారు.

అయ్యో మిస్సమ్మ నిన్న జరిగిన దానికి నువ్వు బాగా భయపడ్డట్టు ఉన్నావు. పిల్లలకు ఏమైనా అవుతుందేమోనన్న భయంతో ఇలా అవుతున్నావు. లేదంటే ఆర్మీ వాళ్ల అదుపులో ఉన్న ఆ రౌడీలు ఎక్స్‌కర్షన్‌ లో ఉన్న పిల్లలను ఏం చేస్తారు చెప్పు అని ఆరు వెళ్లిపోతుంది.

పట్టువీడని పిల్లలు

పిల్లలు అలిగి ఉండటంతో వాళ్ల దగ్గరకు వెళ్లి మిస్సమ్మ పొద్దటి నుంచి ఏమీ తినలేదు. ఇప్పుడు కూడా ఏమీ తినకపోతే నీరసం వస్తుంది అని పిలుస్తుంది. దీంతో శివరాం అమ్ము నువ్వు కూడా ఇలా చేస్తే ఎలా..? అంటాడు. మేము ఎక్స్‌కర్షన్‌కు వెళ్లాలి తాతయ్య.. పంపిస్తామనేవరకు ఏమీ తినము. మిస్సమ్మ నువ్వు డాడీతో మాట్లాడి ఒప్పిస్తానని చెప్పు.. ఇప్పుడే వచ్చి తింటాము అంటుంది అమ్ము.

ఇక్కడ సమస్య నేను ఒప్పుకోవడమో మీ నాన్న ఒప్పుకోవడమో కాదు. మీ సేఫ్టీ.. ప్లీజ్‌ సిచ్యుయేషన్‌ అర్థం చేసుకోండి అని బతిమాలుతుంది మిస్సమ్మ. ఇప్పటిదాకా మేము మిమ్మల్ని అర్థం చేసుకున్నాము. ఇప్పుడు మీరు మమ్మల్ని అర్థం చేసుకోండి అంటుంది అంజు. ఇంతలో శివరాం వీళ్లకు మనం చెప్తే వినరు వాళ్ల డాడీ వస్తారు అప్పుడు వింటారు అంటాడు శివరాం.

చెప్తే వింటారు మామయ్య.. చెప్పి ఒప్పిస్తాను అంటుంది మిస్సమ్మ. ఇంతలో అమర్‌ వచ్చిన కారు సౌండ్‌ విని అమర్‌ వచ్చాడు ఇక మనం వెళ్దాం పద అని మిస్సమ్మ, నిర్మల, శివరాం కిందకు వెళ్తారు. పిల్లలు మనోహరిని ఆంటీ తాతయ్య, నాన్నమ్మల దగ్గర మేనేజ్‌ చేశాము డాడీతో కష్టం అనుకుంటా అంటారు. ఏం లేదు మీరు ఇలాగే డ్రామా కంటిన్యూ చేయండి అని చెప్తుంది. అమర్‌ పైకి రాగానే అమర్‌ను చూడనట్టు పిల్లల్ని తినమని బతిమాలినట్టు మనోహరి నాటకం ఆడుతుంది.

ఎక్స్‌కర్షన్‌కు అమర్ గ్రీన్ సిగ్నల్

పిల్లల్ని ఎందుకు ఉదయం నుంచి తినలేదని అమర్ అడుగుతాడు. ఆ రౌడీలు దొరికారు కదా..? ఇక మేము ఎక్స్ కర్షన్‌కు వెళ్తాం డాడీ అని అడుగుతారు. ప్రమాదం ఇంకా పూర్తిగా పోలేదని అంత వరకు జాగ్రత్తగా ఉండాలని చెప్తాడు అమర్‌. ఇది జాగ్రత్తలా లేదు డాడ్‌ భయపడుతున్నట్టు ఉంది అంటుంది అంజు. రాథోడ్‌ పిల్లలు రేపు ఎక్స్‌ కర్షన్‌కు వెళ్తున్నారు. కావాల్సిన సెక్యూరిటీ ఏర్పాట్లు చేయ్‌ అని అమర్‌ చెప్పి వెళ్లిపోతాడు.

పిల్లలు, మనోహరి హ్యాపీగా ఫీలవుతారు. మిస్సమ్మ ఆలోచిస్తుంది. అమర్‌ రూంలో వర్క్‌ చేసుకుంటుంటే.. మిస్సమ్మ వచ్చి నాకెందుకో ఇది కరెక్టు కాదనిపిస్తుంది. వాళ్లు నిన్న అటాక్‌ చేయడం. పొద్దునే దొరికిపోవడం మీరు పిల్లలను ఎక్స్‌ కర్షన్‌కు పంపిస్తాననడం నాకెందుకో భయంగా ఉందండి. పొద్దున వాళ్లను చూసినప్పుడు వాళ్ల కళ్లల్లో బాధ కానీ పశ్చాతాపం కానీ ఏవీ లేవండి. పైగా వాళ్లు నలుగురే ఉన్నారని అనుకోలేం కదా..? బయట ఇంకా ఉండొచ్చు కదా..? అంటుంది మిస్సమ్మ.

అయినా ఎక్స్‌ కర్షన్‌కు ఆ రౌడీలకు సంబంధం ఏం ఉంటుంది. పిల్లల ఆనందం చెడగొట్టడం నాకు ఇష్టం లేదు మిస్సమ్మ. పిల్లలకు టైట్‌ సెక్యూరిటీ ఉంటుంది కదా..? అంటాడు అమర్‌. పంజరంలోంచి ఎంత అందమైన ప్రపంచాన్ని చూపించినా అది బంధించడమే అవుతుంది అని మిస్సమ్మ చెప్పి వెళ్లిపోతుంది. అమర్​ పిల్లలు ఎక్స్​కర్షన్​ వెళ్లడానికి ఒప్పుకుంటాడా? మనోహరి పిల్లలకు ఎలాంటి ప్రమాదం తెచ్చేందుకు ప్లాన్​ చేస్తుంది? అనే విషయాలు తెలియాలంటే ఈరోజు డిసెంబర్​ 04న ప్రసారం కానున్న నిండు నూరేళ్ల సావాసం సీరియల్​ తప్పకుండా చూడాల్సిందే!

Whats_app_banner